మీరు అబ్రాహాము సంతానం కాదు అని అంటున్న యేసు
అందుకు వారు ఆయనతో
మా తండ్రి అబ్రాహామనిరి;
యేసు: మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. (యోహాను 8:39)
ఇంతకీ అబ్రాహాము చేసిన గొప్ప పనులేమిటి? అబ్రాహాము సంతానం అనిపించుకోవాలంటే ఏం చేయాలి?
- చెల్లెని పెళ్లి చేసుకోవడం
అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది. ( ఆదికాండము 20:12)
- కన్న కొడుకుని యెహోవాకి బలి ఇవ్వాలనుకోవడం
దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా.. (ఆదికాండము 22:6)
- మొదటి భార్య కోసం రెండో భార్యని కొడుకుతో సహా గెంటేయడం.
అందుకు అబ్రాము( మొదటి భార్యతో ) ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా.. (ఆదికాండము 16:6)
- ఇంట్లో ఉన్న కొడుకులకి, బానిసలకి సున్నతి చేయించడం
అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను.
(ఆదికాండము 17:23)
ఇలాంటి మరెన్నో గొప్ప పనులు చేసిన అబ్రాహాము కుమారులు అయ్యుంటే మీరు కూడా ఆయనలాగే చేసేవారు కదా అంటున్న యేసు.
యోహాను 8:39
అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.
మీరు చెప్పండి. అబ్రాహాము చేసిన పనుల్లో గొప్ప పనులు ఏమున్నాయి.
వాటిలో చిన్నప్పుడు తెలియకుండా జరిగిన సున్నతి తప్ప ఇక యే క్రియ కూడా చేయలేదేమో యూదులు.
యేసుకి సమాధానం కావాలి. చెప్పండి.
అబ్రాహాము పిల్లలు అబ్రాహాము లా ప్రవర్తించాలా వద్దా?