
అవును అనే అంటోంది బైబిల్.
కావాలంటే ఈ రిఫరెన్స్ లు చూదండి.
రిఫరెన్స్ -1
ఇక్కడ బైబిల్ దేవుడు బాగా జనాభా పెంచి భూమి అంతా నిండిపొమ్మని ఆశీర్వదించాడు.
దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (ఆదికాండము 1:28)
God blessed them and said to them, “Be fruitful and increase in number; fill the earth and subdue it. Rule over the fish of the sea and the birds of the air and over every living creature that moves on the ground.” (Genesis 1:28)
రిఫరెన్స్ -2
ఇక్కడ కూడా సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని దేవుడు చెప్పాడు.
మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. (
ఆదికాండము 9:7)
As for you, be fruitful and increase in number; multiply on the earth and increase upon it.” (Genesis 9:7)
రిఫరెన్స్ -3
ఇక్కడ ఆ జనాభా ఎంత ఉంటుందో కూడా చెప్తున్నాడు. అంత జనాభాను తానే పెంచబోతున్నాను అని కూడా చెప్తున్నాడు.
ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. (ఆదికాండము 26:4)
I will make your descendants as numerous as the stars in the sky and will give them all these lands, and through your offspring all nations on earth will be blessed because Abraham obeyed me and kept my requirements, my commands, my decrees and my laws.” (Genesis 26:4-5)
ఫలించి అభివృద్ధి చెంది భూమి అంతా నిండిపోండి, దాన్ని భూమిని ఏలండి అని చెప్పిన దేవుడు జనాభా నియంత్రణ గురుంచి మాట్లాడకపోవడం ఎంత ప్రమాదమో నేటి సమాజం కళ్లారా చూస్తోంది .
అయితే దేవుడు ఎంత జనాభా పెంచుతా అన్నాడు? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి?
కొన్ని వందల కోట్లు.
మరి అంత జనాభాను భూమి భరించగలదా?
సమస్యలను తీర్చాల్సిన దేవుడే సమస్యలను సృష్టిస్తే ఎలా ?
ఇది చాలా ఘోరం.
దేవుడే జనాభాను పెంచుతున్నాడని తెలియక కుటుంబ నియంత్రణ పేరుతో ప్రపంచ దేశాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి వృథా ప్రయాసలు ఆపండి. ఎందుకు అంటే అవేవి వర్క్ అవుట్ అవ్వవు.
జనాభా పెరగాల్సిందే. యుద్ధం యెహోవాదే.