ఒక బానిస స్త్రీ అన్యాయం చేసిన యెహోవా!
- బైబిల్ దేవుడు చెప్పాడని తన రెండో భార్యని వదిలేసిన అబ్రాహాము.
- బానిస కొడుకు అబ్రాహాము కి వారసుడు కావడం యెహోవాకి ఇష్టం లేదా?
- బానిస స్త్రీకి బైబిల్ లో ఉండే హక్కులేమిటి?
ఈ పోయింట్స్ మీదే ఈరోజు పోస్ట్ అంతా ఉంటుంది.
బహుశా ఇది చాలా మందికి కొత్త విషయం అయ్యి ఉండవచ్చు.
అయితే బానిస స్త్రీల యెహోవా వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పడం నా ఉద్దేశ్యం. అలాగే అబ్రాహాము ఫ్యామిలీ లైఫ్ లో యెహోవా పాత్ర ని కూడా వివరిస్తాను.
…..
హగర్ :
ఈ పేరుతో ఆదికాండంలో అబ్రాహాముకి ఒక భార్య ఉన్నట్టు మనము చూస్తాము. ఆమె ఒకప్పుడు ఈజిప్ట్ లో బానిసగా ఉండేది. ఆమెని శారాయి (అబ్రాహాము చెల్లెలు / భార్య ) కొనుక్కుని తెచ్చుకుంటుంది. అబ్రాహాము 100 దగ్గరకి వస్తున్నా తనకు పిల్లలు కలగకపోవడంతో హగర్ ని అబ్రాహాము దగ్గరకి పంపిస్తుంది శారాయి. ( అంటే పెళ్లి చేసింది అన్నమాట ).
హగర్ కి కడుపు వస్తుంది. అప్పటి నుండి ఇంట్లో గొడవలు. Inferiority complex కి గురి అయిన శారాయి, హగర్ ని మొదటి సారి ఇంట్లో నుండి గెంటేస్తుంది. యెహోవా దూత ఆమెను ఓదార్చి, నీ సవతి సరిగ్గా ఉండమని చెప్పి ఇంటికి చేరుస్తుంది. హగర్ కి ఇస్మాయిల్ అనే కొడుకు పుడతాడు. తర్వాత శారాయి కి అనుగ్రహం వలన కొడుకు పుడతాడు.వాడి పేరు ఇస్సాకు.
హగర్ కొడుకు అబ్రాహాముకి వారసుడు కావడం శారాయికి ఇష్టం ఉండదు. దాంతో అబ్రాహాము చెప్తుంది. పంపించేయండి దాన్ని ఇంట్లో నుండి అని.. యెహోవా కి చెప్తాడు అబ్రాహాము. యెహోవా చెప్తాడు. నీ పెళ్ళాం చెప్పిన ప్రతి మాట విను. ఆమె చెప్పినట్టే చెయ్యమని అంటాడు యెహోవా.
అయితే దేవుడు.. “ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.” (ఆదికాండము 21:12)
“కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను”. (ఆదికాండము 21:14)
తర్వాత ఆమె నరకం చూస్తుంది.
పిల్లాడికి నీళ్లు కూడా ఎండలో ఇబ్బంది పడుతుంది.
ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.
అప్పుడు యెహోవాకి మనసు కరుగుతుంది. దేవదూతని పంపించి ఓదార్చుతాడు.
అలా మళ్ళీ ఆమె తన శేష జీవితాన్ని అలా బతికేస్తుంది. కొడుకు పెద్దవాడయ్యి ముస్లిం లకి మూలపురుషుడు అయ్యాడు. అత్తనొక మంచి విలుకాడు అయ్యాడు.
దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.(ఆదికాండము 21:20).
…..
ఈ కథలో అబ్రాహాము కొడుకు ఇస్సాకు అబ్రాహాముకి వారసుడు అవుతాడు. ఇస్మాయిల్ ( హగర్ కొడుకు ) అడవుల్లో పెరుగుతాడు. కారణం ఏమిటి?
హగర్ ఒక బానిస స్త్రీ కావడమే.
బానిస స్త్రీ అయిన హగర్ కొడుకు, అబ్రాహాముకి వారసుడు కాకుండా, యెహోవా ఎందుకు చేశాడు?
భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు.అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి. (సామెతలు 30:21)
చూశారుగా ఈ వాక్యాలు.!
- రాజారికమునకు వచ్చిన దాసుడు ( ఇస్మాయిల్ )
- యజమానురాలికి హక్కు దారురాలైన దాసి ( హగర్ )
యెహోవా కి ఇష్టం లేదు. వాళ్ళ వలన భూమి తట్టుకోలేక వణుకుతుంది.
అందుకే యెహోవా శారాయు కొడుకు అయిన ఇస్సాకు కే వారసత్వం కట్టబెట్టాడు. బానిస కొడుకు అడవుల్లో బతికేలా చేశాడు.
…..
హగర్ కి ఎందుకు ఇంత అన్యాయం చేశాడు బైబిల్ దేవుడు?
- ముసలి అబ్రాహాము దగ్గరకి పోయి పిల్లల్ని కనడం ఆమె తప్పా?
- అబ్రాహాముకి మొదటి కొడుకుని ( నిజానికి అతనే వారసుడు ) ఇవ్వడం తప్పా?
- కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసిన అబ్రాహాముని పన్నెత్తి మాట అనలేదు యెహోవా ఎందుకు? కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసిన అబ్రాహాము కి యే శిక్ష పడింది.
…
కొన్ని విషయాలు :
- యూదుల ఆచారం ప్రకారం ఇస్మాయిల్ కి, ఇస్సాకు కి సున్నతి చేయించాడు అబ్రాహాము. కానీ వారసుడు మాత్రం ఇస్సాకే.
- ఇద్దరు కొడుకులు కలిసి తండ్రిని పూడ్చారు. కానీ వారసుడు రెండో కొడుకే.
- ఆఖరిలో కొంత ఆస్తి కూడా ఇస్మాయిల్ కి ఇచ్చాడు అబ్రాహాము. కానీ వారసుడు ఇస్సాకే.
ఎందుకు అంటే ఇస్మాయిల్ ఒక బానిస స్త్రీకి పుట్టిన కొడుకు. వాడికి, వాడికి తల్లికి అంత సీన్ లేదని డిసైడ్ చేశాడు యెహోవా.
అందుకే అబ్రాహాము బలి ఇవ్వడానికి ఇస్సాకు ని తీసుకెళ్ళినప్పుడు నీ ఒక్కగానొక్క కొడుకు అంటాడు యెహోవా. అంటే ఇస్మాయిల్ ని అసలు అబ్రాహాము కొడుకు అని యెహోవా అనలేదు.
అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.(ఆదికాండము 22:2).
…..
ఇప్పుడు చెప్పండి..
- బానిస కి ఒక లాగా, మామూలు స్త్రీలకి ఒక లాగా తీర్పు చెప్పే వాడు దేవుడు ఎలా అవుతాడు.
- బానిస కొడుకు వారసుడు కాకూడదా?
- దాసి అయినంత మాత్రాన తన మొగుడు దగ్గర ఉండే అర్హత బానిస కోల్పోతుందా?
- కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అబ్రాహాము వదిలేసినప్పుడు యెహోవా అబ్రాహాముని ఎందుకు శిక్షించలేదు.
ఫైనల్ గా ఈ కథలో అన్యాయం అయిపోయింది మాత్రం హగర్ అనే బానిస స్త్రీ.. ఆమె కొడుకు ఇస్మాయిల్.
దానికి కారణం యెహోవా!