పంది మాంసం నిషేధించిన యెహోవా
పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము. (లేవీయకాండము11:7)
వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.(లేవీయకాండము11:8)
నేను మీ దేవుడనైన యెహోవాను. పరిశుద్దుడను గనుక మీరు పరిశుద్దులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. (లేవీయకాండము 11:44)
కానీ యేసు పందితో పాటు ప్రతి అడ్డమైన జంతువుని తినేయొచ్చు అంటాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా..? యేసు పరిశుద్దుడు కాదు. కాబట్టి క్రైస్తవులు అపరిశుద్ధిమైన ఆహారం తినేయవచ్చు. అపరిశుద్ధంగా జీవించవచ్చు.
బైబిల్ చదివితే అవును అనే సమాధానం వస్తుంది.
అది ఎలాగో చూద్దాం.
పందిని ఎందుకు తినకూడదు అన్న విషయంలో యెహోవా చెప్పిన కారణాలు రెండు.
- పంది అపరిశుద్ధ జంతువు 2. యెహోవా తనలాగే అందరిని పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు.
పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తిన కూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు. అవి మీకు అపవిత్రములు. (లేవీయకాండము 11: 6, 7)
నేను మీ దేవుడనైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. (లేవీయకాండము 11:44)
ఇప్పటికీ యెహోవా పరిశుద్ధుడు అని క్రైస్తవులు వాదిస్తారు. ఇప్పటికీ ఆహారాన్ని నెమరు వేయదు. కాబట్టి అది ఇప్పటికీ అపరిశుద్ధ జంతువు.
కాబట్టి ఇప్పటికీ వీటిలో మార్పు రాలేదు.
కారణాలలో మార్పు యెహోవాలో మార్పు ఎలా వచ్చింది ?
అసలు మాట మార్చే అవకాశం యెహోవాకు ఉందా?
- హెబ్రీయులకు 13:8
యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
పంది కూడా ఇప్పటికీ మారలేదు.
- కీర్తనల గ్రంథము 102:27
నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
పంది కూడా ఇప్పటికీ మారలేదు. ఇప్పటికీ అది నెమరు వేయదు . ఇప్పటికీ పేంటే తింటుంది.
మరి సడెన్ గా యెహోవా లో ఏది తిన్నా పర్వాలేదు . అన్ని మంచివే అని చెప్పే అంత మార్పు ఎందుకు వచ్చింది ?
మరి యేసు ఏమి చెప్తున్నాడో చూద్దాం.
- వలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని, లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. (మార్కు 7:15,16)
- మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. (1 కోరింథీయులకు 10:25,26)
- దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు. (1 తిమోతికి 4:4)
- తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. (రోమీయులకు 14:3)
God is not a man, that he should lie, nor a son of man, that he should change his mind. Does he speak and then not act? Does he promise and not fulfil?
కాబట్టి మార్పు వచ్చింది అని స్పష్టంగా అర్ధం అవుతోంది కదా !
కాబట్టి యెహోవా పరిశుద్ధుడు కావాలంటే ఈ మాట అన్నది యెహోవా అయ్యుండ కూడదు. ఎందుకు అంటే రెండు మాటలు ఒకే వ్యక్తి మాట్లాడడు. అలా మాట్లాడితే అతను దేవుడు కాడు .
సంఖ్యాకాండము 23:19
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
మైండ్ చేంజ్ చేసుకుంటే దేవుడు కాస్తా మనిషి అయిపోతాడు. అపరిశుద్ధ ఆహారం తినమని చెప్తే యేసు అపరిశుద్ధుడు అయిపోతాడు.
ఇప్పుడు ఎలా మరి ..!?