Jehovah's Discrimation on Widows, Orphans and gentiles
Jehovah's Discrimation on Widows, Orphans and gentiles విధవలపై, అనాధలపై, విదేశీయులపై యెహోవా/ బైబిల్ దేవుడి ప్రేమ ఎలాంటిది?

గంటా కృపారావు గారి కొత్త పోస్ట్ కి ఎప్పటిలాగే బైబిల్ రిఫరెన్స్లతోనే కౌంటర్

  1. కృపారావు గారు ఏమంటారంటే … మా దేవుడు విధవలని అనాధలని విదేశీయులని రక్షించే దేవుడు. వారిపై వివక్ష చూపే వారు వేరే దేవుళ్ళు /మతాలు అని. వారు హిందూ గ్రంధాల గురించే అంటున్నారని అనిపించినా ఆయన హిందూ గ్రంధాల నుండి ఎటువంటి రిఫరెన్స్ లు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇచ్చిన బైబిల్ రెఫరెన్సెస్ గురుంచి మాత్రమే కౌంటర్ పెడుతున్నాను. పైగా నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టారు . కాబట్టి నేను సమాధానం చెప్పి తీరాలి . ఇక మేటర్ లోకి వెళ్తాను.

విధవలపై, అనాధలపై, విదేశీయులపై ప్రేమ చూపాలి అంటూ కృపారావు గారు పెట్టిన వచనాలు చూడండి. తరువాత వాటికి ధీటైన వచనాలు నేను పెడతాను.

విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు. (నిర్గమకాండము 22:22)

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే. (యాకోబు 1:27)

ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు. (ద్వితీయోపదేశకాండము 10:18)

ఇలాంటి వచనాలు చూపించి ఒక పెద్ద వ్యాసం రాసి చూశారా మా దేవుడు ఎంత మంచి వాడో ? మీ దేవుడు చాలా వివక్ష చూపించారు అన్నారు కృపారావు గారు.

నిజానిజాలు ఇప్పుడు చూద్దాం.

Fact check: కృపారావు గారు చెప్పింది నిజమే. బైబిల్ దేవుడు అనాధలని, విధవలని, విదేశీయులని ప్రేమిస్తాడు .
But conditions apply. వారు యెహోవా భక్తులై వుండాలి. తన భక్తులు కానివారిపై కనీసం జాలి కూడా చూపడు.వాళ్లని ఘోరంగా శిక్షిస్తాడు.

వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువువారి యౌవనస్థులను చూచి సంతోషింపడు. వారిలో తలిదండ్రులు లేనివారియందైనను, వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. (యెషయా 9:17)

ఇక్కడ భక్తి హీనులు అయిన వారు(తన భక్తులు కానివారు) విధవలు అయినా, అనాథలైనా వాళ్ళని ఘోరంగా శిక్షిస్తా అంటున్నాడు యెహోవా.

  1. విధవలపై మా దేవుడు వివక్ష చూపలేదు

విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొన వలెను. (లేవీయకాండము 21:14

ఇక్కడ పవిత్రంగా బతికే యెహోవా గుళ్లో యాజకులు అపవిత్రులైన స్త్రీలు (విధవలు,భర్తకు దూరంగా ఉంటున్న వాళ్ళు ..) ఇలాంటి వారిని పెళ్లాడకూడదు అంటున్నాడు. విధవ అవడం వలన యాజకుడితో పెళ్ళికి DISQUALIFY చెయ్యడం అంటే వివక్షనే కదా!

ఇంకా విధవలకి విధవా వస్త్రాలు ధరింపజేయడం వివక్ష అయితే బైబిల్లో కూడా యూదులు ఈ ఆచారాన్ని పాటించారు. దీన్ని ఎక్కడ కూడా యెహోవా తప్పు పట్టలేదు.

జూదా ఇద్దరు కొడుకుల్ని పెళ్లాడిన తామారు వాళ్లిద్దరూ చనిపోయాక, మామతో సెక్స్ చేసిన తర్వాత విధవా వస్త్రాలు ధరించిందని బైబిల్ చెప్తోంది . మామతో పడుకోక ముందు కూడా ఆమె విధవా ధరించిన రిఫరెన్స్ ఉంది.

అప్పుడామె (తామారు) లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసికొనెను.(ఆదికాండము 38:19)

విధవలకు డ్రెస్ కోడ్ లేదా ఇంకేదైనా నియమం పెట్టడం, సమాజం నుండి వేరు చేయడం వివక్ష అయితే ఇది కూడా వివక్షనే అవుతుంది .

  1. విదేశీయులని ప్రేమించేవాడు మా దేవుడు

ఇది పచ్చి అబద్ధం. విదీశీయులని కుక్కలతో పోల్చాడు యెహోవా. చనిపోయిన / జంతువుల చేత చీల్చబడి చనిపోయిన జంతువులని కేవలం అన్యులకి /కుక్కలకు పెట్టమని అన్నాడు యెహోవా .

మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను (నిర్గమకాండము 22:31)

చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. (ద్వితీయోపదేశకాండము 14:21)

విదేశీయులపై వివక్ష అనే టాపిక్ పై ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే బైబిల్లో విధవలపై, అనాధలపై, విదేశీయులపై ఉన్న వివక్ష ని చూడాలి అంటే బైబిల్ ని పూర్తిగా చదవండి.

విధవలపై, అనాధలపై బైబిల్ వివక్ష :

https://www.facebook.com/106914574790243/posts/205020734979626/

విదేశీయులపై బైబిల్ వివక్ష :

https://www.facebook.com/106914574790243/posts/322153439933021/

ఇంకేదైనా వివక్ష గురుంచి కావాలంటే కింద కామెంట్ చేయండి. రిఫరెన్స్ లతో సమాధానం చెప్తాను.

ఎప్పటిలాగే మీ అభిమానానికి దాసుడు:

మీ రమణ నేషనలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *