JESUS AND JEHOVAH ARE ONE?

JESUS AND JEHOVAH ARE ONE?

బైబిల్ ప్రకారం (కొత్త నిబంధన+పాత నిబంధన) వాళ్ళ దేవుడు ఒక్కడే.

అలాగే యేసు, యెహోవా ఇద్దరూ ఒక్కరే.

ఇప్పుడు ఈ వచనాలను చదవండి.

  1. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. (యోహాను 1:18)
  2. యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? (యోహాను 14:9)
  3. నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. (యోహాను 10:30

ఈ పై మూడు వచనాల ప్రకారం యేసు యెహోవా ఇద్దరూ ఒక్కరే.

యేసు తప్ప యెహోవాను ఎవరూ చూడలేదు. యేసుని చూస్తే యెహోవాను చూసినట్టే. యేసు యెహోవా ఇద్దరూ ఒక్కరే.

కాబట్టి ఒకవేళ అద్దంలో యెహోవా ముఖం చూసుకుంటే యేసు లాగా, యేసు ముఖం చూసుకుంటే యెహోవాలాగా కనిపిస్తుంది.

ఈ వాదన ప్రకారం అద్దంలో ముఖం చూసుకోవడం వరకూ ఓకే. కానీ స్వర్గంలో ఇద్దరూ రెండు వేరు వేరు కుర్చేల్లో ఇద్దరూ ఎలా కూర్చుంటారు ?
స్వర్గంలో ఇద్దరికీ రెండు వేరు వేరు కుర్చీలు ఉంటాయి అని బైబిల్ చెబుతోంది.

ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను.(హెబ్రీయులకు 10:12-13)

But when this priest had offered for all time one sacrifice for sins, he sat down at the right hand of God. Since that time he waits for his enemies to be made his footstool.(Hebrews 10:12-13)

కాబట్టి ఇక్కడ యేసు యెహోవా కుడి పక్కన యేసు కూర్చుంటాడు.

ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.(లూకా 22:69).

యేసుని జనాల పాపాల కోసం బలి ఇచ్చిన తరువాత యేసు వెళ్లి యెహోవా కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. ఇజ్రాయెల్ శత్రువులు అందరినీ కాలికింద వేసి తొక్కేంత వరకు యేసు అక్కడే ఉంటాడు అని చెప్తోంది బైబిల్.

ఒకే దేవుడు రెండు కుర్చీల్లో కూర్చున్నాడా? ఇక పరిశుద్ధ ఆత్మ కూడా ఉంది కాబట్టి అది కూడా గాల్లో పావురంలా ఎగురుతూ ఉంటుందా?

దానికి కూడా ఇంకో కుర్చీ వేయకపోయారా?

ఇంతకీ క్రైస్తవులకి ఎంత మంది దేవుళ్లు?

ఒక్కడా? ఇద్దరా? ముగ్గురా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *