పాటలు పాడే వేకువ చుక్కలు, దేవదూతలు! అదేమిటి వేకువ చుక్కలు( morning stars ) పాటలు పాడతాయా? అని అప్పుడే ఆశ్చర్యపడకండి. ఇంకా చాలా ఉంది. యేసు, సైతాను ఇద్దరూ వేకువ చుక్కలా?దేవదూతలా?

పాటలు పాడే వేకువ చుక్కలు, దేవదూతలు!

అదేమిటి వేకువ చుక్కలు( morning stars ) పాటలు పాడతాయా? అని అప్పుడే ఆశ్చర్యపడకండి. ఇంకా చాలా ఉంది.

బైబిల్ లో ఎందరూ వేకువ చుక్కలు!

  1. సైతాను ( morning star ).

సైతాను కి మరో పేరు Lucifer. ఆ పేరుకి అర్ధం Morning Star.. వేకువ చుక్క అని.

Lucifer, (Latin: Lightbearer) Greek Phosphorus, or Eosphoros, in classical mythology, the morning star (i.e., the planet Venus at dawn); personified as a male figure bearing a torch, Lucifer had almost no legend, but in poetry he was often herald of the dawn.

బైబిల్ లో ఇలా ఉంది.

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? (యెషయా 14:12)

How you have fallen from heaven, O morning star, son of the dawn! You have been cast down to the earth, you who once laid low the nations! (Isaiah 14:12)

అర్ధం అయింది కదా.. సైతాను ( lucifer ) ని బైబిల్ లో వేకువ చుక్క అంటారు. అలాగే Son of dawn అని కూడా అంటారు. కానీ తెలుగు బైబిల్ లో Son of dawn అనే పదం లేదు.అలాగే సైతాను ఒక దేవదూత అని కూడా చెప్తోంది. Noted.

  1. యేసు ( morning star )

సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.(ప్రకటన గ్రంథం 22:16).

“I, Jesus, have sent my angel to give you this testimony for the churches. I am the Root and the Offspring of David, and the bright Morning Star.” (Revelation 22:16)

చూశారుగా ఇక్కడ సైతాను లాగే యేసు కూడా bright morning star అని పిలవబడ్డాడు. Son of David అని కూడా ఉంది. అలాగే యేసు ఒకటి దేవదూత అని కూడా చెప్తోంది.

అంటే సైతాను, యేసు ఇద్దరినీ వేకువ చుక్కలు అని బైబిల్ వర్ణిస్తోంది.

కాబట్టి ఇద్దరు జీవులు ( యేసు, సైతాను ) పాటలు పాడటం పెద్ద విషయం కాదు కదా!

పాటలు పాడే వేకువ చుక్కలు, దేవదూతలు!

ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? (యోబు 38:7-8)

while the morning stars sang together and all the angels shouted for joy? Who shut up the sea behind doors when it burst forth from the womb,(Job 38:7-8)

ఇక్కడ వేకువ చుక్కలు, దేవదూతలు కలిసి పాటలు పడుతున్నారు అంటున్నాడు. అంటే యేసు, సైతాను కలిసి పాటలు పాడుతున్నారా?

లేక యేసు లాగే మిగతా దేవదూతలు పాటలు పాడుతున్నారా

వేకువ చుక్కల్ని, దేవదూతల్ని పూజించవచ్చా? యెహోవా ని మాత్రమే పూజించాలా?

సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. (ద్వితీయోపదేశకాండము 4:19)

యేసు, సైతాను ఇద్దరూ ఒకరేనా? వేరు వేరా?

Morning star, God’s Angel అని ఇద్దరికీ పోలిక పెట్టబడింది కదా!

ఏమిటో.. అంతా గందరగోళం!

ఈ విషయం పై మళ్లీ పోస్ట్లు పెట్టేంతవరకూ మీ అభిప్రాయాలూ కింద కామెంట్ చేయండి?

చుక్కలు ఎక్కడైనా పాటలు పాడతాయా అని మాత్రం అడగొద్దు! సరేనా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *