
ఇదేనా యేసయ్య చూపే జంతు ప్రేమ?
గొర్రెలకు మంచి నేను మంచి కాపరిని అని చెప్పుకున్న యేసయ్య పందులను మాత్రం చిన్న చూపు చూస్తాడు అనడటానికి ఈ క్రింది ఉదాహరణను చూపుతుంది బైబిల్
మేటర్ ఏమిట్రా అంటే …
అనేక దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని యేసు స్వస్థపరిచినట్టు చూపే సందర్భం ఒకటి బైబిల్లో కనిపిస్తుంది. ఆ సందర్భంలో దెయ్యం పట్టిన వాడి శరీరం నుండి ఆ దెయ్యాలను దాదాపు 2000 వేల పందులలోకి పంపిస్తాడు యేసు. ఆ తర్వాత ఆ పందులన్నీ దగ్గర సముద్రంలోకి పోయి ఊపిరి ఆడక మరణిస్తాయి. దెయ్యాలను వదిలించడం వరకూ ఓకే కానీ ఇలా నోరులేని 2000 మూగజీవాలను చంపడం కరుణామయుడు అని పిలవబడే యేసయ్యకి తగునా? అన్నదే ఇక్కడ ప్రశ్న
ఈ రిఫరెన్స్ లు చూడండి.
దెయ్యలతో మాట్లాడిన యేసు:
ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. (మార్కు 5:8)
For Jesus had said to him, “Come out of this man, you evil spirit!” (Mark 5:8)
మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. (మార్కు 5:9-10)
అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను. గనుక ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. (మార్కు 5:11-12)
దెయ్యాలను పందులలోకి పంపి 2000 పందుల చావుకి కారణం అయిన యేసయ్య:
యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. (మార్కు 5:13)
దెయ్యాలు పట్టిన వారు యేసుతో మాటలాడటం కొత్త నిబంధనలో సర్వ సాధారణం. అందుకే దెయ్యాలు ఉంటాయని నమ్మే వారు క్రైస్తవుల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆ విశ్వాసం వారిలో బలపడటానికి బైబిలులోని ఇలాంటి సంఘటనలే కారణం.
పై ఉదాహరణతో మనుషుల కోసం పందులను చంపిన దేవుడుగా యేసయ్య నిలబడిపోయాడు. కానీ ఇది యేసు యొక్క జంతుప్రేమకు
ఒక మచ్చలాగా నిలిచిపోయింది. యేసు గొర్రెలను మాత్రమే ప్రేమిస్తాడా? వేరే జీవులను చంపేస్తాడా?
ఈ సంఘటన జరిగే సమయంలో PETA లాంటి జంతుప్రేమిక సంస్థలు ఉండి ఉంటే ఎంత గొడవ చేసేవో కదా?