Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

ఏసుకి ఎంతో ఇష్టమైన ఆ స్త్రీని బైబిల్ ఎందుకు పక్కన పెట్టింది?

May be an image of text that says "యేసుకి మగ్దలీనా మరియకి ఉన్న సంబంధం ఏమిటీ? భార్య, ప్రేయసి, శిష్యురా యేసు మేరీని ప్రేమించాడా? సీమోనుతో కొనుట లేదు.( ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని (లూకా Ramana Nationalist"

ఏసు ఆఖరి చూపుకి నోచుకున్న ఆమె గురించి పాస్టర్ లు ఎందుకు ప్రస్తావించరు? ఏసు పాదాలను ముద్దాడిన ఆ ప్రేమ మూర్తిని ఒక అభాగ్యురాలిగా, వేశ్యగా బైబిల్ ఎందుకు ముద్ర వేసింది?

ఆమె పేరు మేరీ మేగ్ధలీనా.

ఏసు ప్రేయసిగా కొందరు పేర్కొంటున్న ఆమె గురించి మీలో ఎంత మందికి తెలుసు?

బైబిల్ లో ఆమె ప్రముఖ్యత గురించి కొన్ని విషయాలు :
ఎవరీ మేరీ మగ్ధలీనా?

యేసుకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఒక స్త్రీ.
కొత్త నిబంధనలో మేరీ (యేసు తల్లి) తరువాత అంత ఎక్కువ ప్రాధాన్యత ఉన్న స్త్రీ ఈమెనే.

ఈమె యేసుకి అనేక సేవలు చేసింది. డబ్బులు సహాయం చేసింది. ఆఖరి నిమిషంలో పక్కనే ఉంది.

ఈమెకు యేసు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎంతంటే ఈమెకోసం.. ఈమె కుటుంబం కోసం కన్నీళ్లు పెట్టుకునేంత.

యేసు కన్నీళ్లు విడిచెను. (John 11:35)

దేవుడు అని చెప్పుకునే యేసు ఎందుకు ఏడ్చాడు?

యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.(John 11:5)

ఇక్కడ ఆమె సహోదరిని అన్నది మేరీనే..!అయితే మేరీ పేరు ప్రస్తావించకుండా సహోదరిని అని ఎందుకు రాశారు?

యేసు మార్తను ఆమె సహోదరి మేరీని, లాజరును ప్రేమించెను.

అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.(john 11:33)

ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది కదా!

మేరీని యేసు ప్రేమించాడు. ఆమె ఏడుస్తుంటే తట్టుకోలేకాపోయాడు. అయితే వేరే వాళ్ళను కూడా ప్రేమించాడా? అదే బైబిల్ రచయితల తెలివితేటలు. మేరీ పేరు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆమెతో పాటు వేరే పేర్లను కలిపి రాస్తారు బైబిల్ రచయితలు. మేరీ ఒక్కతే ఉండిన వచనాలు చాలా అరుదు.

వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.(Luke 7:38)

సో… ఇక్కడ యేసు పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నది మేరీ.

ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను.Luke 7:44

నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు.Luke 7:5

నీవు నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.Luke 7:46

ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని..Luke 7:47..

ఆమె యేసుని ప్రేమించింది. యేసు కూడా ఆమెను ప్రేమించాడు. కానీ ఆ వాక్యాలు జనాలకి అర్థం కాకుండా కలగపులగం చేశారు.

మేరీ non-stop గా ముద్దులు పెడుతుంటే మగాడైన Siimon తో నువ్వెప్పుడైనా ఇలా ముద్దులూ పెట్టావా అని యేసు అడుగుతాడా? ఇది కేవలం మేరీకి యేసు కి మధ్యలో ఒక పేరు చేర్చే ప్రయత్నంలో జరిగిన పొరపాటు.

ఇలా అనేక చోట్ల యేసుతో మేరీ కి ఉన్న అనుబంధాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు బైబిల్ రచయితలు.

యేసు జీవితంలో ఆమె ఎంత ఇంపార్టెంటో తెలియాలంటే ఇవి చూడండి.

1.యేసు శిష్యులతో పాటు ఈమె కూడా ఎక్కువ సమయం యేసుతో గడిపింది.ఈమె ఒక వేశ్య అయినప్పటికీ యెహోవా ధర్మ శాస్త్రన్ని ఎదురించి యేసు ఈమెని చేరాదీశాడు.(John 8:11)

  1. ఈమె అన్న లాజరు చనిపోతే యేసు వెక్కి వెక్కి ఏడ్చాడు.(john 11:35)
  2. యేసుకి సిలువ వేసేటప్పుడు యేసు ఫ్యామిలీ తో పాటు ఈమె కూడా ఉంది.

(ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.(John 19:25))

  1. యేసు శవాన్ని చూడటానికి ముందుగా ఈమెనే వెళ్ళింది.
    (ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. (John 20:1)
  2. చనిపోయి తిరిగి లేచిన యేసు మొదట ఈమెకే దర్శనం ఇచ్చాడు.
    (ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను.” (Mark 16:9))

సహజంగా తల్లి తర్వాత భార్యకు మాత్రమే ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి స్థానం మగ్ధలీనా మరియకు ఎలా లభించింది.

  1. బతికున్న కాలంలో యేసుకి ఈమె అమితమైన ప్రేమను పంచింది. యేసు కాళ్లకు ముద్దులు పెట్టింది.ఎప్పుడు అతని శరీరాన్ని అంటుకునే ఉండేది.

యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. (John 20:17)

  1. కొత్తగా లభించిన manuscript ప్రకారం యేసుకి ఈమే భార్య. వాళ్ళకి సంతానం కూడా కలిగింది.

పైన పేర్కొన్నవి అన్ని బైబిల్లో ఉన్నవే… ఇక తొలగించబడిన
మేరీ సువార్త, phillip సువార్తలు మరిన్ని డీటెయిల్స్ కలిగి ఉన్నప్పటికీ బైబిల్ లో ఇప్పుడు అవి లేవు కాబట్టి వాటిని ప్రస్థావించడం లేదు.

యేసు బ్రహ్మచారి. మచ్చలేని మగ గొర్రెపిల్ల కాబట్టి అతని బలిని యెహోవా స్వీకరించాడు అని బైబిల్ చెప్పదలచుకుంది. అందుకే మగ్ధలీన మరియ గురించి ఉన్న అనేక విషయాలను బైబిల్ వక్రీకరించింది. కొన్నింటిని తొలగించింది.

అందుకే పరిశోదకులు ఇలా అంటారు.

It is Mary who knows the secrets of Jesus.

“And the other disciples come to Mary and say, ‘Listen, tell us what Jesus was about, the things that you know that we don’t.'”

The Gospel of Mary states: “Peter said to Mary, ‘Sister, we know that the Saviour loved you more than the rest of women. Tell us the words of the Saviour which you remember. Which you know, but we do not, nor have we heard them.’

“Mary answered, and said,’ What is hidden from you, I will proclaim to you.'”

The Gospel of Mary and Philip, therefore, suggests that Mary Magdalene was Jesus’ closest confidante.

Yet despite this, most scholars remain unconvinced.

Craig Evans, Professor of New Testament at Acadia Divinity College attempted to downplay the significance of the ancient texts.

He explained: “It’s become popular lately to talk about Mary Magdalene as though she were Jesus’ lover, maybe even wife – maybe even the mother of his child.

కాబట్టి యేసు – మద్గలీనా మరియ చాలా సన్నిహితంగా ఉండే వారని తేటతెల్లమౌతోంది. కానీ బైబిల్ రచయితలు ఆమె గురించి ప్రస్థావించబడిన అన్ని వచనాలను Forgery చేశారు. కొన్నింటిని తొలగించారు.

బ్రహ్మ చారి అన్న ముద్ర తొలగిపోతే యేసుకి వచ్చిన నష్టం ఏమిటి?

మేరీ యేసుకి ప్రేయసి, శిష్యురాలు.. అవసరం వస్తే భార్య అని కూడా చెప్పవచ్చు అంటున్నారు బైబిల్ చదివిన ఎందరో పరిశోధకులు.

Davinci code మూవీ చూడండి. ఇంకొంత క్లారిటీ వస్తుంది.

లేకపోతే ఈ clip చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *