యేసు చారిత్రక పురుషుడు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!
యేసు ఒక చారిత్రక పురుషుడు అని కొందరు కాదు కల్పితం అని కొందరు వాదిస్తుంటారు.
ఇందులో ఏది నిజం తేల్చేద్దాం రండి.చరిత్రలో ఉన్న వ్యక్తులకి ఎన్నో కొన్ని ఆధారాలు లభిస్తాయి. వాటిని భేరీజు వేసుకొని మనం అవి నిజమో కాదో డిసైడ్ అవుతాం. కానీ యేసు విషయంలో ఏ ఒక్క ఆధారం కూడా సరిగ్గా ఉండదు.
యేసు తల్లి తండ్రి వివరాలు:యేసు తల్లి మేరీ అని బైబిల్ చెప్తుంది. కానీ ఆమె పెళ్లి కాకుండానే( పురుష సంయోగం లేకుండా ) తల్లి అయింది అని బైబిల్ చెప్తుంది. ఈ విషయాన్ని సైన్స్ ప్రకారం కానీ చరిత్ర గా కానీ ప్రూవ్ చేయలేము. కాబట్టి ఇది కేవలం నమ్మకం గానే పరిగణించబడుతుంది. చరిత్ర గా చెప్పలేము.
యేసు తండ్రి ఎవరు?యేసు తండ్రి యోసేపు అని బైబిల్ చెప్తుంది.
లూకా 3:23 – 28 లో… ఇలా ఉంది
యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను.యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి…
ఇక్కడ యేసు తండ్రి యోసేపు అని, యోసేపు హేలీ కుమారుడు అని చెప్పబడింది.. తర్వాత వాళ్ళ పూర్వీకుల పేర్లు ఇవ్వబడ్డాయి.
దీనికి విరుద్ధంగా మరో వంశావలి కూడా యేసు పేరిట ఉంది. ఇక్కడ యోసేపు తండ్రి మత్తయి 1:15-16ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకో బును కనెను;యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.యోసేపు తండ్రి మత్తాను. యోసేపు భార్య మేరీ. ఆమె కొడుకు యేసు.ఇక్కడ విచిత్రం ఏమిటంటే యోసేపు కనని యేసు పుట్టుక గురించి చెప్పడం కోసం ఇంత సమాచారం ఇవ్వడం దేనికి?
పైగా రెండు రకాల వంశావళులు..!తాతల పేర్లు మొత్తం మార్చేశారు.కాబట్టి ఇది నిజం అనే అవకాశం కంటే అబద్దం / కల్పితం అయ్యే అవకాశం ఎక్కువ.కాబట్టి యేసు తండ్రి యోసేపు అని చెప్పడం అసాధ్యం. అలాగే యేసు పెళ్లి కాకుండా పుట్టాడు అనడం కూడా సాధ్యం కాదు.
పోనీ యేసు ఏ కాలం లో పుట్టాడు?
సరైన ఆధారం ఉందా?
Year of Jesus’ birth.
The date of birth of Jesus of Nazareth is not stated in the gospels or in any secular text, but most scholars assume a date of birth between 6 BC and 4 BC.
ఇది మనకు అందుబాటులో ఉన్న సమాచారం.క్రీస్తు పూర్వం 6 నుండి క్రీస్తు పూర్వం 4 మధ్య కాలం లో యేసు పుట్టాడు అంట..!నవ్వుకోకండి. యేసు.. క్రీస్తు పూర్వంలో పుట్టాడు. BC అనే కాల గణనం యేసు కి ముదిపెడితే ఇలానే ఉంటుంది. ఇదో కామెడీ. దీనిని బట్టి కూడా యేసు చరిత్రపై అనుమానము వస్తుంది.
ఇక మానవ మాతృడిగా యేసు ఎప్పుడు పుట్టాడు? ఎవరికి పుట్టాడు అన్నది నిర్ధారించలేం కాబట్టి యేసు దేవుని కుమారుడు అనే మైతోలోజికల్ యాంగిల్ లో ఆలోచిద్దాం.
బైబిల్ ప్రకారం త్రిత్వం అని ఒకటి ఉంటుంది.అంటే యేసు, యెహోవా, పరిశుద్ధ ఆత్మ అనే ముగ్గురు ఒకే దేవుడు కాన్సెప్ట్. బైబిల్ ప్రకారం ఈ ముగ్గురు ఒక్కటే.బైబిల్ ప్రకారం మేరీపై పరిశుద్దాత్మ అనుగ్రహం పడి యేసు జన్మించాడు.
లూకా 1:26 ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
లూకా 1:34 అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగాలూకా
1:35 దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.చూశారు కదా.. ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంది. పరిశుద్దాత్మ వలన మేరీ గర్భం దాల్చింది యేసు పుట్టాడు.అయితే..
యేసు పరిశుద్దాత్మ ఒక్కటే అయితే మేరీ ని కమ్మింది ఎవరు? యేసే నా?యేసు పరిశుద్దాత్మ కుమారుడా? దేవుని కుమారుడా? తనకే తాను కుమారుడా?
ఏమిటో.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది కదా..!వీటిని చరిత్ర అందామా? Mythology అందామా?మీరే డిసైడ్ అవ్వండి.
ఈ పాటిదానికి మీ అమూల్యమైన సమయాన్ని దేవుడు దేవుడు అనుకుంటూ… ఇలాంటి తలా తోక లేని విషయాలు ఉన్న పుస్తకాలని పట్టుకొని ఇతరులని కూడా ఆ ఊబిలోకి లాగే ప్రయత్నం చేయకండి.లేదు యేసు తండ్రి ఎవరో నేను చెప్తాను. ఏసు తాత పేరు నేను కరెక్ట్ గా చెప్తాను అనుకుంటే కామెంట్ సెక్షన్ లో దుమ్ము రేపండి…!