Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

చేప కడుపులో 3 రోజులు జీవించిన ప్రవక్త కథ

ఒక మనిషిని ఏదైనా ఒక పెద్ద చేప/తిమింగలం మింగేస్తే 3 రోజుల తర్వాత అతన్ని బయటకి కక్కేస్తే అతను బతుకుతాడా?

ఖచ్చితంగా బతకడు కానీ .. బైబిల్లో బతుకుతాడు.

ఇక కథలోకి వస్తే.. యోనా అనే ప్రవక్తకు దేవుడు ఒక పని అప్పజెప్పుతాడు. అప్పుడు యోనా, దేవుడు చెప్పిన పని చెయ్యకుండా సముద్ర మార్గంలో పారిపోతూ ఉంటాడు. దాంతో అతను వెళుతున్న పడవను పెద్ద తుఫాన్ ముంచెత్తుతుంది.

దేవుడు చెప్పిన పని:

నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. (యోనా 1:2)

అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను. (యోనా 1:4)

దాంతో పడవలోని ప్రయాణికులు అతన్ని సముద్రంలోనికి తోసేస్తారు. తుఫాన్ ఆగిపోతుంది. కానీ యెహోవా నియమించిన గొప్ప చేప ఒకటి అతన్ని మింగేస్తుంది.

యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను. (యోనా 1:15)

గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. (యోనా 1:17)

3 రోజులు ఆ చేప పొట్టలోనుండి ప్రార్ధన చేస్తాడు ప్రవక్త. దేవుడు అతన్ని కరుణిస్తాడు. యోనాని మూడు రోజుల తరువాత చేప బయటకు కక్కేస్తుంది. చేప కడుపులో నుండి సజీవంగా బయటపడిన ప్రవక్త దేవుడు చెప్పిన పని పూర్తి చేస్తాడు.

ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. (యోనా 2:1)

కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను. (యోనా 2:9)

అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను. (యోనా 2:10)

యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా ..(యోనా 3:4)

ఇది క్లుప్తంగా యోనా కథ.

ఈ కథ విన్న వాళ్ళలో కాస్త బుర్రున్న వారు ఎవరైనా సరే ఇది ఒక పిట్టకథ అని కొట్టిపారేస్తారు. కానీ క్రైస్తవులు దీన్ని నిజం అని నమ్ముతారు.

ఎందుకు అంటే ఈ కథ గురించి కొత్త నిబంధనలో కూడా ప్రస్తావన ఉంది.

యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును. (మత్తయి 12:40)

For as Jonah was three days and three nights in the belly of a huge fish, so the Son of Man will be three days and three nights in the heart of the earth. (Matthew 12:40)

యోనా ఎలా అయితే చేప కడుపులో 3 రోజులు ఉండి బయటకు వచ్చాడో, యేసు కూడా 3 రోజులు భూమి గర్భంలో ఉండి బయటకు వస్తాడు అన్నది బైబిల్ మాట.

యేసు 3 రాత్రులు 3 పగళ్లు సమాధిలో ఉన్నాడా ? అన్నది వివాదాస్పదం. కాబట్టి ఆ టాపిక్ కి పోవడం లేదు.

అయితే యోనా అనే ప్రవక్త చేప చదువులో 3 రోజులు ఉండి ప్రార్ధన చేయడం మాత్రం అంత ఈజీగా నమ్మేట్టు లేదు.

ఈ కథని మీరు నమ్ముతారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *