
అవును తప్పు కాదు. బైబిల్ ప్రకారం 100% అది తప్పు కాదు. బైబిల్లో యూదా అనే వాడికి ఏరా, ఓనాను, మరో కొడుకు ఉంటారు. యూదా పెద్ద కొడుకు భార్య తామారు.
పెద్ద కొడుకు ఏరా యెహోవా దృష్టిలో చెడ్డవాడు గనుక అతన్ని యెహోవా చంపేస్తాడు. మోసే/యెహోవా ధర్మ శాస్త్రం ప్రకారం అన్న చనిపోతే తమ్ముడు వదినతో పిల్లల్ని కనాలి. అయితే అది ఇష్టం లేని రెండో కొడుకు ఓనానుని కూడా యెహోవా చంపేస్తాడు. ఇక మూడో కొడుకు వయసులో చిన్నవాడు కనుక కొంత కాలం పుట్టింట్లో ఉండమని చెప్తాడు యూదా తన కోడలితో.
మోసే/ యెహోవా దేవుని నియమం:
”సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.”
(ద్వితీయోపదేశ కాండం 25:5)
యెహోవా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం యూదా తన కోడలిని తన ముగ్గురు కొడుకులకి ఇవ్వ దలిచాడని మనకు ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతోంది. అలాగే ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. తన మామ కుటుంబంలోనే ఎవరో ఒకరితో కలిసి పిల్లల్ని కనాలి.
అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మామ యూదా గారి భార్య ముసలావిడ చనిపోవడంతో మామ ఒంటరి వాడు అయ్యాడు. పిల్లలకోసం పరి తపిస్తున్న మామగారికి కోడలు ఎలాగైనా ఆ పని చేసి పెట్టాలనుకుంది. మామ పని మీద బయటికి పోతున్నాడని తెలుసుకోని దారిలో ముసుగు వేసుకొని ఒక వేశ్యలాగా కూర్చుంది.
మామగారు ఆమె వేశ్యనేమో అనుకోని ఆమెతో బేరం మాట్లాడుకొని ఆమెతో పడుకున్నాడు. ఇది జరిగిన మూడు నెలల తరువాత తన కోడలు కడుపుతో ఉందని తెలుసుకున్న మామ గారు ఆమెను సజీవ దహనం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆమె తన మామ యూదానే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని చెప్పడంతో కథ సుఖాంతం అయింది. అప్పుడు climax లో మామ గారు ఒక మాట అన్నాడు.
“ఆమె నాకంటె నీతిమంతురాలు”(ఆదికాండం 38:26)
యూదాని కానీ అతని కోడల్ని కానీ యెహోవా చంపలేదు. సరికదా ఇక్కడ అంతా సబబుగానే జరిగింది కదా అన్నట్టు ఈ మామా కోడళ్ళను క్రైస్తవులకు మూల పురుషుల్ని చేశాడు యెహోవా.
ఆమెకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. యేసు యూదా గోత్రికుడు అవ్వడానికి ఇదే కారణం.
ఆ సింహం పేరు యేసు.
Revelation 5:5
ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
యేసు వరకూ కొనసాగిన ఆ వంశం యొక్క మూలాలు మామా కోడళ్ల శృంగార ఫలితం అనేది కాదనలేని సత్యం.
అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటీ?
యెహోవా పెట్టిన ఒక నియమం. అన్న చనిపోతే వదినతో మరిది పడుకోవాలని యెహోవా పెట్టిన నియమం. ఈ నియమాన్ని అనుసరించి కొత్త నిబంధనలో ఒకామె 7 గురిని, మరో ఆమె 6 భర్తల్ని పెళ్లాడినట్టు మనం బైబిల్లో చూస్తాం. యేసు పుట్టుకకి కారణం కూడా ఈ నియమమే. ఎందుకు అంటే యేసు నాన్నమ్మకి కూడా ఇద్దరు భర్తలు.
ఈ నియమాన్ని యూదులు అందరూ పాటించారు కాబట్టి అక్కడి సంతానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ తామారుని నీతిమంతురాలు అని యూదా ఎందుకు అన్నాడు? నిజంగానే ఆమె నీతి మంతురాలా? యూదా అన్నది తప్పా? ఒప్పా?
కోడలికి పుట్టిన పిల్లలకి మామా యూదా ఏమవుతాడు? తాత? తండ్రా?