
4 రోజుల ముందు చనిపోయిన లాజరు, యేసు మాటతో లేచి వస్తాడు. అయితే బైబిల్ చదివిన వారికి ఇక్కడ ఎన్నో అనుమానాలు వస్తాయి.
లాజరు ఎవరు? యేసు లాజరుని ఎందుకు బతికించాడు?
అసలు బతికించాడా? ఇదంతా నాటకమా?
ఖచ్చితంగా నాటకమే!
1. మొదటి అనుమానస్పద విషయం
పిలవగానే లాజరు లేచి రావడం.
(యోహాను 11:43-44)
ఆయన ఆలాగు చెప్పి “లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా..””చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను.” అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
4 రోజుల క్రితం చనిపోయి, కాళ్లు చేతులు వస్త్రాలతో కట్టబడి ఉన్నప్పటికీ.. ముఖానికి రుమాలు కట్టి ఉన్నప్పటికీ… నడుచుకుంటూ బయటకి వచ్చాడు.ఇలా జరగడం సాధారణంగా సాధ్యం కాదు కాబట్టి..
కొంచెం అనుమానం వస్తుంది.
2. రెండో అనుమానస్పద విషయం
లాజరు మాగ్దాలీనా మరియ కు సోదరుడు కావడం.
మగ్దాలీనే మరియ యేసు సహచరిని అని బయట టాక్ ఉండటం.
ఈ రెండు కారణాలతో లాజరు చనిపోయి లేవడం అనేది భూటకం అని అనుమానం కలుగుతుంది.
ఒకసారి పరిశీలించండి.
DRAMA EXPOSED:
తాను దేవుని కుమారున్ని అని జనాలని నమ్మించే ప్రయత్నంలో ఉన్న యేసుకి అతని బంధువుల్లో కొందరు బాగా సహాయం చేశారు.
అందులో ఒకడు బాగా దగ్గరి బంధువు అయిన John ( యోహాను ).
ఇంకొకరు లాజర్.John ( యోహాను ) తల్లి మరియమ్మకి బాగా దగ్గరి చుట్టం. వదిన మరదళ్ళు అవుతారు. వాళ్ళు ఇద్దరు. బహుశా అందుకే john యేసుకి బాప్టిజం ఇవ్వడానికి ఒప్పుకొని ఉంటాడు.
అలాగే యేసు మనుషుల్ని బ్రతికించగలడు అన్న విషయాన్నీ అందరిలోకి వెళ్లేలా సహాయం చేసింది, యేసు ప్రియురాలు, మాజీ వేశ్య అయిన మగ్ధలీనా మరియ.
యేసు చచ్చిపోయిన లాజరుని బ్రతికించి గొప్ప మహిమలు కలవాడిగా పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఆ లాజరు యేసు గూటిలోని పక్షే అవ్వడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది.
ఇదంతా తెలుగు సినిమాల్లో దేవుడిగా ఎదిగే హీరో వేసే ప్లాన్స్ లా లేవూ?
యేసుకి లాజారుకీ, అతని సోదరి మగ్దలీనా మరియు ఉన్న సంబంధం:
1. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.(యోహాను 11:2)
2. యేసు మార్తను ఆమె సహోదరిని( మగ్దలీనా మరియని ), లాజరును ప్రేమించెను. (యోహాను 11:5)
యేసుకి ఇక్కడ లాజరు చనిపోయాడు అన్న విషయాన్ని తెలియజేసింది మేరీ( మగ్దలీనా) మరియు మార్తా(యోహాను 11:3).
తర్వాత అక్కడకి చేరుకున్న యేసు ఇలా అంటాడు. లాజరు ఊరకనే జబ్బుతో చనిపోలేదు. తనకు పేరు తేవడానికే చనిపోయాడు అని.
యోహాను 11:4
యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.కాబట్టి ఇదంతా డ్రామా అని తేలిపోతోంది కదా !
పైగా ఇక్కడ చనిపోయిన వ్యక్తి యేసుకి, మేరీ కి బంధువు.
ఇక మేరీ యేసు బంధం గురుంచి లోకానికి తెలుసు. ఇలా యేసుని దేవుణ్ణి చేసిన వాళ్లంతా యేసు బంధువులే.
కాబట్టి యేసు బంధువులు అంతా కలిసి యేసుని దేవుణ్ణి చేశారు. ఈ విషయాలని బైబిల్ నుండే పరిశీలనాత్మకంగా చూస్తే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.