బైబిల్ దేవుడు యెహోవా పెట్టిన దిక్కుమాలిన చట్టాల్లో ఇది ఒకటి. పెళ్లి అనేది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకి ఇష్టపూర్వకంగా జరగాలి. అది రెండో పెళ్లి అయినా కూడా ఇదే సూత్రం వర్తింపజేయాలి. భర్త చనిపోయిన మహిళకి యోగ్యమైన వ్యక్తితో పెళ్లి చేయాలి. లేదా ఆమెని ఇష్టపడిన వాడికిచ్చి పెళ్లి చెయ్యాలి. అంతే తప్ప ఇందులో బలవంతం ఉండకూడదు.
కానీ బైబిల్లో ఇలా కాదు. ఇక్కడ పెళ్లిళ్లు బలవంతంగా జరిగేవి. ఈ బలవంతపు పెళ్ళికి దేవుడి సహకారం కూడా ఉండటం మరో వింత.
లేవీయ వివాహం – బైబిల్ ఆచారం
బైబిల్ ప్రకారం పిల్లలు లేని వదినను( పిల్లలు కనకుండానే చనిపోయిన తన అన్న భార్యని) మరిది పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అనే నియమం ఉంది. మరిదికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది మరిది గారి బాధ్యత. ఒక వేళ మరిది ఒప్పుకోక పోతే ఊరి పెద్దలు అందరూ అతన్ని వదినతో పెళ్లికి ఒప్పించాలి. అయిన సరే ఆ మరిది ఒప్పుకోక పోతే, పెద్దల అందరి ముందు నిలబెట్టి ఆ మరిదిని ఆ వదినే అవమానించాలి.
అందరికీ బైబిల్ లోని గ్రాంధిక భాష అర్థం కాదు కాబట్టి.. సులువుగా చెప్తాను.
- ఒక స్త్రీని పెళ్లాడిన అన్న సనాతనం కలగక మునుపే చనిపోతే లేవీయ నియమం ప్రకారం ఆ స్త్రీకి రెండో పెళ్లి చేయాలి.
- వదినకి పిల్లలని పుట్టించే బాధ్యత మరిదిది లేదా మరుదులది. ఒకవేళ భర్త పోయిన వదినని మరిది పెళ్లాడటానికి ఒప్పుకోక పొతే పంచాయితీ పెట్టి, ఊరి పెద్దల అందరి ముందు అతన్ని నిలబెట్టి ఆ మరిది ముఖం ఆ వదిన ఉమ్ము వేసి అతన్ని అవమానించాలి.
- ఆ మరిది చెప్పులని ఊడదీసి వీడు తమ జాతి మొత్తంలో ఒక waste ఫెలో అని అందరూ అనుకునేలా చేయాలి.
- పరాయి వ్యక్తులు ఎవరూ ఆమెను పెళ్లాడకూడదు. పరాయి ఇంటి వాడిని పెళ్లాడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి.
- ఇంట్లో ఎంత మంది మరుదులు ఉంటే అంతమంది ఆమెకు కడుపు తెప్పించే ప్రయత్నం చెయ్యాలి.
వీటికి ఆధారాలు – బైబిల్ వచనాలు:
పాత నిబంధన వచనాలు
“సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను” ( ద్వితీయోపదేశ కాండం 25:5).
“అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని యెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దల యొద్దకు పోయినా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెనను.(ద్వితీయోపదేశ కాండం 25:7)
అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడిఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసితన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయ బడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.(ద్వితీయోపదేశ కాండం 25:7,8)
బైబిల్ సందర్భాలు:
ఈ దిక్కుమాలిన నియమం వల్లనే యూదా రెండో కొడుకుని యెహోవా చంపేశాడు.
(వదినతో సంతానం తనది కాదు కదా అని sex మధ్యలోనే లేచి వచ్చి యెహోవా చేతిలో కుక్క చావు చచ్చాడు యూదా రెండో కొడుకు ఓనాను. చివరికి యూదా కోడలు మామతోనే పిల్లల్ని కన్నది. అది వేరే విషయం.)
అప్పుడు యూదా ఓనానుతో – నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను. (ఆదికాండము 38:8)
ఓనాను ఆ సంతా నము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.(ఆదికాండము 38:9)
అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను. (ఆదికాండము 38:10).
ఇదేమి బలంతపు సంతాన ఉత్పత్తిరా భగవంతుడా!
ఇదంతా పాత నిబంధనలో మాత్రమే ఉంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..
ఈ పెంట ఆచారం కొత్త నిబంధన కాలంలోనూ కొనసాగింది.
కొత్త నిబంధన వచనాలు:
పిల్లలు లేని ఒకామెను 7 గురు పెళ్లాడారు
ఆధారాలు:
ఏడుగురు సహోదరులుండిరి. మొదటి వాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవ వాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. ఆ ప్రకారం యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.(లూకా 20:29-32)
ఇంకో ఆమెకు 6 గురు భర్తలు
నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.(యోహాను 4:18)
- యేసు నాయినమ్మకి కూడా ఇద్దరు భర్తలు. ఒకరు హేలి, ఇంకొకడు యాకోబు.(మత్తయి 1:16; లూకా 3:23)
ముగింపు మాటలు:
అయినా ఆడవాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి జరగడం చూశాము కానీ మగాళ్ళకి కూడా బలవంతంగా పెళ్లిళ్లు చేసిన చరిత్ర యెహోవాది.
పెళ్లి అనే మాటని ఇంతలా అపహాస్యం చేసిన పాత్రగా యెహోవా నిలబడిపోతాడు.
ఇలా ఇష్టంలేని పెళ్లిళ్లు చేయించే యెహోవాని దేవుడు అని అనాలంటే కాస్త బుర్ర ఉన్న ఎవడికీ మనసు రాదు.