Vishnu Purana (1.16-20)
తమ దేవుళ్ళని జంతువులతో పోల్చుకోవడం కొన్ని మత గ్రంధాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు బైబిల్ దేవుణ్ణి కోడిపెట్టతో, గొర్రెతో, పావురంతో, కీటకంతో(చిమ్మట పురుగు), సింహంతో .. ఇలా రకరకాల జంతువులతో పోల్చడం మనం బిబిల్లో చూస్తాం. ఇవి కేవలం పోలికలు మాత్రమే! కానీ యేసు మాత్రం మనుషులని కుక్కలతో పోల్చుతాడు. ఇది జాత్యహంకార పోలిక. అన్యులకి,కుక్కలకు చచ్చిపోయిన జంతువుల మాంసాన్ని పెట్టండి అంటాడు బైబిల్ దేవుడు. ఈ విషయం గురుంచి రమణ నేషనలిస్ట్ పేజీలో పోస్ట్ పెట్టిన సంగతి మీకు తెలిసిందే. దానికి స్పందిస్తూ మీ దేవుళ్ళని కుక్కలతో, సింహాలతో, పందులతో పోల్చిన పురాణాలు మీకు ఉన్నప్పుడు మిమ్మల్ని కుక్కలు అంటే తప్పా ? అంటూ వాదనకి వచ్చారు కొందరు క్రైస్తవులు.
వారికి నేను చెప్పేది ఒకటే అయ్యా .. మా గ్రంధాలలో దేవుడిని జంతువులతో ఎప్పుడూ పోల్చలేదు. ఆయన ధరించిన వివిధ అవతారాల గురుంచి మాత్రమే చెప్పాము. అవి పోలికలు కాదు. అవతారాలు. రూపాంతరాలు.
మీకు అర్ధం అయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరముగా నరసింహ అవతారాన్ని పోలిక ఎందుకు అనరో చెప్తాను.
విష్ణు పురాణం 1.16-20 తో పాటు అనేక భారతీయ గ్రంధాల్లో నరసింహ అవతార ప్రస్తావన ఉంది.
Hiranyakasyapa wished that he be neither killed by a man or beast, nor in daylight or at night and neither inside or outside a building.
హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తనకు చావులేకుండా ఉండేందుకు బ్రహ్మ నుండి వరం పొందేందుకు తపస్సు చేస్తారు. మానవుడి వలన కానీ, పగటి యందు కానీ, రాత్రి యందే కానీ, గృహం లోపల కానీ, గృహం వెలుపల కానీ, అస్త్ర శస్త్రాల వలన కానీ తనకు మరణం రాకూడదు అని కోరుకుంటాడు. బ్రహ్మ సరే అంటాడు. వరం పొందిన హిరణ్యకశిపుడు అహంకారంతో లెక్కలేని పాపాలు చేస్తాడు.ఎందరినో చంపుతాడు. విష్ణు భక్తుడైన సొంత కొడుకుని కూడా చంపాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణు మూర్తి మనిషి, జంతువు మిశ్రమ రూపంలో నరసింహ అవతారం ధరించి, పగటికి,రాత్రికి నడుమ సాయంత్ర సమయంలో, అస్త్రాలు శస్త్రాలు కానటువంటి తన గొల్ల సహాయంతో హిరణ్యకశిపున్ని చంపుతాడు. ఇది తన భక్తుణ్ణి రక్షించుకునుందుకు విష్ణువు ఎత్తిన అవతారం. ఇది పోలిక కాదు.
ఇక పోలిక అంటే ఎలా ఉంటుందో చూద్దాం
బైబిల్లో యేసుని యూదా గోత్రపు సింహం అంటారు. కానీ యేసు ఎక్కడ కూడా సింహం అవతారం ఎత్తినట్టు ఉండదు. ఇది కేవలం పోలిక. కానీ ఈ పోలిక ఎంత ఛండాలంగా ఉందో చూడండి.
ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను. (ప్రకటన గ్రంథం 5:5)
యూదా గోత్రపు సింహం అంటే “యూదా అనే మామ వేశ్య అనుకుని కోరిక తీరా కోడలితో శృంగారం చేస్తే పుట్టిన వంశంలో పుట్టిన సింహం మా యేసయ్య ” అని అర్ధం.
ఇలాంటి పోలికతో దేవుని వర్ణించడం బైబిల్ కే చెల్లింది. అంటే దేవుడే అక్రమ సంబంధాల వంశంలో పుట్టాడు అని ఆ రచయిత చెప్తున్నట్టే కదా !
మరో చండాలం ఏమిటంటే సింహంతో యేసయ్య ని పోల్చారు కదా అని సరిపెట్టుకుందాం అని క్రైస్తవులు అనుకునేలోపే సాతాను ని కూడా పోల్చి సింహం పోలికని పెంట చేశారు.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. (1 పేతురు 5:8)
అంటే సాతాను వీరుడు అని అర్థమా? బైబిల్ రచయిత తన నోటికి వచ్చిన జంతువుతో సాతాను ని, యెహోవాని, యేసుని పోల్చుకుంటాడు. కానీ భారతీయ గ్రంధాల్లో ఉన్నది పోలిక కాదు. అవతారం.
సింపుల్ గా చెప్పాలంటే యెహోవా మానవరూపంలో వచ్చాడు అని కొందరు క్రైస్తవులు అంటారు. అంటే యెహోవా మనిషి అని ఆదం కాదు . అలాగే విష్ణువు వరాహ అవతారంలో వరాహం కాదు. రూపం ధరించడం అని అర్ధం.
కానీ యూదులు యెహోవా మానవతారం వస్తాడు /వచ్చాడు అనే వాదనని అంగీకరించరు. అందుకే అతన్ని చంపేశారు. ఎందుకు అంటే యెహోవా అద్వితీయ దేవుడు . one single god అని యూదుల నమ్మకం.