అవును. యేసు/ యెహోవా ఇశ్రాయేలీయులని మాత్రమే ప్రేమించమని చెప్పారు.
నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుడి అని యేసు + యెహోవా ఇద్దరూ చెప్పినట్టు మనకి బైబిల్ లో కనిపిస్తుంది.
ఐతే క్రైస్తవులు చెప్తున్నట్టు “పొరుగువారు” అంటే అందరినీ ప్రేమించడం కాదు. కేవలం ఇశ్రాయేలు వారు ఇశ్రాయేలు వారిని ప్రేమించడం మాత్రమే. ఎందుకు అంటే యెహోవాకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ.
అది ఎలాగో చూద్దాము.
స్టేట్మెంట్ -1
కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను. (లేవీయకాండము 19:18)
స్టేట్మెంట్ -2
సైన్యములకధిపతియగు యెహోవా సెల విచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను. (1 సమూయేలు 15:2-3)
మొదటి వాక్యంలో నీ పొరుగువారి మీద పగ పెట్టుకోకు అని చెప్తున్నారు యెహోవా.
రెండో వాక్యంలో వాళ్ళు మీ జాతికి చేసిన విషయాన్ని నేను మర్చిపోలేదు. మీరు వాళ్లపై ఖచ్చితంగా పగ తీర్చుకోవలసిందే. వాళ్ళను చంపాల్సిందే అని చెప్తున్నాడు.
ఇక్కడ విషయం ఏమిటంటే మొదటి వాక్యం ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. మీరు మీ పొరుగువారు అయిన ఇశ్రాయేలు వారిని ప్రేమించాలి.
రెండో వాక్యంలో మీ శత్రువులు అయిన అమాలేకీయులు ( వీరు పొరుగువారు కారు -ఇతరులు ) లని చంపమని చెప్తున్నాడు.
పొరుగువారి మీద పగపెంచుకోవద్దు అని చెప్పి మళ్ళీ ఇతరులని చంపమని చెప్పడం కాంట్రాడిక్షన్ కాకుండా వుండాలి అంటే పొరుగువారు అనేది ఇశ్రాయేలు ప్రజలు అవడం తప్ప వేరే మార్గం లేదు. లేకపోతే యెహోవా అబద్దం చెప్పినట్టు అవుతుంది.
Cross check చేద్దాం.
- చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. (ద్వితీయోపదేశకాండము 14:21).
పొరుగువారిని ప్రేమించడం అన్యులకి చచ్చిన మేకలని, గొర్రెలని అంటగట్టి ఇశ్రాయేలు వాళ్ళు మంచి వాటిని తినడమా?
పొరుగువారిని రోగాలపాలు చెయ్యడం ప్రేమ అవుతుందా?
- యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.(యెహొషువ 8:27).
పొరుగువారిని ప్రేమించడం అంటే అన్యుల సొమ్ము దోచుకోవడమా?
ఇలాంటి అనేక వచనాల్లో ఇతరులని ఎలా చంపాలి, దోచుకోవాలి, నాశనం చెయ్యాలో చెప్పిన యెహోవా ఖచ్చితంగా పొరుగువారిని ప్రేమించండి అని చెప్పలేదు.
ఇక్కడ పొరుగువారు అంటే కేవలం ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే. ఇతరులు వాళ్ళ దృష్టిలో చంపబడే వారే తప్ప ప్రేమించడానికి అర్హులు కాదు.
మగవారిని ఆడవారిని చంపి పురుష స్పర్శ ఎరుగని స్త్రీలను మాత్రమే మీకోసం ఉంచుకోండి అనేది కూడా
యెహోవాఈ సందర్భంగాఆజ్ఞాపించి నాదేనా.
ఇకపోతే “నీ ప్రజలమీద కోపం ఉంచుకొనుటక” అంటారేమిటి.