
దేవాలయాలలోకి అన్యులు వస్తే చంపమని చెప్పిన దేవుడు ఎవరో తెలియక మళ్ళీ అబాసుపాలైన కృపారావు గారు!
ఈసారి తనతో పాటు క్రైస్తవాన్ని కూడా అభాసుపాలు చేసిన కృపారావు గారు!
కౌంటర్ ని 3 భాగాలుగా చూడండి.
1. గుళ్ళోకి అన్యులు వస్తే మైలపడే దేవుడు ఎవరు?
ఆన్సర్ : యెహోవా
అన్యులని (గ్రీకులని) గుళ్ళోకి తీసుకువచ్చాడు అని పౌలుని చితకబాదిన యెహోవా భక్తులు.
ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. (అపో. కార్యములు 21:28)
పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.(అపో. కార్యములు 21:30)
వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి (అపో. కార్యములు 21:32)
ఇక్కడ మీరు గమనిస్తే అపో. కార్యములు 21:28 లో” గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.”
అంటే ఇశ్రాయేలు దేశస్థులు/యూదులు కాని వాళ్ళు యెహోవా గుళ్ళోకి వస్తే యెహోవా మైల పడతాడు. ఆ గుడి అపవిత్రం అయిపోతుంది అని బైబిల్లోనే రాసి ఉంది .
కాబట్టి మీరు ఇలాంటి వివక్ష చూపించే యెహోవా లాంటి దుర్మార్గుడిని దేవుడిగా కొలవలేకపోతే అందులో నుండి బయటకి వచ్చి అప్పుడు కుల వివక్ష గురుంచి మాట్లాడండి .
2. అన్యులని కుక్కలతో పోల్చిన యెహోవా
చిచ్చిన/ లేదా జంతువుల చేత చీల్చబడిన ఆహారాన్ని /జంతు మాంసాన్ని కుక్కలకు/ అన్యులకు వేయండి.
అతడు కళేబరమునైనను చీల్చ బడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను. (లేవీయకాండము 22:8)
మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను.(నిర్గమకాండము 22:31)
చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.(ద్వితీయోపదేశకాండము 14:21)
ఇక్కడ అన్యులు అనగా ఇశ్రాయేలు దేశస్థులు/యూదులు కాని వాళ్ళు యెహోవా దృష్టిలో కుక్కలు అన్నాడు. అయినా కూడా సిగ్గులేకుండా నేను కుక్కనే ప్రభువా అనుకుంటూ అతని మతంలోనే ఉంటారా?
3. అన్యులు యెహోవా ఆలయంలోకి వస్తే మరణశిక్ష విధించే వాళ్ళు . అది కూడా యెహోవానే చెప్పాడు. మనుషుల మధ్య ఇంత వివక్ష చూపించే వాడిని ఎలా దేవుడు అంటున్నారు మీరు?
కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.(సంఖ్యాకాండము 18:7)
దేవుడు కొందరిని అన్యులు అని పిలవడమే అన్నిటికన్నా పెద్ద వివక్ష . పైగా ఇతరులకి మరణ శిక్ష లు వేయడం ఇంకా ఘోరం.
యెహోవా ఆలయంలో అన్యుల ప్రవేశం చేస్తే మరణశిక్ష అని ఒక శిలా శాశనమ్ కూడా ఉండేది అన్న విషయం మీకు తెలియదా ?
4. కోరహు లాంటి వాళ్ళు అర్చకత్వం కోరడం వల్లనే యెహోవా చేతిలో చనిపోయారు అని బైబిల్ లో ఉంది కదా !
అర్చకత్వం కోరిన కోరహు మరియు 249 మందిని యెహోవా చంపేశాడు
ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు.(సంఖ్యా కాండం 16:10)
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.(సంఖ్యా కాండం 16:32).
మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.(సంఖ్యా కాండం 16:35)
5. యెహోవా ఆలయంలో వివక్ష
అన్యులకి మరణ శిక్ష
https://ramananationalist.in/gentiles-who-tried-to-enter-the-2nd-temple-would-be-put-to-death/
ఇంత వివక్ష చూపించే పూజిస్తూ ఇతరులపై ఎలా ఏడవగలుగుతున్నారు కృపారావు గారు ?
మీకు బైబిల్ తెలియదు. మీ శిష్యులకు కూడా బైబిల్ తెలియదు. మిమ్మల్ని నమ్మే గొర్రెలకు అసలు తెలియదు .
మీరు పోస్ట్ పెట్టె ముందు బైబిల్ చదవండి . అప్పుడు మీకు ఇలాంటి అనుమానాలు రావు.
మీకు నిజంగా వివక్ష పైన చికాకు ఉంటే ఈరోజే క్రైస్తవాన్ని వదిలేయండి. మీ నిజాయితీ నిరూపించుకోండి
మా గ్రంధాల్లో ఏముందో మాకు తెలుసు. సర్వ ప్రాణుల్లో పరమాత్మని చూసే మాకు మనుషులను అన్యులు అంటూ వివక్ష చూపే మీకు చాలా తేడా ఉంది.
ఇలా హిందూ గ్రంధాల గురుంచి పెడుతున్నాను అనుకొని క్రైస్తవాన్ని బజారుకి ఈడ్చకండి కృపారావు గారు !