Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

క్రైస్తవుల Half Knowledge పనులు!

“వివాహము అన్ని విషయములలో ఘనమైనది” – హెబ్రీ 13:4

సాధారణంగా క్రైస్తవుల పెళ్లి శుభలేఖలో కనిపించే ఈ సగం సగం వాక్యాన్ని చూసి పెళ్లి వ్యవస్థ మీద బైబిల్ కి చాలా గౌరవం ఉంది అని అనుకుంటే మీరు పప్పులే కాలేసినట్టే.

పూర్తి వచనం చూస్తే తప్ప అసలు విషయం బోధ పడదు.

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
(హెబ్రీ 13:4)

మరింత స్పష్టత కోసం ఇంగ్లీష్ బైబిల్ చూడండి.

Marriage should be honored by all, and the marriage bed kept pure, for God will judge the adulterer and all the sexually immoral.(Hebrews 13:4)

పెళ్లిని అందరూ గౌరవించాలి. పడక పరిశుద్ధంగా ఉంచాలి. ఎందుకు అంటే వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే వ్యభిచారులను దేవుడు శిక్షిస్తాడు అని.

పెళ్లిని అందరూ గౌరవించాలి అని ఉన్న వాక్యాన్ని పెళ్లి అన్నిటికన్నా విలువైనది అనడం ఒక వక్రీకరణ.

పోనీ పూర్తిగా అయినా రాస్తారా అంటే వాక్యం సగమే రాసి, వ్యభిచారం గురించి చెప్పిన వాక్యం పక్కన పెట్టేస్తారు.

సుబ్బారావు మంచిగా బతికాడు.
సుబ్బారావు మంచిగా బతకాలి.. ఈ రెండు ఒకటి కాదు కదా!

అందుకే క్రైస్తవులది హాఫ్ నాలెడ్జి. పాస్టర్లు చెప్పే వాక్యాలు ఇలాగే ఉంటాయి.

వ్యభిచారం చేయడం తప్పు కాబట్టి పెళ్లి చేసుకోండి. అదే గౌరవం. అనే అర్థం వచ్చే ఈ వాక్యాన్ని ఎంత అందంగా వాడుకుంటున్నారు.వ్యభిచారం కన్నా పెళ్లి బెట్టర్. అని శుభలేఖ మీద రాయగలారా?

ఒక్క వాక్యం కూడా బైబిల్ నుండి పూర్తిగా చదివి వినిపించలేని పరిస్థితి. దీనినే హాఫ్ నాలెడ్జి అనేది.
పూర్తిగా చదివితే క్రైస్తవులు ఎప్పుడో బైబిల్ ని వదిలేసేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *