
అందరి దేవుళ్ళకు భార్యలు, పిల్లలు ఉంటారు. మా యెహోవా దేవుడికి పెళ్ళాలు, పిల్లలు లేరు అని బాధపడ్డారో ఏమో మరి..
అక్కడక్కడా యెహోవాకు కూడా భార్యా పిల్లలు ఉన్నట్టు తమ గ్రంథంలో రాసుకున్నారు బైబిల్ రచయితలు.
అందుకు ఉదాహరణలుగా రెండు కథలు చెప్పుకోవచ్చు.
మొదటి కథ యెహెఙ్కేలు 16 వ అధ్యాయంలో, రెండో కథ యెహెఙ్కేలు 23 వ అధ్యాయంలో ఉంటుంది.
మొదటి కథలో అంశం: తాను పెంచుకుని, పెద్ద చేసి, పెళ్లి చేసుకున్న యెరుసలేమ్ అనే అమ్మాయి వేరే పురుషుడితో వెళ్లిపోవడం.
రెండో కథలో అంశం: తాను పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు పరాయి పురుషులతో పోవడం, శృంగారం చేయడం.
రెండు కథల్లోనూ యెహోవా దేవుడి భార్యలు ఆయన్ని వదిలేసి వేరే వాళ్ళతో పోవడం చూస్తాము.
ఇదే కామన్ పాయింట్.
ఆ రెండు కథల్లోని మొదటి కథను ఇప్పుడు చర్చిద్దాం రండి.
… …. …. ….
బైబిల్ కథ:
యెహోవా ఒక ఆడదాన్ని పెంచుకుంటాడు. అనాధగా దొరికిన ఆమెను తానే దగ్గర ఉండి పెద్ద చేస్తాడు. యెహువా చేతిలో పెరిగిన ఆ పిల్ల కొంత కాలానికి వయసుకి వస్తుంది. పరువం వచ్చిన ఆమెకు అన్ని అవయవాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆమెను చేరదీసిన యెహోవాయే ఆమెను అవమానించడం ఇష్టం లేక (బహుశా రేప్ చేయడం అయ్యుండొచ్చు) ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు ఎన్నో నగలు, బట్టలు కొంటాడు. కానీ ఆమె వేరే వాడితో లేచిపోతుంది. ఇది క్లుప్తంగా బైబిల్ లోని కథ !
ఈ కథని రిఫరెన్స్ లతో సహా కింద ఇస్తాను. అయితే ఈ కథ చదివేటప్పుడు మీకు ఏదైనా సినిమా కథ జ్ఞప్తికి వచ్చిందా?
జంధ్యాల గారి – “బావ బావ పన్నీరు”
బావ బావ పన్నీరు స్టోరీ లైన్ :
ఒక వయసు మళ్ళిన పెద్దాయన (మన్మధరావు) ఒక చిన్న పాపని చేరదీసి, ఆమెను పెద్ద చేసి, ఆమె వయస్సులోకి రాగానే ఆమెను పెళ్లాడాలని చూస్తాడు. అయితే ఆమె వయసు వచ్చాక తన మనసుకి నచ్చిన వాడితో వెళ్ళిపోతుంది. అతన్నే పెళ్లి చేసుకుంటుంది.
మన బైబిల్ కథలో పెద్దాయన పాత్ర లాగే సినిమాలో పెద్దాయన పాత్ర కూడా తన చేతుల్లో పెరిగిన పిల్లని పెళ్లాడాలి అనుకుంటుంది.
అయితే బైబిల్లో పెద్దాయన పాత్ర తాను పెంచుకున్న పిల్లని పెళ్లాడిన తర్వాత ఆ అమ్మాయి(యెరుసలేమ్ ) లేచిపోతుంది. సినిమాలో మాత్రం పెళ్లి కాకముందే లేచిపోతుంది. అంతే తేడా .
… …. … …
రిఫరెన్స్ లతో బైబిల్ స్టోరీ
అమ్మాయి(యెరూషలేము) పుట్టుక:
యెహెఙ్కేలు 16:3-6
ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశసంబంధమైనవి; నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయ బడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడిన వాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని.
యెరుసలేమ్ (అమ్మాయి పాత్ర) పై మనసుపడిన యెహోవా
యెహెఙ్కేలు 16:7-8
మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను. మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధన చేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
యెహోవాను కాదని నచ్చిన పురుషుడితో పోయిన
యెహోవా భార్య ఐన యెరుసలేమ్
నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసికొని నీవు పురుషరూప విగ్రహములను చేసికొని వాటితో వ్యభిచరించితివి. (యెహెఙ్కేలు 16:17)
……
తర్వాత కథంతా యెహోవా తన భార్యను ఎలా శిక్షించాడు. ఆమెను ఎలా నిందించాడు. ఇవన్నీ ఉంటాయి.
…
నా ప్రశ్న :
తాను పెంచుకున్న ఆడపిల్ల (యెరుసలేమ్) సొగసుని చూసి ఇష్టం పుట్టి తండ్రి లాంటి యెహోవా ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అనే వర్ణన సరైన దేనా?