Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బైబిల్ దేవుడిని తన కంట్రోల్లో పెట్టుకున్న మోసే!

బైబిల్ దేవుడిని తన కంట్రోల్లో పెట్టుకున్న మోసే!

తాను చేసుకున్న బొమ్మని ఏమైనా చేసుకోవడం ఆ బొమ్మని చేసుకున్న వాడి హక్కు అంటారు క్రైస్తవులు. కాబట్టి బైబిల్ దేవుడు 28,00,000+ మనుషుల్ని చంపినా తప్పు లేదు అంటారు.

ఇక్కడ విషయం అది కాదు. తాను చేసిన బొమ్మ (మోసే ) చెప్పినట్టు చేస్తుంటాడు యెహోవా.

  1. బైబిల్ దేవుడు తన స్వహస్తాలతో రాసిన రాతి పలకలని పగలగొట్టిన మోసే!

మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. (నిర్గమకాండము 31:18)

When the LORD finished speaking to Moses on Mount Sinai, he gave him the two tablets of the Testimony, the tablets of stone inscribed by the finger of God. (Exodus 31:18)

ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. (నిర్గమకాండము 32:16)

The tablets were the work of God; the writing was the writing of God, engraved on the tablets.(Exodus 32:16)

మోసేని ఏమీ అనలేక పలకలపై మళ్ళీ తన నియమాలు రాసుకున్న యెహోవా.

మరియు యెహోవా మోషేతోమొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను. (నిర్గమకాండము 34:1)

Note :

ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు

  1. యెహోవాకి చేతులు ఉన్నాయి, వేళ్ళు కూడా ఉన్నాయి.

(Hands, finger)

మిగతా శరీర భాగాలు ఈ లింక్ లో చూడొచ్చు.

https://www.facebook.com/106914574790243/posts/205870761561290/

  1. సృష్టి మొత్తాన్ని 6 రోజుల్లో చేసిన దేవుడు, రెండు రాతి పాలకలపై 10 నియమాలు ( లేదా మొత్తం 613 యెహోవా నియమాలు ) రాయడానికి 40+ రోజులు పట్టిందా?
  2. దేవుడు చేసిన సృష్టి / చర్యని మోసే నాశనం చేస్తే మళ్ళీ రాసుకోవడం హాస్యాస్పదం.

…..

మరచిపోయిన యెహోవాకి గుర్తు చేసిన మోసే. సారీ అంటున్న యెహోవా!

గతంలో ఒకసారి ప్రపంచంలోని జనాలు అందరిని చంపేస్తాడు యెహోవా. కోపం చల్లారిన తర్వాత Rainbow ని పుట్టించి ఇక పై ప్రజలని చంపను అని మాటిస్తాడు.

అయితే అది మర్చిపోతాడు. మోసే గుర్తు చేసిన తర్వాత యెహోవా అయ్యో నిజమే కదా అని సంతాపం చెండుతాడు.

  1. కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా(నిర్గమకాండము 32:10)
  2. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?(నిర్గమకాండము 32:11)

నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను. (నిర్గమకాండము 32:13)

  1. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను. (నిర్గమకాండము 32:14)

Then the LORD relented and did not bring on his people the disaster he had threatened.(Exodus 32:14)

దేవుడు మర్చిపోవడం మనిషి గుర్తు చేయడం కూడా చాలా కామెడీ గా ఉంటుంది.

….

అలాగే బైబిల్ దేవుడి చేత తన తమ్ముడైన అహరోను కి వ్యతిరేకంగా ఉన్న కోరహు వర్గాన్ని చంపించి అర్చకత్వం తన కుటుంబంలోని వారికే ఉండే లాగా చూసుకుంటాడు మోసే.

See link :

https://www.facebook.com/106914574790243/posts/199722538842779/

…..

మీరు ఒకటి గమనిస్తే.. మోసేకి యెహోవా అనుగ్రహం చాలా బాగా ఉందని తెలుస్తోంది. ఎంతలా అంటే యెహోవా ఆలోచనలని సైతం మార్పు చేయగలిగినంత!

ఇది అసాధ్యం అని బైబిల్ చెప్తోంది.

మనుషుల్ని చంపేద్దాం అని fix అయిన యెహోవా కూడా మోసే మాట విని వెనక్కి తగ్గాడు. అంటె దేవుడు మనసు మార్చుకున్నాడు.

కానీ దేవుడు మనసు మార్చుకుంటాడా?

సంఖ్యాకాండము 23:19

దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

God is not a man, that he should lie, nor a son of man, that he should change his mind. Does he speak and then not act? Does he promise and not fulfil?

మరి పైన వాక్యంలో యెహోవా మనసు మార్చుకున్నాడు అని స్పష్టంగా తెలుస్తోంది. అంటే మోసే అంత powerful అన్నమాట.

ఇవన్నీ చూసినప్పుడు మోసే యెహోవా సృష్టి కాదు. యెహోవా నే మోసే యొక్క సృష్టి అని.

మీకు యెహోవా మరో చోట క్లియర్ గా పశ్చాత్తాప పడినట్టు రాయబడింది.

యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.(ఆమోసు 7:3)

కాబట్టి యెహోవా అసలు దేవుడే కాదు. మోసే తయారు చేసిన కల్పిత పాత్ర. అందుకే తన మాట వినేవాడు అని దేవుడు పాత్రని సృష్టించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *