Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పిల్లల మాంసం తల్లులతో తినిపించిన దేవుడు

మా దేవుడు పాపుల కోసం ప్రాణం పెట్టాడు. మా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే తన కుమారుడిని మన కొరకు త్యాగం చేశాడు. ఐదీ విశ్వాసుల వాదన. ఈ వాదన నిజమేనా? దేవుడికి పాపులపై నిజంగానే అంత ప్రేమ ఉందా?

నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. బైబిల్ చదివాక అది పచ్చి అబద్ధం అని తేలింది. నేను బైబిల్లో చదివిన విషయాలు ఇక్కడ రాస్తున్నాను. చదవండి.

“బైబిల్లో తల్లుల నరమాంస భక్షణ”

నరమాంస భక్షణని ఆంగ్లంలో Cannibalism అంటారు. మనుషులే కాదు ఏ జాతి జీవి అయినా అదే జాతి జీవిని తినడం Cannibalism.

సగటు మానవులెవరూ నరమాంస భక్షణ చేయరు. చేయమని ఎవరూ చెప్పరు కూడా..!

ఐతే విచిత్రంగా బైబిల్లో తల్లి తండ్రులే తమ పిల్లల మాంసం తిన్నారు అని రాయబడింది. తల్లి తండ్రులే కాదు స్నేహితులు కూడా తమ స్నేహితుల మాంసం తిన్నారు అని బైబిల్ చెప్తోంది.

బైబిల్లో జరిగిన నరమాంస భక్షన మనుషులు చేశారా? లేక దీనిలో ఏదైనా దైవ ప్రేరణ ఉందా ? ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా వార్నింగ్-1

నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.

నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. (లేవీయకాండము 26:26-29)

I will destroy your food supply so that ten women will need only one oven to bake bread for their families. They will ration your food by weight, and though you have food to eat, you will not be satisfied.

then in my anger, I will be hostile toward you, and I myself will punish you for your sins seven times over.

You will eat the flesh of your sons and the flesh of your daughters. (Leviticus 26:26-29)

ఇక్కడ యెహోవా తన మాట వినని తల్లి తండ్రులకు ఆహరం లేకుండా చేస్తాను అంటున్నాడు. ఆకలితో వాళ్ళు తమ పిల్లల మాంసం తింటారు అని చెప్తున్నాడు.

వార్నింగ్ -2

మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు. (ద్వితీయోపదేశకాండము 28:52-53)

ఇంకా చదవండి…

మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల యెడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు. (ద్వితీయోపదేశకాండము 28:54-55)

నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారము చేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును. (ద్వితీయోపదేశకాండము 28:56-57)

వార్నింగ్ -3

వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును”. (యిర్మియా 19:9)

And I will cause them to eat the flesh of their sons and the flesh of their daughters, and they shall eat every one the flesh of his friend in the siege and straits with which their enemies and they that seek their lives shall straiten them.(Jeremiah 19:9)

ఈ మూడు వార్నింగ్ లు ఒకే అర్ధాన్ని ఇస్తున్నాయి. తన మాట వినకపోతే తల్లి తండ్రుల చేతే పిల్లల మాంసం తినిపిస్తాను అని /వాళ్ళు తినేలాగా చేస్తాను అని యెహోవా చెప్తున్నాడు అని. వార్నింగ్ -3 లో చెలికాని మాంసం అనగా స్నేహితుల మాంసం తినేలా చేస్తాను అంటున్నాడు యెహోవా.

ఈ వార్నింగ్ లను పట్టించుకోకపోతే ఏం జరిగిందో చూడండి.

“మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.” (2 రాజులు 6:29)

So we cooked my son and ate him. The next day I said to her, `Give up your son so that we may eat him,- but she had hidden him.” (2 Kings 6:29)

ఇక్కడ ఒక రాజు గారితో తన కొడుకు మాంసం వండుకొని తిన్న తల్లి, మరునాడు వేరే స్త్రీ కొడుకు మాంసాన్ని తిందాం అనుకుంది.. రెండో ఆమె ఒప్పుకోకపోవడంతో రాజు గారికి పై విధంగా చెప్పుకొచ్చింది.

అప్పుడు రాజు గారు ఇలా అంటారు.

అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచిరాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని (2 రాజులు 6:26)

“యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి..” (2 రాజులు 6:27 )

గమనించండి : “యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును?”

As the king of Israel was passing by on the wall, a woman cried to him, “Help me, my lord, the king!”
The king replied, “If the LORD does not help you, where can I get help for you? From the threshing floor? From the winepress?”
(2 Kings 6:26-27)

NOTE: If the LORD does not help you, where can I get help for you?

కాబట్టి ఇక్కడ తల్లులు తమ పిల్లాడి మాంసం తినడానికి కారణం యెహోవా వారికి సహాయనిరాకరణ చేయడమే అని స్పష్టం అవుతోంది.

సందర్భం – 2

మరో సందర్భంలో కూడా తల్లులు తమ పిల్లల మాంసం తిన్నారు. ఇక్కడ కూడా తల్లులతో పిల్లల మాంసం తినిపించింది యెహోవానే.

వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. (విలాపవాక్యములు 4:10)

With their own hands, compassionate women have cooked their own children, who became their food when my people were destroyed. (Lamentations 4:10)

ఇలా ఎందుకు జరిగింది? ఇదే చాప్టర్ లో సమాధానం రాసి ఉంది చదవండి.

ప్రూఫ్ :

నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగువా? (విలాపవాక్యములు 2:20)

“Look, O LORD, and consider: Whom have you ever treated like this? Should women eat their offspring, the children they have cared for? Should priests and prophets be killed in the sanctuary of the Lord? (Lamentations 2:20)

ఒకే చాప్టర్ లో యెహోవా తల్లుల చేత పిల్లల మాంసం తినేలా చేయకు అని యెహోవా భక్తుడు యెహోవానీ కోరుకోవడం, అది ఫలించక తల్లులు పిల్లల మాంసం తినడం కూడా స్పష్టంగా బైబిల్ లోనే రాయబడి ఉంది. ఇక ఈ నరమాంస భక్షణకు యెహోవాయే కారణం అని ఒప్పుకోక చస్తారా ?

ఇలా తన మాట వినని తల్లి తండ్రుల చేతే పిల్లల మాంసం తినిపించడం యెహోవాకు తగునా? అందరికీ అయిన దేవుడు ఇలా కరుణ లేకుండా పసిపిల్లల నరమాంస భక్షణ జరిగేలా చేయడం ఏ విధంగా కరెక్ట్ అంటారు ?

One thought on “పిల్లల మాంసం తల్లులతో తినిపించిన దేవుడు

  1. Thank you Ramanagaru ,
    For your Great Work towards welfare of Hindus and the World.
    Excellent Presentation with References.
    Jai Hind Jai Bharat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *