మా దేవుడు కరుణామయుడు. అనంత కృపామయుడు అంటూ అనేక మంది మన చుట్టూ చేరి మత ప్రచారం చేస్తూ ఉంటారు. వారు చెప్పే మాటలు నమ్మే ముందు ఒకసారి వారి గ్రంథాల్లో ఎంత కరుణ, కృప దాగి ఉన్నాయో గమనించడం విజ్ఞుల లక్షణం. ఒక వస్తువుని అమ్మే వాడు ఆ వస్తువు గురుంచి అనేక అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఏది నిజమో తెలియాలంటే ఆయా ప్రొడక్ట్స్ ని కొంత కలం వాడి చూడాలి. లేదా అంతక ముందు వాడిన వాళ్ళు ఆ వస్తువు పై ఇచ్చిన రివ్యూ లని అయినా పరిశీలించాలి. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ ఆర్టికల్ బైబిలులోని కరుణామయుడి కరుణ, కృపకు రివ్యూ లాంటిది.
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. (ఎఫెసీయులకు 4:6)
బైబిల్ గ్రంథం దేవుడు అందరికీ తండ్రి లాంటివాడు అనడం లేదు. దేవుడు అందరికీ తండ్రి అంటుంది. తండ్రి లాంటి వాడు అనుకున్న వ్యక్తి కూడా మనల్ని ప్రేమగా చూస్తాడు. మరి తండ్రి ఐన దేవుడు మనుషులను చంపుతాడా? చిత్ర హింసలు పెడతాడా? మాట వినకపోతే పాములతో కరిపిస్తాడా? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన తండ్రి వంటి దేవుడు ఎంత హింస చేశాడో, చేయించాడో మీకు కళ్ళకి కట్టినట్టు వచనాలతో సహా చూపించడం నా ఉద్దేశ్యం.
ద్వితీయోపదేశకాండమ 32:39-42
ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు.
నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను.
నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.
చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను
తను చేయబోయే హింస ఎలా ఉండబోతుందో యెహోవా స్వయంగా చెప్పిన వాక్యాలు చూశారు కదా!
ఈ ఆర్టికల్ లో చాలా చోట్ల రాయబడ్డ కొన్ని సంఘటనలు మరీ హింసాత్మకంగా ఉంటాయి. సున్నిత మనసుస్కులు దీనిని దృష్టిలో పెట్టుకుని చదవాలి. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు.
