
కొత్త నిబంధన సింగల్ లైన్ స్టోరీ
కొత్త నిబంధన సింగల్ లైన్ స్టోరీ
పాత నిబంధన అనబడే పుస్తకాల సంపుటి నుండి కొత్త నిబంధన అనే గ్రంథాన్ని రాయడానికి రచయితలు అనుచరించిన వ్యూహాలు ఎలా ఉన్నాయో పరిశీలించే వ్యాసం ఇది.
context:
పాత నిబంధన ప్రారంభంలో రచయిత హవ్వ, ఆదాము అనే జంట ఒక పండు తిన్న కారణంగా పాపంలో పడిపోయినట్టు రాసుకొచ్చాడు. అక్కడ నుండి మానవులకు పాపం అంటుకుంది అని రాసిన కారణంగా ఆ పాపం పోవాలంటే జంతుబలులు ఇవ్వడం అనే ఆచారం పెట్టాడు. యాజకులు, రాజులు, ప్రవక్తలు, బానిసలు, యుద్దాలు ఇలా అనేక మలుపులు తిరిగిన పాత నిబంధనలో అసలు విల్లన్ అయిన సాతాను కేవలం రెండు మూడు చాఫ్టర్లలోనే తన ప్రతాపాన్ని చూపించగలిగాడు. దేవుడు సాతాను ముఖాముఖిగా యోబు గ్రంథంలో తలపడటం బాగా రక్తి కట్టింది. జంతు బలులు, దోపిడీలు, హత్యలు, సెక్స్ సన్నివేశాలు, బూతు పాటలు, లైట్ గా నరబలి ప్రస్తావనలు, అక్కడక్కడ పసిపిల్లల హత్యలు…ఇలా పాత నిబంధన సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక రెండో భాగంగా కొత్త నిబంధన రాయాలంటే ఎక్కడ నుండి మొదలు పెట్టాలి? బైబిల్ రచయితలు దీనికి ఒక చక్కటి పరిష్కారం కనుగొన్నారు . హవ్వ ఆదాముల పాపం అనే కాన్సెప్ట్ ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. పాత బడిపోయిన జంతుబలి స్థానంలో నరబలి, అది కూడా ఒక మంచి నడవడిక ఉన్న యుక్త వయసు కుర్రాడిని, మంచి కుటుంబంలో పుట్టినట్టు చూపించి, అతని జన్మకు కావాల్సిన అంత ఫాంటసీ దట్టించి, అతని క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేసి చంపేశాడు.
ఫైనల్ గా హవ్వ ఆదాముల ఆపిల్ పండు వలన వచ్చిన పాపం అంతా ఈ నరబలి వలన పోయింది అని చెప్పి కథ ముగించాడు. ఈ కథని ఎంత మందికి చెప్తే అంత పుణ్యఫలమని ఫల శృతి కూడా యాడ్ చేశాడు. కరుణ రసం బాగా పండిన ఈ కథ ఇప్పుడు అన్ని ఏరియాల్లో బాగా ఆడుతోంది అని బయట టాక్. ఇంకా కొంత కాలం ఈ కథని అందరూ విని తరించడం ఖాయంగా కనిపిస్తోంది.
బైబిల్ రచయితల కృషిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. కుడోస్ గైస్
కొసమెరుపు: ఈ కొత్త నిబంధన కథని పాత నిబంధన ఫాన్స్ అయిన యూదులు తిరస్కరించారు. అక్కడ ఈ కథని ప్రచారం చేస్తే అస్సలు ఒప్పుకోవడం లేదు. మన దగ్గర ఆదరణ బాగుంది. అది వేరే విషయం.
తోట పని కోసం తన రూపంలో మనిషిని సృష్టించిన సర్వశక్తి మంతుడైన! బైబిల్ దేవుడు తనను మహిమ పరచమని అదే మనిషిని ప్రతి పదిహేను వందల సంవత్సరాల ఒకసారి గుర్తు చేస్తూనే ఉన్నాడు…
ఆదాము,నోవాహు, మోజెస్,మరియు ఏసు..
ఈసారి ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు…