ఏంజెల్స్ అన్నీ మగవే! ఆడ ఏంజెల్ ప్రస్తావన బైబిల్లో ఎందుకు లేదు?
స్త్రీలపై వివక్షకు ఇది నిదర్శనమా?

ఏంజెల్స్ అంటే ఎవరు?

“దేవుడికి అంటే తక్కువ స్థాయి, మానవుడి కంటే ఎక్కువ స్థాయి జీవులు”

నీవు దేవదూతలకంటె వానిని (యేసుని) కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. (హెబ్రీయులకు 2:7)

You made him a little lower than the angels; you crowned him with glory and honour. (Hebrews 2:7)

ఈ బైబిల్ వాక్యం ప్రకారం మనిషి కంటే ఉత్తమమైన జీవులు దేవదూతలు.

దేవదూతలు ఆడవా? మగవా?

అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. (ప్రకటన గ్రంథం 12:7-8)

And there was war in heaven. #Michael and #his angels fought against the dragon, and the dragon and his angels fought back. (Revelation 12:7)

#Michael and #his angels = పులింగం

బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను. (ప్రకటన గ్రంథం 10:1)

Then I saw another mighty angel coming down from heaven. He was robed in a cloud, with a rainbow above his head; his face was like the sun, and his legs were like fiery pillars. (Revelation 10:1)

. #He was robed in a cloud = పులింగం

కాబట్టి దేవదూతలు అనేవి పురుషలింగం అని స్పష్టమైంది.

దేవదూతలు పెళ్లి చేసుకుంటాయా?

పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు. (మత్తయి 22:30)

ఈ వాక్యం ప్రకారం వారికి ఆకాశంలో పెళ్లి పెటాకులు ఉండవు. మరి దేవదూతలు తమ మగతనంతో ఏం చేసుకుంటారు?

పాతనిబంధనలోను దేవదూతలు మగవారే!

అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. (ఆదికాండము 18:2-3)

Abraham looked up and saw three #men standing nearby. When he saw them, he hurried from the entrance of his tent to meet them and bowed low to the ground. (Genesis 18:2)

Three #men standing nearby=పులింగం

ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము #దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతోచెప్పలేదు. (న్యాయాధిపతులు 13:6)

ఇప్పుడు అర్ధమైంది కదా! దేవదూత అంటే ఎప్పటికీ మగ దూతే!

Then the woman went to her husband and told him, “A #man of #God came to me. He looked like an angel of God, very awesome. I didn-t ask him where he came from, and he didn-t tell me his name. (Judges 13:6)

man of #God = పులింగం

సరే దైవదూతలను స్త్రీగా ఎందుకు చూపలేదు? అనేదానికి సమాధానం ఇప్పుడు చూద్దాం.

దేవదూతలు దేవుని కంటే క్రింది స్థాయిలో ఉంటే మనిషి దేవదూతల క్రింది స్థాయి అని బైబిల్ చెబుతోంది.

నీవు దేవదూతలకంటె వానిని (యేసుని) కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. (హెబ్రీయులకు 2:7)

ఇక్కడ కూడా మగ మనిషే అని అర్ధం వస్తోంది. ” వానిని “

మరి స్త్రీ స్తానం ఎక్కడ?

స్త్రీ మగవాడి కన్నా తక్కువ స్థాయి.

ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను. (1కోరింథీయులకు 11:3)

నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి #నాకంటె #గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లు చున్నానని మీరు సంతోషింతురు. (యోహాను 14:28)

కాబట్టి మనిషిగా ఉన్నప్పుడు యేసు స్తానం దేవుడి కంటే దేవదూతలకంటే తక్కువ

దేవుడు >దేవదూతలు >క్రీస్తు>మనిషి (మగ)>స్త్రీ
మరణించిన తర్వాత
దేవుడు >క్రీస్తు>దేవదూతలు >మనిషి (మగ)>స్త్రీ

ఫైనల్ గా దేవుడు , దేవదూతలు, యేసు, మగమనిషి తర్వాత బైబిల్లో స్త్రీ కి స్తానం ఇవ్వబడింది.

ఇక ఆడదేవదూత కోసం బైబిల్లో వెతకడం అత్యాశే!

బైబిల్లో ఆడదేవదూత ఉన్నట్టు కొందరు పేర్కొంటారు. దానికి కౌంటర్ ఇది:

కొంతమంది స్త్రీ దేవదూతలకు ఉదాహరణగా జెకర్యా 5:9ని సూచిస్తారు. ఆ వచనం ఇలా చెబుతోంది, “

నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారి కుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడు గగా షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టియుంచుదురని అతడు నాకుత్తర మిచ్చెను. (జెకర్యా 5:9-11)

సమస్య ఏమిటంటే, ఈ ప్రవచనాత్మక దృష్టిలోని “స్త్రీలు” దేవదూతలు అని పిలవబడరు. 7 మరియు 8 వచనాలలో దుష్టత్వాన్ని సూచించే బుట్టలో ఉన్న స్త్రీ వలె వారిని నాషిమ్ (“స్త్రీలు”) అని పిలుస్తారు.

అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను. (జెకర్యా 5:7)

అప్పుడతడు ఇది దోషమూర్తి యని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను. (జెకర్యా 5:8)

దీనికి విరుద్ధంగా, జెకర్యా మాట్లాడుతున్న దేవదూతను మలక్ అని పిలుస్తారు, దీనికి పూర్తిగా భిన్నమైన పదం “దేవదూత” లేదా ” దూత.” జెకర్యా దృష్టిలో స్త్రీలకు రెక్కలు ఉన్నాయనే వాస్తవం మన మనస్సులకు దేవదూతలను సూచించవచ్చు, అయితే వచనం వాస్తవానికి ఏమి చెబుతుందో దాని కంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక దర్శనం తప్పనిసరిగా వాస్తవ జీవులను లేదా వస్తువులను చిత్రీకరించదు-అదే అధ్యాయంలో ఇంతకు ముందు జెకర్యా చూసిన భారీ ఎగిరే స్క్రోల్‌ను పరిగణించండి (జెకర్యా 5:1-2).

Some people point to Zechariah 5:9 as an example of female angels. That verse says, “Then I looked up—and there before me were two women, with the wind in their wings! They had wings like those of a stork, and they lifted up the basket between heaven and earth.” The problem is that the “women” in this prophetic vision are not called angels. They are called nashiym (“women”), as is the woman in the basket representing wickedness in verses 7 and 8. By contrast, the angel that Zechariah was speaking to is called a malak, a completely different word meaning “angel” or “messenger.” The fact that the women have wings in Zechariah’s vision might suggest angels to our minds, but we must be careful about going beyond what the text actually says. A vision does not necessarily depict actual beings or objects—consider the huge flying scroll Zechariah sees earlier in the same chapter (Zechariah 5:1–2).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *