Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

మనుషుల్లో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా?

ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. (రోమీయులకు 3:10)

నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు? (యోబు 25:4)

ఈ వాక్యాల ప్రకారం మనుషుల్లో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అంటే బైబిల్ ప్రకారం అందరూ ఎదవలే అన్న మాట!

సర్లే బైబిల్ ప్రకారం అంతేనేమో.. అని సర్దుకుపోదాం అనుకునే లోపు కొంత మంది నీతిమంతుల ప్రస్థావన బైబిల్ లో ఉంది.

అందులో లోతు గారు కూడా ఉన్నారు.

దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. (2 పేతురు 2:7)

ఇదే లోతు గారు తన సొంత కూతుళ్ళకి కడుపు చేశాడు. అలాగే అంతకముందు తన ఇద్దరు కూతుళ్ళను ఇష్టం వచ్చినట్టు చేసుకోమని జనాలకి ఆఫర్ చేశాడు.

ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.(ఆదికాండము 19:8)

Look, I have two daughters who have never slept with a man. Let me bring them out to you, and you can do what you like with them. But don-t do anything to these men, for they have come under the protection of my roof.” (Genesis 19:8)

ఇలా కూతుళ్ళని ఆఫర్ చేసిన ఈయనతోనే కూతుళ్లు పిల్లల్ని కన్నారు.

ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి. (ఆదికాండము 19:36)

లోతు గారి సంగతి పక్కనే పెడితే మరో నీతిమంతుడు కూడా బైబిల్లో మనకు కనిపిస్తాడు.

“నోవహు”

యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి. (ఆదికాండము 7:1)

And the LORD said unto Noah, “Come thou and all thy house into the ark, for thee have I seen righteous before Me in this generation. (Genesis 7:1)

ఇదే నోవహు తప్పతాగి కొడుకుల ఎదుట నగ్నంగా పడుకుంటాడు..

నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. (ఆదికాండము 9:20-21)

Noah, a man of the soil, proceeded to plant a vineyard. And he drank of the wine, and was drunken; and he was uncovered within his tent.
(Genesis 9:20-21)

ఇలాంటి తాగుబోతు వెధవ కూడా నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది.

అయితే మనం చూస్తే మొదటి రెండు వాక్యాల ప్రకారం అసలు నీతిమంతులు ఎవరూ లేరు. తర్వాత చూసిన వాక్యాల ప్రకారం వెధవలు నీతిమంతులు అని బైబిల్ చెప్తుంది.

ఇంతకీ బైబిల్ ప్రకారం నీతిమంతులు ఉన్నారనా? లేరనా?

ఏది నిజం?

ఒకవేళ నీతిమంతులు ఉన్నారు అన్నది నిజమైతే, ఇలాంటి వెధవలు నీతిమంతులు ఎలా అయ్యారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *