NOCTURNAL EJACULATION IN BIBLE

NOCTURNAL EJACULATION IN BIBLE

ఒకప్పుడు భారతదేశంలో ఆడవాళ్ళని మైల పేరుతో పెరట్లోనే, ఇంటి బయటనో ఉంచి మూడు/ ఐదు రోజులు విశ్రాంతి కల్పిస్తే అదేదో పెద్ద ఘోరం అన్నట్టు గగ్గోలు పెట్టారు జనాలు.

కానీ బైబిల్ దేవుడు ఒకడుగు ముందు వేసి మగవాళ్లకు కూడా మైల అంటగట్టాడు.

మగవారికి మైల? ఎలా?

నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగినదానివలన (స్వప్నస్కలనం జరిగి ) మైలపడినవాడు మీలో ఉండినయెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను. (ద్వితీయోపదేశకాండము 23:9-10)

“When you are encamped against your enemies, then you shall keep yourself from every evil thing. If any man among you becomes unclean because of a nocturnal emission, then he shall go outside the camp. He shall not come inside the camp.(Deuteronomy 23:9-10, ESV)

రాత్రి పడుకున్న సమయంలో స్వప్నస్కలనమో/హస్తప్రయోగమో జరిగి ఒక మగాడు ప్యాంటు తడుపుకుంటే వాడు మైల పడినట్టే అంటున్నాడు యెహోవా .

మైల పోయేవరకు ఏం చెయ్యాలి ?

అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును. (ద్వితీయోపదేశకాండము 23:11)

సాయంత్రం స్నానము చేసేవరకు బయటే ఉండాలి. ఓకే .. ఈలోపు బాత్రూంకి వెళ్లాల్సివస్తే ?

పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను. (ద్వితీయోపదేశకాండము 23:12)

Designate a place outside the camp where you can go to relieve yourself. (Deuteronomy 23:12)

అంటే పెంట మీదకి పోవాలన్న మాట !

ఓకే .. ఆ తర్వాత?

మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను (ద్వితీయోపదేశకాండము 23:13)

As part of your equipment have something to dig with, and when you relieve yourself, dig a hole and cover up your excrement. (Deuteronomy 23:13)

గసికతో గొయ్యి తీసుకుని పెంట/పేడ ని ఆ గోతిలో వేసి కప్పెట్టాలి అన్నమాట!

ఆలా ఎందుకు చెయ్యాలి ?

యెహోవాకు ఏమైనా కోపం వస్తుందా అలా చెయ్యకపోతే ?

అవును.

నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువు లను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు చుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్థముగా ఉండవలెను.(ద్వితీయోపదేశకాండము 23:14)

For the LORD your God moves about in your camp to protect you and to deliver your enemies to you. Your camp must be holy, so that he will not see among you anything indecent and turn away from you. (Deuteronomy 23:14)

దేవుడు నా పెంట పొలాల్లో తిరుగుతాడు కాబట్టి ఆయనకు కోపం రాకుండా గొయ్యి తీసి పి… య్యి.. కప్పెట్టమంటావా ప్రభువా ..!

సర్లే ఎన్నో అనుకుంటాం. మగవాళ్ళకి కూడా మైల అంటగట్టి, పాలెం అవతల ఉండమని ఆజ్ఞ ఇచ్చిన మా ప్రభువు, అలాంటి సమయాల్లో టిష్యూ పేపర్ వాడే ఆప్షన్ ఉందో లేదో చెప్పలేదు. ఎదో లాగా సర్దుకుపోతాం.

ఏం చేస్తాం .. ! భార్యలకు దూరంగా ఉంచి మగాళ్లతో యుద్దాలు చేయిస్తూ నువ్వు బాగానే ఉంటావు. మళ్ళీ మగాళ్లు స్వప్నస్కలనాలు/హస్తప్రయోగాలు చేసుకుంటే మైల అంటావు. ఇలా ఐతే ఎలా ప్రభువా?

ఆడవాళ్ళకి కూడా బైబిల్ ప్రకారం మైల ఉంటుంది. యెహోవా ప్రతి నెల ఆడవాళ్ళ దగ్గర మైల పేరుతో పావురాలు బలి తీసుకున్న దాని గురుంచి ఈ పోస్ట్ లో చదవండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *