క్రైస్తవులు – పాంప్లేట్ ప్రచారం
ప్రతి రోజూ ఎందరో క్రైస్తవులు బస్సు స్టోపుల్లోనూ, ఆసుపత్రులలోనూ, రోడ్ల మీద చేతిలో కొన్ని పేపర్ లు పట్టుకొని కనిపిస్తారు.
వాళ్ళ చేతిలో ఉండే ప్రచార సాధనాలు రంగురంగుల కాగితల రూపంలో కానీ, ఇలా బ్లాక్ అండ్ వైట్ కాగితాల రూపంలో కాని కనిపిస్తాయి. బ్లాక్ అండ్ వైట్ అయితే కనుక అవి ఈ క్రైస్తవులు ( పంచుతున్న వారే ) xerox తీసినవి అయ్యుంటాయి.
వీటిని పంచేవాళ్ళకి ఇందులో ఉన్న కంటెంట్ మీద పెద్దగా అవగాహన ఉండదు. మనం వారిని ఏదైనా ప్రశ్న వేస్తే చర్చిలో పాస్టర్ గారు చెప్పిన మాటలు as it is గా అప్పజెప్పేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లని ప్రశ్నించడం వలన ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి నేను నేనైతే ఆ పాంప్లేట్ తీసుకొని కాసేపు నవ్వుకొని, క్రైస్తవులు హిందువులని ఏయే మాటలు చెప్పి మతం మార్చాలని చూస్తున్నారో ఆలోచిస్తాను. వారి వాదనలో ఎంత నిజం ఉంది? అని ప్రశ్న వేసుకొని హిందువులతో ఆ పాంప్లేట్ పై చర్చ చేస్తాను. వీలైతే నాలుగు పాంప్లేట్ లు extra ఇమ్మంటాను. వాళ్లు ఖచ్చితంగా ఇస్తారు.
ఈ పాంప్లేట్ లో రాసిన మాటర్ ఏమిటి? నా విశ్లేషణ ఏమిటి?
- పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను
ఈ వాక్యంలో పాపులని రాక్షంచడానికి యేసు వచ్చాడు అని రాసి ఉంది. ఇంతకీ పాపులు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు?
బైబిల్ ప్రకారం అంతా పాపాత్ములే. పుణ్యాత్ములు ఒక్కరు కూడా లేరు. కాని పాంప్లేట్ పైన పాపులు అని రాశారు. బహుశా మతం మారని వాళ్లని పాపులు అంటున్నారేమో.
- అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.(రోమా 3:23)
అందరూ ఏ పాపం చేశారు?
అందరినీ పాపుల కింద జమ కట్టిన క్రైస్తవులు, ఇక్కడ పాపం చేయడం గురించి మాట్లాడుతున్నారు. చేసిన పాపాలు, జన్మ పాపం ( అవ్వ ఆదాము చేసిన పాపం ) ఏదో ఒక పాపం అవతలి వాడికి అంటగట్టి వాడిని పాపి అని ముద్ర వెయ్యాలి. తర్వాత మతం మారేలా చెయ్యాలి. ఇదే ఈ లైన్ యొక్క ఉద్దేశ్యం.
నేను ఏ పాపము చేయలేదు అని ఎవరైనా అన్నారనుకోండి.. అవ్వ ఆదాము చేసిన పాపం ఉందిగా అని గుర్తు చేస్తారు.
- ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము ( నరకము ) (రోమా 6:23)
పాపము చేస్తే మిమ్మల్ని దేవుడు చంపేస్తాడు. అని ఉన్న వాక్యాన్ని నరకంలో వేస్తాడు అని మార్చారు. చంపేస్తాడు అంటే చిరాకు పడతారు. నరకంలో వేస్తాడు అంటే భయపడతారు. అదే లాజిక్. అయితే నరకంలో వేసి నిత్యాగ్నిలో కాల్చేవాడు కరుణామయుడు ఎలా అవుతాడు?
- మన పాపాలకి ప్రయశ్చితం యోందుటకై తన కుమారున్ని పంపెను.( 1 యోహాను 4:10)
అంటే ప్రజల పాపాలకి తన కొడుకుని చావమని పంపిన తండ్రి యెహోవా అన్న మాట . ఇందులో త్యాగం ఏముంది? యేసు పోరాడింది ఎవరితో? పరాయి వాళ్ళతోనా? సృష్టి కర్త కొడుకుని సిలువ వేసి చంపారు అంటే అంత కన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? సర్లే… ఇంతకీ యేసు తల్లి ఎవరు? యెహోవా భార్య ఎవరు?
- ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ( నరకము నుండి ) రక్షించబడుదుము.( రోమా 5:9)
ఇది పచ్చి తప్పు. అచ్చు తప్పు కాదు.
Romans 5:9
Since we have now been justified by his blood, how much more shall we be saved from God-s wrath through him!
From God’s wrath అంటే దేవుని ఉగ్రత నుండి. నరకం నుండి కాదు. దేవుని కోపం నుండి మనలని రక్షించడానికి యేసు చనిపోయాడు. అంటే యేసు వేరు దేవుడు వేరు అన్న విషయం బయట పడకుండా ఈ వాక్యంలో కవరింగ్ చేశారు.
- కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. ( రొమా 8:1)
ఇది బాగుంది. యేసుని నమ్ముకుంటే చేసిన పాపాలు అన్నీ పోయి యెహోవా వేసే నరకం శిక్ష నుండి బయట పడవచ్చు.
- 3 వ లైన్ మళ్లీ repeat చేశారు.
- అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.(రోమా 10:9)
సరే అండి యేసు ప్రభువని ఒప్పుకున్నారు. చచ్చిపోయిన యేసుని యెహోవా అనే దేవుడు బతికించాడు అని ఒప్పుకున్నారు. అలా ఒప్పుకుంటే హిందువులని యెహోవా రక్షిస్తాడా?
దేవుడు యేసుని లేపాడు అన్నారు కదా మరి యేసుని దేవుడు అంటారేంటి? మీకేమైనా పిచ్చా?
…..
Final గా తేలింది ఏమిటంటే!
- అందరూ పాపాత్ములే. అందరూ నరకానికి పోతారు.
- యేసుని పంపింది, చంపింది యెహోవా దేవుడే.
- మిమ్మల్ని నరకంలో వేసేది, నరకం నుండి కాపాడేది యెహోవానే.
- యేసుని కాపాడింది దేవుడు అదే యెహోవా. కాబట్టి యేసు దేవుడు కాదు. యేసు ఒక బలిపశువు ( గొర్రె పిల్ల ) మాత్రమే.
- ఇవన్నీ ఒప్పుకోక పోతే నరకంలో వేసి కాల్చేది కూడా యెహోవా దేవుడే.
