parents or God?

parents or God?

సనాతన సంప్రదాయం - తల్లి తండ్రులను గౌరవించడం, దైవంలా పూజించడం parents or God?
మాతృ దేవో భవ.

పితృ దేవో భవ.

ఆచార్య దేవో భవ.

అతిథి దేవో భవ॥

తైత్తిరీయ ఉపనిషత్తులో పేర్కొనబడిన ఈ సంస్కృత శ్లోకాలకు అర్ధం మీ అందరికీ తెలిసిందే. వాటిలో మొదటి రెండు వాక్యాలు చెప్పేది ఒకటే తల్లిని దైవంగా, తండ్రిని దైవంగా భావించేవారిగా ఉండండి అని. 


 తల్లి ఎవరికి దైవమో, తండ్రి ఎవరికి దైవమో అలా ఉండండి. 


తల్లిని దైవంగా, తండ్రిని దైవంగా భావించేవారిగా ఉండండి. 


సనాతన సంప్రదాయం - తల్లి తండ్రులను గౌరవించడం, దైవంలా పూజించడం 

ఈ ఉపనిషత్తు సందేశాన్ని పూర్తిగా ఒంటబట్టించుక్కనాడేమో ఏమో పాండురంగడు తాను పూజించే విఠలుడు తన కోసం తన ఇంటికే వస్తే కూడా తన తండ్రి సేవ అయ్యాకే రాగలను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. 

పాండురంగడు చేసిన పనికి అతని దేవుడు కూడా హర్షిస్తాడు. ఎందుకు అంటే అది ఆ దేవుడు చెప్పిన పాఠమే. 

తల్లి తండ్రులు దైవంతో సమానమని ఇంకా చెప్పాలంటే దైవం కంటే ముందు మనకు జన్మనిచ్చిన తల్లి తంద్రుల్లను సేవించుకోవడం ఉత్తమమని ఈ సంఘటన నిరూపించింది. 

ఈ విషయాన్ని ఎవరైనా వింటే వారు కూడా వారి తల్లి తండ్రులను ఏ ఇబ్బంది కలుగ కుండా చూసుకుంటారు. వృధాప్యంలో వారిని విడిచి పెట్టి వెళ్లరు. ఇది సనాతన ధర్మాన్ని ఆచరించే వారు పాటించే మంచి పద్ధతుల్లో ఒకటి. 

శ్రావణ్ కుమార్ కూడా తల్లి తండ్రులను సేవించిన ఉత్తమ కుమారుల్లో ఒకడు. 

ఇక తల్లి తండ్రులను ఎలా చూసుకోవాలో ఎడారి మతాల వారు ఏం చెప్తున్నారో చూడండి. 

1. నాకంటే ఎక్కువగా మీ తల్లితండ్రులను ప్రేమించకూడదు 

తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. (మత్తయి 10:37)


"Anyone who loves his father or mother more than me is not worthy of me; anyone who loves his son or daughter more than me is not worthy of me. (Matthew 10:37)

2. నన్ను తప్ప ఎవరినీ తండ్రి అని పిలవవద్దు 

మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. (మత్తయి 23:9)

And do not call anyone on earth father-, for you have one Father, and he is in heaven. (Matthew 23:9)

3. నాకోసం తండ్రినైనన తల్లి నైన విడిచి పెడితే వారికి నూరురెట్లు లాభం 

నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. (మత్తయి 19:29)

And everyone who has left houses or brothers or sisters or father or mother or children or fields for my sake will receive a hundred times as much and will inherit eternal life. (Matthew 19:29)

4. నాకోసం తండ్రినైనన తల్లి నైన, భార్యనైన విడిచి పెడితే వారికి చాలా రెట్లు రెట్లు లాభం 

ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రుల నైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.(లూకా 18:29-30)

"I tell you the truth," Jesus said to them, "no one who has left home or wife or brothers or parents or children for the sake of the kingdom of God 
will fail to receive many times as much in this age and, in the age to come, eternal life." (Luke 18:29-30)

5. తన తండ్రిని తల్లిని ద్వేషించకపోతే నా శిష్యుడు కాదు. 

ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. (లూకా 14:26)

"If anyone comes to me and does not hate his father and mother, his wife and children, his brothers and sisters--yes, even his own life--he cannot be my disciple. (Luke 14:26)

ఇలాంటి మరెన్నో వచనాలు బైబిల్లో కనపడతాయి. 

ఇప్పుడు చెప్పండి. మీ తల్లి తండ్రులను ద్వేషించమని చెప్పే వాటిని అనుచరిస్తారా? 

లేక మీ తల్లి తండ్రులను పూజించండి, సేవించండి అని చెప్పే సనాతన ధర్మాన్ని ఆచరిస్తారా? 

ఛాయస్ మీదే !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *