యెహోవా నడిపిన పెద్దరికం!
నేను ఇప్పుడు చెప్పబోతింది జగపతి బాబు హీరో గా నటించిన పెద్దరికం సినిమా గురించి కాదు. అంతకు మించిన హై voltage love స్టోరీ గురించి. అది కూడా బైబిల్ నుండి.
అయితే రెండిటిలోనూ కథా వస్తువు ఒక్కటే కావడం గమనార్హం.
రెండు కథల్లోను ఉన్న పోలికలు:
పెద్దరికం స్టోరీ లైన్ :
హీరో ఒక young lover boy. ఒకమాయ్యిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. నిజానికి ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఆ అమ్మాయి కుటుంబం మీద పగతీర్చుకోవాలంటే ఆ పిల్లని ప్రేమలోకి దించక తప్పదు అని ఆ young హీరో ని ఎగదోస్తారు. చివరికి ఆ ప్రేమ కథ రెండు కుటుంబాల మధ్య ఉన్న పగని తీర్చాగలిగిందా? లేదా అన్నది క్లైమాక్స్.
యెహోవా నడిపిన పెద్దరికం:
యెహోవా చెప్పినట్టు నడుచుకుంటూ సున్నతి ఆచారం పాటించే కుటుంబంలో Samson పుడతాడు. Samson ని ఉపయోగించుకుని, పిలష్తీయుల పిల్లని లైన్ లో పెడితే, సున్నతి ఆచారం పాటించని వాళ్లని లేపేయొచ్చు అని యెహోవా ఆలోచన. అందుకే Samson కి శత్రువుల కుటుంబంలోని పిల్ల మీద ప్రేమ పుట్టిస్తాడు యెహోవా. ఇక ఆ ప్రేమ కథ క్లైమాక్స్ కి చేరుతుంది. క్లైమాక్స్ లో 3000 మంది పిలష్తీయులు చనిపోవడంతో కథ ముగుస్తుంది. కానీ bad luck Samson కూడా చనిపోతాడు.
రెండు కథల్లోను ఉన్న తేడా ఏమిటి అంటే జగపతి బాబు మంచి వాడు, love లో సక్సెస్ అవుతాడు. Samson చెడ్డ వాడు, చివరికి చనిపోతాడు.
సినిమాలో హీరోని సుధాకర్ చెడగొడితే, బైబిల్ లో Samson ని యెహోవా ప్రేమలో పడేస్తాడు. చివరికి ఆత్మాహుతి / ఆత్మ హత్య చేసుకొని చచ్చేలా చేస్తాడు
ఇంకా కొన్ని మార్పులు డైరెక్టర్ గారి ఇష్టం ప్రకారం జరిగాయి.
ఇప్పుడు చెప్పండి… ప్రేమ వలలో అమ్మాయిల్ని పడేసి పగ తీర్చుకునే Love జిహాద్ ఆచారం మొదలు పెట్టింది యెహోవా కాక ఇంకెవరు?
…………..
గుర్తు పెట్టుకోవాల్సిన వచనాలు:
వారునీ స్వజనుల కుమార్తెల లోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదను కొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోనుఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. (న్యాయాధిపతులు 14:3)
అయితే ఫిలిష్తీయులకేమైన చేయు టకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీ యులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.(న్యాయాధిపతులు 14:4)
ఇంకా చదివే ఓపిక ఉంటే పూర్తి story చదవండి.
……….
కథని సింపుల్ గా తెలుసుకుందాం.
1.ఫిలిష్తీయుల పిల్లని ప్రేమించాను అంటాడు Samson. Penis ముందు తోలు cut చేసుకోని అలాంటి అనాగరికుల పిల్ల తప్ప నీకు ఇంకెవరు దొరకలేదంట్రా? అని తల్లి తండ్రులు కోప్పడతారు. చివరికి ఒప్పుకుంటారు.
- పిచ్చి పిచ్చి పందాలు కాసి, ఊరి వాళ్ళతో గొడవ పెట్టుకొని సంబంధం చెడగొట్టుకుంటాడు. చివరికి ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయ్యాక, ఆమె చెల్లిని పెళ్ళాడబోతాడు.
- Lover పోయిందన్న పగతో, ఆ ఊరి వారి గాడిదల ass hole లో కాలుతున్న కర్రలు గుచ్చి పొలాలను పాడుచేస్తాడు. వాళ్ళు అతన్ని చంపాలని వెతుకుతూ ఉంటారు.
- Samson కి కొత్తగా Delilah అనే వేశ్య పరిచయం కాగా ఆమెతో పడుకుంటాడు. ఆమె సహాయంతో అతనికి గుండు గీయించి, అతడు శక్తి హీనుడయ్యాక బంధిస్తారు. దేవుడు సహాయం చేయగా వాళ్ళందరిని చంపి, తాను కూడా చస్తాడు Samson.
ఈ కథ ద్వారా మనకు దొరికే నీతి ఏమిటి?
నాకు తోస్తున్న సమాధానాలు:
- సున్నతి చేసుకొని వాళ్ళు , వేరే దేవతలను పూజించే వాళ్లపై పగ పెంచుకున్న యెహోవా SAMSON ని ఒక పావుగా వాడుకున్నాడు .
- పూటకో అమ్మాయిని మోహించే SAMSON పైన యెహోవా కరుణ చూపాడు . సో తప్పు చేసినా దేవుడు సహాయం చేస్తాడు .
- తమ పొలాలను నాశనం చేసి, తమ వాళ్ళను చంపిన SAMSON ని ఫిలిస్తీయులు చంపాలనుకోవడం తప్పా? కేవలం వారు వేరే దేవుళ్ళకు మొక్కేవారు కాబట్టి, సున్నతి చేసుకోరు కాబట్టి,ఇజ్రాయెల్ వాళ్లను పాలిస్తున్నారు కాబట్టి యెహోవా వాళ్ళని SAMSON తో చంపించాడు .
- SAMSON ఆఖరులో అతడు పచ్చి పోరంబోకు అని తెలిసి కూడా దేవుడు సహాయం చేయడం దుష్ట శిక్షణ కిందకి రాదు దుష్ట రక్షణ కిందే వస్తుంది .
మరి దేవుడు ఇలా చెడ్డ వాళ్లని సపోర్ట్ చేయొచ్చా?
రిఫరెన్స్లు :
Judges 14:1
సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను.
Judges 14:2
అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా..
Judges 14:3
వారునీ స్వజనుల కుమార్తెల లోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదను కొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోనుఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను.
Judges 14:4
అయితే ఫిలిష్తీయులకేమైన చేయు టకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీ యులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.
Judges 14:7
అతడు అక్క డికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఇష్టము కలిగెను.
Judges 14:12
అప్పుడు సమ్సోనుమీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన యెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.
Judges 14:13
మీరు దాని నాకు తెలుపలేక పోయినయెడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారుమేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి.
Judges 14:16
కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్ద పడి యేడ్చుచునీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడునేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చు చువచ్చెను.
Judges 14:20
అతడు కోపించి తన తండ్రి యింటికి వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికాని కియ్యబడెను.
Judges 15:2
ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ల నియ్యకనిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని; ఆమె చెల్లెలు ఆమెకంటె చక్కనిదికాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను.
Judges 15:3
అప్పుడు సమ్సోనునేను ఫిలిష్తీయు లకు హానిచేసినయెడల వారి విషయములో నేనిప్పుడు నిర పరాధినైయుందునని వారితో చెప్పి..
Judges 15:4
పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను త్రిప్పి రెండేసి తోకలమధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి
Judges 15:5
ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్షతోటలను ఒలీవతోటలను తగులబెట్టెను.
Judges 15:6
ఫిలిష్తీ యులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు, తిమ్నా యుని అల్లుడైన సమ్సోను భార్యను ఆమె తండ్రి తీసికొని అతని స్నేహితుని కిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి.
Judges 15:8
తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.
Judges 16:1
తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.
Judges 16:4
పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా
Judges 16:5
ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతోనీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణములను నీకిచ్చెదమని చెప్పిరి.
Judges 16:17
అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసినేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.
Judges 16:19
ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీది యేడు జడ లను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను.
Judges 16:21
అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.
Judges 16:23
ఫిలిష్తీయుల సర్దారులుమన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడు కొనిరి.
Judges 16:24
జనులు సమ్సో నును చూచినప్పుడుమన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి.
Judges 16:26
సమ్సోను తనచేతిని పట్టు కొనిన బంటుతో ఇట్లనెనుఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును.
Judges 16:27
ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తీయుల సర్దారు లందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళి చేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి.
Judges 16:28
అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి
Judges 16:29
ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని..
Judges 16:30
నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.