అవును.. యెహోవాకి జంతువుల్ని కాల్చి (దహన బలి), వాటి వాసనని పీల్చడం ఇష్టం.

“అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.
(ఆదికాండం 8:21)
యెహోవాకి జంతువుల్ని ఇచ్చేటప్పుడు దహన బలి రూపంలో కావాలి అంటాడు యెహోవా.ఆదాము కొడుకు హేబేలు దగ్గర నుండి యేసు తల్లి మేరీ వరకు అందరూ యెహోవాకి జంతువుల్ని బలి ఇచ్చారు.
ముఖ్యంగా అతిపెద్ద వరద (Noah s flood) తర్వాత నోవా యెహోవా కొన్ని జంతువుల్ని తగలబెట్టి బలిగా అర్పిస్తాడు. అప్పుడు యెహోవా ఎంతో ప్రసన్నుడౌతాడు.
Pleasing = Sweet = delighting
అంత ఇష్టమా యెహోవాకి జంతు దాహన బలి అని అనుకోకండి. లేవీయకాండం లో కొన్ని పేజీల నిండా జంతువుల్ని కాల్చి తనకు అర్పించాలో యెహోవా చెప్పుకొచ్చాడు.కొన్ని వచనాలను క్రింద ఉదాహరిస్తాను
లేవీయకాండం 1:1-3
యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడార ములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.
నీవు ఇశ్రా యేలీయులతో ఇట్లనుముమీలో ఎవరైనను యెహో వాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱెల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను.
పశువుల దహనబలి:
(లేవీయకాండం 1:4 నుండి 1:9)
అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహ రోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాతయాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.
అప్పుడు యాజకులైన అహరోను కుమా రులు ఆ అవయవ ములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.
అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి యగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.
ఇలా జంతువుల్ని, పక్షుల్ని ఎలా బలివ్వాలో యెహోవా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. వాటిని యెహోవా భక్తులు అందరూ ఫాలో అయ్యారు.ఇలా జంతువుల్ని తాగాలబెడితే వచ్చే వాసన యెహోవాకి ఇంపైన సువాసన gala హోమం అని బైబిల్ చెప్తోంది.
లేవీయకాండం 1,2 చాఫ్టర్లు చదవండి..
చదివిన తర్వాత మీకు కడుపులో దేవినట్టుగా అనిపిస్తే అది నా తప్పు కాదని సవినయంగా తెలియ జేసుకుంటున్నాను.