Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యెహోవా గుళ్లో అర్చకత్వం -శిక్షలు

అర్చకులు – యెహోవా దూతలు

యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను. (మలాకీ 2:7)

అర్చకుడు /యాజకుడు అనబడే యెహోవా దేవదూత పదవి ఎవరి సొంతం?

నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. (సంఖ్యా కాండం 3:10)

హిందూ ఆలయాల్లో బ్రాహ్మణ వర్గం మాత్రమే దేవుని సేవలో ఉండటం చూసి, అదేదో వివక్ష అన్నట్టు తెగ పిసికేసుకునే క్రైస్తవులు, అహరోను కుటుంబం తప్ప ఎవరూ అర్చకులు కాకూడదు అని యెహోవా రాసిన ఈ మరణ శాసనాన్ని ఎందుకు ప్రశ్నించరు?

బైబిల్ ‘కుల వ్యవస్థ’ ని సవాల్ చేసిన విప్లవకారుడు – కోరా (Korah).


కోరా ఒక బానిస వర్గానికి చెందిన వ్యక్తి.
కోరా వర్గాన్ని యెహోవా ఆలయంలో పనివాళ్ళుగా ఉంచాడు మోసే ( యెహోవా నియమించిన ప్రవక్త ).
అయితే గుళ్లో పనివాళ్ళుగా ఉండటం కోరాకి ఇష్టం లేదు. తాము కూడా యెహోవా గుళ్లో అర్చకులుగా ఉంటామని మోసే తో వాదనకి దిగాడు కోరా.(సంఖ్యా కాండం 16:1)
ఆసలు యెహోవా గుళ్లో అర్చకత్వం ఎవరు చెయ్యాలి? ఎవరు పనివాళ్ళుగా వుండాలి? ఎలా నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారు?
బైబిల్ లో అర్చకత్వం ఒక్క కుటుంబానికే కట్టబెట్టాడు యెహోవా! అది కూడా మోసే తమ్ముడు అహరోను ఇంకా అతని కుటుంబ సభ్యులకే! ఇతరులకు గుళ్లో అర్చకత్వం నిషేదించాడు.
నిర్గమ కాండం 28:1
మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
గుళ్లో అర్చకుడికి వచ్చే లాభాలు ఏమిటీ?
ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమ ములలో అది అతిపరిశుద్ధము.(లేవీయకాండం 2:3)
ఆలయంలో యెహోవాకి బలిగా అర్పించే జంతువుల్లో, మనుషుల్లో, వస్తువుల్లో కొంత భాగం అహరోను కుటుంబానికే దక్కాలి.
వేరే వాళ్లు అర్చకత్వం చేస్తే ఏం చేయాలి?
“మరణశిక్ష “
నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.(సంఖ్యా కాండం 3:10)


Rebellion of Korah:
అర్చకత్వం అహరోను & బ్యాచ్ కి మాత్రమే యెహోవా కట్టబెట్టడం ఏమిటని కోరా ప్రశ్నించాడు.
Evidence -1
దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని వాదించిన కోరా:
మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి.. మీతో మాకిక పనిలేదు; ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు;
యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించు కొనుచున్నారనగా… (సంఖ్యా కాండం 16:3)
Evidence -2
ఎవరు తనవడో యెహోవానే డిసైడ్ చేస్తాడు అన్న మోసే:
తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.(సంఖ్యా కాండం 16:5)
Evidence -3
అర్చకత్వం కోరడం తప్పు అన్న మోసే:
ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు.(సంఖ్యా కాండం 16:10)
Evidence -4
యెహోవా ఎదుట కోరా వర్గాన్ని నిలబెట్టిన మోసే.
మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.(సంఖ్యా కాండం 16:17)
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.(సంఖ్యా కాండం 16:30).
Evidence -5
అర్చకత్వం కోరిన 250 మందిని చంపేసిన యెహోవా:
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.(సంఖ్యా కాండం 16:32).
మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.(సంఖ్యా కాండం 16:35)
చూశారుగా…
250 మందిని చంపి అర్చకత్వంపై ఇంకెవరూ కన్ను వేయకుండా క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చిన యెహోవా.
దేవుడి గుళ్లో అర్చకత్వం అందరికీ దక్కాలి అనడం సెక్యూలరజం, కొందరు మాత్రమే అర్చకత్వం చేయడం కుల పిచ్చి అనేది నిజమైతే యెహోవాకి అందరి కంటే ఎక్కువ కుల పిచ్చి అని ఒప్పుకోవాల్సి వస్తుంది.
ఈ అహరోను కుటుంబ అర్చకత్వం యేసు కాలం వరకు సాగింది అని బైబిల్ చెప్తోంది. యేసుకి బాప్టిజం ఇచ్చిన యోహాను తండ్రి కూడా ఇదే కుటుంబ సభ్యుడు. ఆయన కూడా అర్చకుడు. అహరోను సంతతి వాడు.(లూకా 1:5, 1:36).ఇంత కన్నా కుల పిచ్చి ఉంటుందా?
కులం అంటే ఒక ప్రత్యేకమైన సమూహం. Caste పిచ్చి అంటే ఒక వర్గం లేదా సమూహమే గొప్ప లేదా ప్రత్యేకం అనే పిచ్చి.
ఒక వర్గం లేదా కుటుంబం మాత్రమే గుళ్లో అర్చకత్వం చేయడం కుల వివక్ష అయితే యెహోవా చేసింది ఏమిటి?
అహరోను కుటుంబంలాగే అందరూ అర్చకత్వం కోరుకో వడం తప్పా?
కుల పిచ్చితో యెహోవా దేవుడు ఇలా 250 మందిని చంపడం కరెక్టే నా?
కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే గుళ్ళోకి ప్రవేశించాలి, కొందరు మాత్రమే అర్చకత్వం చేయాలి, కొందరు గుళ్ళోకి రాకూడదు అని నియమాలు పెట్టడం తప్పు అయితే యెహోవా చేసింది కూడా తప్పే. ఎందుకు అంటే యెహోవా గుళ్లో అర్చకుడికి కొన్ని నియమాలు పెట్టాడు యెహోవా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *