బైబిల్లో పుష్కరుడు ( The Angel at the Pool Of Bethesda)కొందరు హిందువుల నమ్మకం:12 ఏళ్ళకి ఒకసారి గోదావరి నదిలో పుష్కరుడు అనే దేవత ఆవహించి ఆ నదికి మహిమలు కలుగజేస్తాడు. అందులో స్నానం చేస్తే పాపాలు, రోగాలు అన్నీ పోతాయి.బైబిల్ నమ్మకం :Bethesda(బేతెస్ద) అనే కోనేరు వుంటుంది. ఒక దేవ దూత వచ్చి ఆ కోనేరులోని నీటిని కదిలించినప్పుడు ఆ నీళ్ళకి రోగాలని తగ్గించే మహిమలు వస్తాయి. ఎంత పెద్ద రోగం అయినా తగ్గటం జరుగుతుంది.యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.(యోహాను 5:2)ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును,గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. (యోహాను 5:3-4)For an angel went down at a certain season into the pool and troubled the water. Whosoever then first stepped in, after the troubling of the water, was made whole of whatsoever disease he had.ఇక్కడ season (ఆయా సమయములందు) అన్నది పుస్కర కాలం.ఆ దేవత పుష్కరుడు.యూదుల పండుగ = పుస్కారాల పండగ.అలాగే ఈ line చూడండి.”ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును”అంటే పక్కాగా నీటిలోకి దిగిన వాడు రోగాల నుండి నయమవ్వుతారు అని కంఫర్మ్ చేస్తోంది.అదే నమ్మకంతో ఒక రోగి యేసుతో ఇలా అంటున్నాడు.ఆ రోగి అయ్యా, (దేవత వచ్చి) నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.(యోహాను 5:7)అక్కడ యేసు కూడా ఆ నమ్మకం తప్పు అని చెప్పలేదు. కానీ యెహోవాని వ్యతిరేకించే స్వభావం కాబట్టి ఆ వ్యక్తిని విశ్రాంతి దినం రోజున స్వస్థత పరచి గొడవకి కారణం అయ్యాడు. విశ్రాంతి దినం రోజున పనిచెయ్యకూడదు అన్నది యెహోవా పెట్టిన నియమం.టాపిక్ డైవర్ట్ అవకుండా మళ్లీ నదిలోని నీటి సంగతి చూద్దాం.కొందరు క్రైస్తవులు, నదిలో దూకితే పాపాలు పోతాయా? అని ప్రశ్నిస్తున్నారు?వాళ్లకి బైబిల్ తెలియదు. కోనేరు లో స్నానం చేసినా, నదిలో స్నానం చేసినా రోగాలు తగ్గుతాయని నమ్మేవాళ్లు బైబిల్ కాలంలో కూడా ఉన్నారు. పైగా మీ బైబిల్ అది నిజమే అని చెప్తుంది. మీ యేసు దానిని ఖండించలేదు. మీ యేసుకి యెహోవాని తప్పు పట్టాలన్న ఆలోచన తప్పిస్తే వేరే ఆలోచన లేదు కదా!బైబిల్ లో దేవదూత ఆవహించి కోనేరుకి మహిమలు వచ్చి రోగాలు తగ్గినట్టే, పుష్కరుడు ఆవహించి ఉన్న కాలం లో గోదావరి లాంటి నదులకి మహిమలు వచ్చి పాపాలు పోతాయి. దానివలన రోగాలు తగ్గుతాయి అనేది కొందరు హిందువుల విశ్వాసం. వాళ్ళ విశ్వాసాలను విమర్శించే ముందు బైబిల్ లో అలాంటివి ఉన్నాయో లేదో చూసుకుని మాట్లాడండి క్రైస్తవులారా!లేకపోతే కౌంటర్ ఇలాగే ఉంటుంది!ఫైనల్ గా Solomon లాంటి క్రైస్తవులకి బైబిల్ తెలియదు అని prove చేయడం జరిగింది.
బైబిల్లో పుష్కరుడు ( The Angel at the Pool Of Bethesda)
ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును,గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. (యోహాను 5:3-4)