Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యెహోవా ఆలయంలో అర్చకత్వం చేయాలని ఉందా?

ఈ క్రింది క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చును.
ముఖ్యమైన 10 నియమాలు పాటించి, ప్రతి రోజు యెహోవాకు జంతుబలులు ,ధూపం వేయడం, నైవేద్యం పెట్టడం చెయ్యాలి.

This image has an empty alt attribute; its file name is IMG_20210830_150014-1024x1024.png

మొదటి అర్హత:

గమనించగలరు: అర్చకత్వం అహరోను వంశంలో పుట్టినవారు అయ్యుండి, కన్నెపిల్లని పెళ్లాడిన వారికి మాత్రమే!

మరిన్ని వివరాలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది. అర్హులు కానీ వాళ్ళు ఆలయంలో అర్చకత్వం కోరితే కఠిన శిక్షలు తప్పవు.

అతను అహరోను వంశంలో జన్మించి ఉండాలి. అలా కొందరికే అర్చత్వం కట్టబెట్టడం “కుల వ్యవస్థ” కాదా? అని మీరు అనుకున్నా Yehova ఊరుకోడు. కాదని అర్చకత్వం చేస్తాం అని ముందుకు వస్తే భూమి మిమ్మల్ని మింగేస్తుంది. జాగ్రత్త.

అహరోను కుటుంబంలో పుట్టిన అర్చకులు ఈ క్రింది నియమాలు పాటించి తీరాలి. అప్పుడే జంతు బలి, నరబలల్లో, చపాతీ, అప్పడాలు అన్ని రకాల ప్రసాదాల్లో వాటా దక్కుతుంది.

ఇక rules ఏమిటో చూద్దాం.





Rules యెహోవా నే చెప్పాడు అనడానికి ఆధారం

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.(Leviticus 21:1)

Rule -1

( ఊర్లో ఎవడు చచ్చిపోయినా ఆ శవాన్ని ముట్టుకో కూడదు. కానీ తల్లి తండ్రులు, family members చచ్చిపోతే శవాన్ని ముట్టుకో వచ్చు.ఎందుకంటే ప్రజల కంటే అర్చకుడు గొప్పోడు కాబట్టి.)

యాజ కులగు అహరోను కుమారులతో ఇట్లనుముమీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును.

అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచు కొని సామాన్యునిగా చేసికొనరాదు. (లేవీయకాండము 21:3-4)

Rule -2

గుండు గీసుకున్నా,పక్క గడ్డం గొరుక్కున్నా యెహోవా గుళ్లో అర్చకులుగా చేయడానికి పనికి రారు.

వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.

వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.( లేవీయకాండము 21:5-6)

Rule -3

వేశ్యలని పెళ్లి చేసుకున్న వాళ్ళు, మొగుడికి దూరంగా ఉంటున్న స్త్రీతో ఉంటున్న వాళ్ళు Disqualified.

వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.
అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచ వలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను.(లేవీయకాండము 21:7)

Rule -4

అర్చకుడి కూతురు లేచిపోయినా/ వేశ్య అయినా అర్చకుడు Disqualify అవుతాడు. వాడి కూతుర్ని బతికుండగానే తగలబెట్టాలి.

మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచు కొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.( లేవీయకాండము 21:9)

ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;(లేవీయకాండము 21:10)

Rule -5

(తండ్రి శవాన్ని గాని తల్లి శవాన్ని గాని ముట్టుకో కూడదు. ఇంతకు ముందు ముట్టుకోవచ్చు అని చెప్పాడు కదా అని అడగవద్దు 🤣.)

అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననే గాని తన తల్లి శవమువలననే గాని తన్ను అపవిత్రపరచుకొన రాదు. (లేవీయకాండము 21:11)

Rule -6

గుడిని అపవిత్ర పరచకూడదు.

దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను.

Rule -7

కన్నె పిల్లని మాత్రమే పెళ్లాడాలి. Widows ని (విధవల్ని ), మొగుడు వదిలేసిన దానినైనా, వేశ్యలని పెళ్లి చేసుకున్నా, మొగుడికి దూరంగా ఉంటున్న స్త్రీతో ఉంటున్నా job కి Disqualified.

అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.
విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొన వలెను. (లేవీయకాండము 21:14)

యెహోవా అను నేను అతని పరి శుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.

Rule -8

ఇంకా ఉంది.

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

వికలాంగులు అర్చకులుగా unqualified. వాళ్ళు అర్చకత్వం చేయడానికి పనికి రారు. వాళ్ళు గుళ్ళోకి వస్తే గుడి మైల పడుతుంది.

నీవు అహరోనుతో ఇట్లనుమునీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.

ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని..

కాలైనను చేయినైనను విరిగినవాడే గాని

గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.

యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.

అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.

మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీ పింపకూడదు;
నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

Rule -9

కుష్ఠు రోగులు, వీర్యం లీక్ అయినవాడు గుళ్ళోకి రాకూడదు.

అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమై నను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును.

ఇంకా చాలా చండాలం ఉంది. కానీ ఇక్కడితో ఆపేస్తున్నా.

Rule-10

అర్హులు కానీ వాళ్ళు ఆలయంలో అర్చకత్వం కోరితే కఠిన శిక్షలు తప్పవు.

ఎలాంటి శిక్షలు పడతాయో తెలియాలంటే ఈ పోస్ట్ చూడండి.

https://ramananationalist.in/korah-was-killed-by-yehova-for-asking-priesthood/
మీకు కొన్ని అనుమానాలు రావచ్చు
  1. అహరోను కుటుంబం మాత్రమే అర్చకత్వం చేయడం వేరే వాళ్ళు చేస్తే వాళ్ళను యెహోవా చంపేయడం కుల వ్యవస్థ కాదా?
  2. విధవల్ని, భర్తకి దూరమైన స్త్రీలని, వేశ్యల్ని పెళ్లాడితే తప్పా?
  3. వికలాంగులు గుళ్ళోకి వస్తే యెహోవా మైల పడతాడా?
  4. అర్చకుడి కూతురు వ్యభిచారం చేస్తే ఆమెని సజీవ దహనం చెయ్యాలా?
  5. కన్నీపిల్లలని మాత్రమే పెళ్లాడాలా? విధవల్ని పెళ్లాడ కూడదా?
  6. తల్లి తండ్రులు చనిపోతే ముట్టుకో కూడదా? ముట్టుకోవచ్చా?
  7. అర్చకుడి కంటే ఊరిజనం తక్కువ విలువ కలిగిన వాళ్ళా?
  8. గడ్డం, గుండు గీసుకుంటే గుళ్లో అర్చకుడిగా పనికి రారా?

ఏమీటిది యెహోవా? ఏమిటీ వివక్ష? ఏమిటి ఈ rules?

ఇలాంటి ఎన్ని అనుమానాలు ఉన్నా మీరు ప్రశ్నించ కూడదు. అవి మా దేవుడు యెహోవా పెట్టిన నియమాలు. దైవ నిందకు తప్పదు భారీ మూల్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *