
Rainbow ఎలా ఏర్పడుతుంది?

Rainbow ఎలా ఏర్పడుతుంది?
బైబిల్ ప్రకారం:
అపర కరుణామయుడు అయిన యెహోవాకి ఒకరోజు బాగా కోపం వచ్చింది. వెంటనే మానవ జాతి మొత్తాన్ని చంపేద్దాం అనుకున్నాడు. మనుషులతో పాటు ఏ సంబంధమూ లేని భూమి మీద ఉన్న దాదాపు జంతువులని కూడా చంపేయాలనుకున్నాడు. చెట్టు, చీమ అని తేడా లేదు, ఆడ మగ తేడా లేదు. గర్భవతులు, పసిపిల్లలు అన్న జాలి లేదు.. అందరినీ చంపెయ్యాలి. అదొక్కటే డిసైడ్ అయ్యాడు. నోవా అనే ఒకడి కుటుంబ సభ్యులు, ఇంకా కొన్ని జతల జంతువుల గుంపులు తప్ప మొగతా జీవరాశి మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు.
పెద్ద వరద రప్పించాడు. అందరిని చంపేశాడు.
అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.(ఆదికాండము 7:21)
తన కుటుంబాన్ని మాత్రం వదిలేశాడు అన్న కృతజ్ఞతతో నోవా కొన్ని జంతువుల్ని బలిచ్చి, తాగాలబెట్టితే వాటి వాసన చాలా ఇంపుగా ఉందని ఆనందించాడు.(ఆదికాండము 8:20)
తరువాత కొంచెం కోపం తగ్గిన యెహోవా, RainBow ని సృష్టించాడు. ఇకపై ఎవరిని చంపను అని promise చేశాడు. మేఘాల మధ్య rainbow ని ఉంచాడు. ఇకపై యెహోవాకి కోపం వస్తే ఆ rainbow చెప్తుంది. నాయనా మా తండ్రి యెహోవా… మాట ఇచ్చావు. జనాలని మళ్లీ చంపను అని.. మర్చిపోకు అని..!
మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధ నకు గురుతుగా నుండును.(ఆదికాండము 9:13)
భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.(ఆదికాండము 9:14-15)
అలా మేఘాల మధ్య Rainbow ఏర్పడింది అని బైబిల్ చెప్తోంది. అదే మొదటి సారి Rainbow ఏర్పడటం అని కొందరు క్రైస్తవుల విశ్వాసం కూడా!
Genesis 9:13-16
13 I have set my rainbow in the clouds, and it will be the sign of the covenant between me and the earth.
14 Whenever I bring clouds over the earth and the rainbow appears in the clouds,
15 I will remember my covenant between me and you and all living creatures of every kind. Never again will the waters become a flood to destroy all life.
16 Whenever the rainbow appears in the clouds, I will see it and remember the everlasting covenant between God and all living creatures of every kind on the earth.”
ఇంతకీ ఈ rainbow యెహోవా ప్రేమకి గుర్తా? యెహోవా క్రూరత్వానికి గుర్తా?
………
ఇక Rainbow సైన్స్ ప్రకారం ఎలా ఏర్పడుతుంది?
ప్రశ్న: ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు: వాతావరణంలో మిగిలిన కాలాల కన్నా వర్షాకాలంలో నీటి ఆవిరి పెద్ద పెద్ద బిందువుల రూపంలో ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే ధవళకాంతి ఆ నీటి బిందువుల గుండా వెళ్లేప్పుడు గాలిని, నీటిపొరను వేరుచేసే అంతరోపరితలం(interface) వద్ద వక్రీభవనం (refraction)చెందుతుంది. ఇలా వక్రీభవనం చెందే కోణాలు వివిధ తరంగదైర్ఘ్యాల (wavelengths)కు వేర్వేరుగా ఉండడం వల్ల ధవళకాంతిలోని వివిధ కాంతి తరంగాలు ఏడు రంగులుగా విడిపోతాయి. ఇలా విసిన కర్రలాగా విస్తరించుకున్న సప్తవర్ణాలు, ఆ బిందువు అవతలివైపున ఉండే అంతరోపరితలం వద్ద అంతర్గత సంపూర్ణ పరావర్తనం (Total Internal Reflection) చెంది మన కంటిని చేరుతాయి. కాబట్టి ఇంద్రధనుస్సు మన కంటిలోనే ఏర్పడుతుంది కానీ, ఆకాశంలో కాదు. అందుకే హరివిల్లనేది మిధ్యాబింబం(virtual image).
………
అరెరే… సైన్స్ అంతా మేమే కనిపెట్టేశాము అని చెప్పే క్రైస్తవులు ఈ విషయంలో బైబిల్ చెప్పింది తప్పు అంటారా?
మేఘాల్లో తన ధనుస్సుని ఉంచిన యెహోవాకి, కళ్ళలోనే Rainbow ఏర్పడుతుంది అని తెలియదా?
Rainbow మేఘాల్లో కదా వుండాలి?
మా అపరకరుణామయుడు, అన్నీ తెలిసిన యెహోవా భక్తులు బైబిల్ నుండి సమాధానం చెప్పాల్సింది కోరడమైనదహో….!!!