“అగ్గి మారింది అని యాజకులను బుగ్గి చేసిన (కాల్చి చంపేసిన) యెహోవా”

యెహోవాకు కోపం మళ్ళీ వచ్చింది— ఈసారి బాహ్య శత్రువులపై కాదు, ఆయన సొంత యాజకులపైనే.

అహరోనుకు ఇద్దరు కుమారులు — నాదాబు, అబీహు. వీరు బైబిల్ దేవుని సేవలో ఉన్న యాజకులు. ఒక రోజు, దేవుడు ఆజ్ఞాపించని ఒక “వింత అగ్గి” (Strange Fire)ని యెహోవా ముందుకు సమర్పించారు.

“నాదాబు, అబీహు తమ తమ ధూపపాత్రలు తీసుకొని, అగ్ని వేసి, దానిమీద ధూపమువేసి, యెహోవా ఆజ్ఞాపించని వింత అగ్గిని సమర్పించారు.”
లేవీయకాండము 10:1

దానికే యెహోవా కోపంతో అగ్ని పంపి వారిని కాల్చి హంపేశాడు.

“యెహోవా సముఖమునుండి అగ్ని బయలుదేరి వారిని దహించెను; వారు యెహోవా సముఖమునే చనిపోయిరి.”
లేవీయకాండము 10:2

ఇద్దరు యాజకులు — అదే రోజున, వారి దేవుని చేతిలో కాలిపోయారు. కారణం? కేవలం వారి దేవుడు వారికి ఆజ్ఞాపించని అగ్గి వేయడం! అంటే మనిషి దేవుని దృష్టిలో కేవలం ఆటబొమ్మ. ఒక రోబో. చెప్పింది చేయాలి. లేదంటే అంతే సంగతి!


మోషే ఈ దారుణం తర్వాత అహరోనుతో ఇలా చెప్పాడు:

“ఇదే యెహోవా మాట — నాతో సమీపముగా వచ్చువారిలో నేను పరిశుద్ధుడనైయుండుదును, ప్రజలముందర మహిమింపబడుదును.”
లేవీయకాండము 10:3

దేవుడు తన “మహిమ” కోసం యాజకులను బలి చేశాడట. ఇది దైవ గౌరవమా లేక దౌర్జన్యమా?

మోషే అహరోనును హెచ్చరించాడు —

“నీ తల మూయకుము, నీ వస్త్రమును చించకుము, లేని పక్షమున నీవు చనిపోవుదువు, ప్రజలమీద కోపము వచ్చును.”
లేవీయకాండము 10:6

అంటే, తండ్రి తన కుమారుల మరణంపై దుఃఖిస్తే కూడా దేవుడు చంపేస్తాడట!
అందుకే అహరోను ఏమీ మాట్లాడలేదు.

“అహరోను మౌనముగా నుండెను.”
లేవీయకాండము 10:3


ఆఖరి మాట:
యెహోవా తన ఆజ్ఞల్ని అతిక్రమించినవారిని మాత్రమే కాదు, తప్పుగా ధూపం వేసిన యాజకులనే కాల్చేశాడు.
దీనిని “దైవ మహిమ” అంటారు అంట, మరి మానవత్వం సంగతి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *