సెల్ఫ్ గోల్ వేసుకున్న కృపారావు గారు ! జుట్టు కత్తిరించుకోవడం, దేవునికి సమర్పించడం బైబిల్లో కూడా ఉన్నాయని తెలియక సెల్ఫ్ గోల్ వేసుకున్న కృపారావు గారు అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. (సంఖ్యాకాండము 6:18) ఇతర గ్రంధాలను వక్రీకరించడానికి కేటాయించిన సమయాన్ని బైబిల్ చదవడానికి కేటాయించి ఉంటే ఇలాంటి సెల్ఫ్ గోల్స్ పడేవి కాదు కదా! కృపారావు గారు!

జుట్టు కత్తిరించుకోవడం, దేవునికి సమర్పించడం బైబిల్లో కూడా ఉన్నాయని తెలియక సెల్ఫ్ గోల్ వేసుకున్న కృపారావు గారు.

అయ్యో పాపం అనిపించే ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు భగవంతుడా!

కృపారావు గారి ప్రశ్న:

“నాకు తెలియక అడుగుతున్నా, కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు జుట్టు ఇస్తామని భక్తులు మొక్కుకుంటారు. జుట్టుని సమర్పించుకుంటారు. నిజానికి జుట్టును ఇమ్మని ఆ దేముడ్లు అడుగుతారా? అడిగిన అడగకపోయినా భక్తులు ఇచ్చే ఆ జుట్టును ఆ దేముడ్లు ఏం చేసుకుంటారు? తెలియక అడుగుతున్నా, అన్యధా భావించకుండా తెలిస్తే నా సందేహాన్ని నివృత్తి చేయండి”

ఇలా వ్రాసి దానికి రిలేటెడ్ ఇమేజ్ కూడా పెట్టి తనకు ఏమీ తెలియదని ఒప్పుకుంటూ నన్ను ట్యాగ్ చేసి మరీ పోస్ట్ పెట్టారు కృపారావు గారు. కాబట్టి ఆయనకున్న సందేహాలను తీర్చడం నా బాధ్యతగా భావించి, సమాధానం చెప్తున్నాను.

హిందూ దేవుళ్ళు జుట్టు ఇవ్వండి అని అడగటం మనం చూసేది తిరుపతి లాంటి క్షేత్రాల లోనే. కొన్ని చోట్ల స్థల పురాణాలను బట్టి ఇలాంటి ఆచారాలు పుడతాయి. ఉదాహరణకు తిరుమల స్థల పురాణం ప్రకారం నీలా అనే ఒక ఆమె వెంకటేశ్వర స్వామికి తన తల వెంట్రుకలు సమర్పించి, వెంకటేశ్వర స్వామి తలపై ఉన్న గాయం తాలూకా మచ్చను తొలగించే ప్రయత్నం చేసింది అని, ఆమె భక్తికి మెచ్చి తన భక్తులు కూడా తమ తల వెంట్రుకలు సమర్పించుకుని తమ భక్తి ని చాటుకుంటారు అని వెంకటేశ్వర స్వామి అన్నాడు అని, నీలా అనే ఆమె పేరుని బట్టి ఆ తల వెంట్రుకలకు నీలాలు అనే పేరు వచ్చిందని చెప్తారు. ఐతే ఆలా సమర్పించబడిన ఆ తల వెంట్రుకలను దేవుళ్ళు ఏమీ చేసుకోరు. అవి వేలం వేస్తారు. వచ్చిన డబ్బుని టీటీడీ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.

ఇక బైబిల్ సంగతి చూద్దాం.

బైబిల్లో బొచ్చుని ఏం చేస్తారు?

అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. (సంఖ్యాకాండము 6:18)

నాజీరు అంటే యెహోవాకు తనను తాను ప్రత్యేకపరచుకున్న వ్యక్తి. మనకు అర్ధం అయ్యే భాషలో యెహోవా వ్రతం, దీక్ష లేదా యెహోవా మాల వేసుకున్న భక్తుడు. అతడు ద్రాక్ష రసం మానేయాలి. మరికొన్ని నియమాలు కొన్ని రోజుల పాటు పాటించాలి.

శాంసన్ అనే బైబిల్ పాత్ర పుట్టినప్పటి నుండి జుట్టు కత్తిరించుకోడు.

అలాంటి వారినే నాజీరు అంటారు. పౌలు కూడా తన బొచ్చుని కత్తిరించుకుని అగ్నిలో వేశాడు అని అనుకోవాల్సి వస్తుంది. (hint: యూదుల నియమాన్ని పాటించాడు)

పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.(అపో. కార్యములు 18:18)

Acts 18:18
Paul stayed in Corinth for some time after that and then said goodbye to the brothers and sisters and sailed for the coast of Syria, taking Priscilla and Aquila with him. (Earlier, at Cenchrea, Paul had shaved his head according to Jewish custom, for he had taken a vow.)

ఐతే సాధారణ జనం నాజీరు సమయం అయిపోగానే తమ పెరిగిన జుట్టుని కత్తిరించుకొని, యెహోవాకు సమర్పించే సమాధాన బలి అనబడే హోమంలో (అగ్గిలో) వెయ్యాలి. తగలబెట్టాలి.

ఇప్పుడు కృపారావు గారు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం బైబిల్లో ఉంది.

యెహోవాకు సమర్పించిన ఆ తలవెంట్రుకలను మంటల్లో వేస్తే పొగ వస్తుంది. ఆ పొగను యెహోవా ఏం చేసుకుంటాడు? ఇంపైన సువాసన అని వాటి నుండి వచ్చిన పొగని ఆఘ్ రానిస్తాడా?

తిరుపతిలో ఇచ్చే వెంట్రుకలు వేలంలో డబ్బుని, తద్వారా టీటీడీ నడవడానికి ఉపయోగపడుతున్నాయి. భక్తుల మొక్కులు తీరుతున్నాయి. అలాగే కాన్సర్ పేషెంట్ లకు విగ్గులుగా పనికొస్తున్నాయి.

మరి బైబిల్లో తల వెంట్రుకలు ఎవరికీ పనికిరాకుండా పోతున్నాయి. కాలి బూడిద అవుతున్నాయి. యెహోవాకు పొగ మాత్రమే దక్కుతుంది.

ఏది సహేతుకం అనిపిస్తుంది మీకు? కృపారావు గారు !

మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనే భావిస్తున్నాను.

నాజీరు అంటే ఎవరు? అతని తలవెంట్రుకల కథేమిటి?

తెలియాలంటే ఈ పోస్ట్ చూడండి.

https://www.facebook.com/106914574790243/posts/258394592975573/

ఇప్పుడు ఆఖరి మాట,

బైబిల్లో భక్తుడు కత్తిరించుకున్న జుట్టుని యెహోవాకి వేసే సమాధానబలి హోమ ద్రవ్యము కిందున్న అగ్నిలో వేసి కాలుస్తారు. ఆ పొగని యెహోవా ఏం చేసుకుంటాడు? ఇంపైన సువాసన కదా అని ఆఘ్రానిస్తాడా! కృపారావు గారే చెప్పాలి.

ఇతర గ్రంధాలను వక్రీకరించడానికి కేటాయించిన సమయాన్ని బైబిల్ చదవడానికి కేటాయించి ఉంటే ఇలాంటి సెల్ఫ్ గోల్స్ పడేవి కాదు కదా! కృపారావు గారు!

ఏమంటారు..?

1 thought on “సెల్ఫ్ గోల్ వేసుకున్న కృపారావు గారు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *