Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

దావీదు చేసిన తప్పు:

అన్యురాలిని పెళ్లాడిన దావీదు

నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? #హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? (2 సమూయేలు 12:9)

యెహోవా పెట్టిన నియమం:

నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. (ద్వితీయోపదేశకాండము 7:3-4)

Do not intermarry with them. Do not give your daughters to their sons or take their daughters for your sons, for they will turn your sons away from following me to serve other gods, and the LORD-s anger will burn against you and will quickly destroy you. (Deuteronomy 7:3-4)

యెహోవా వేసిన శిక్ష??

“నీవు నన్ను లక్ష్యము చేయక #హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.” (2 సమూయేలు 12:10)
దావీదు కొడుకుని చంపేసిన యెహోవా, దావీదు భార్యను రేప్ చేయించిన యెహోవా
యెహోవా దావీదు పిల్లాడిని మొత్తాడు. ( struck )
యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. (2 సమూయేలు 12:16)
After Nathan had gone home, the LORD struck the child that Uriah-s wife had borne to David, and he became ill. (2 samuel 12:16)
వారం రోజులు బతికిన ఆ పసిబిడ్డ మరణించాడు
ఏడవ దినమున బిడ్డ చావగాబిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను. (2 సమూయేలు 12:18)
David’s son rapes David’s concubines
అహీతో పెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి యుంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. (2 సమూయేలు 16:21)
కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు

తన తండ్రి ఉపపత్నులను కూడెను. (2 సమూయేలు 16:22)

ఇక్కడ యెహోవా సాధించినదేమిటి? తప్పు చేసిన దావీదు బతికే ఉన్నాడు. మొగుడు ఉండగా ఇంకొకడితో శృంగారం చేసిన బత్షేబా బ్రతికే ఉంది. పసిబిడ్డ చంపబడ్డాడు. ఏ తప్పు చేయని దావీదు భార్యలు/ఉపపత్నులు రేప్ అనే శిక్ష అనుభవించారు. ఇదెక్కడి న్యాయం? ఆలోచించండి. మీ అభిప్రాయం తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *