
బానిసత్వాన్ని యెహోవా ప్రోత్సహించాడా?
బానిసత్వాన్ని యెహోవా/మోసే ఎందుకు నిషేదించలేదు.
ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తేనే మనకు బైబిల్లోని బానిసత్వం గురించి అర్ధం అవుతుంది.
10 ఆజ్ఞల్లో బానిసత్వం
యెహోవా మోసే ద్వారా ఇజ్రాయెల్ వారికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో బానిసత్వం చోటు సంపాదించుకుంది.
10 ఆజ్ఞల్లో తనను తిట్టిన వాడిని చంపేయండి అని రాసుకున్న యెహోవా, పరిశుద్ధ దినం అనే నియమాన్ని మీరితే చంపేయండి అని రాసుకున్న యెహోవా బానిసత్వం చేసినా,చేయించినా తప్పు అని రాయించకపోవడం ఒక వింత.
పైగా బానిసలను(దాసీ/దాసులను) యజమాని సొత్తుగా భావించి వాటిని ఆశించడం ఇతరుల తప్పు అని రాశాడు.
నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. (నిర్గమకాండము 20:17)
“You shall not covet your neighbour-s house. You shall not covet your neighbour-s wife, or his manservant or maidservant, his ox or donkey, or anything that belongs to your neighbour.” (Exodus 20:17)
పొరుగువాని అనగా ఇజ్రాయెల్ వాడి సొత్తులో దేనినీ మీరు ఆశించకూడదు అని చెప్పిన యెహోవా ఆ లిస్ట్ లో బానిసలను కూడా చేర్చాడు. యజమాని ఇంటి జంతువులు, వస్తువులు, భార్య పిల్లలతో పాటు యజమాని ఇంటి బానిసలను కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.
దీనిని బలపరుస్తూ యజమాని తన ఇంట ఉన్న బానిసలను కొట్టవచ్చు వాడు యజమాని సొత్తే (సొమ్మే ) కదా అనే వచనాలు కూడా బైబిల్లో ఉన్నాయి .
ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా. (నిర్గమకాండము 21:20-21)
“If a man beats his male or female slave with a rod and the slave dies as a direct result, he must be punished, but he is not to be punished if the slave gets up after a day or two, since the slave is #his #property. (Exodus 21:20-21)
కాబట్టి బానిసత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నా కూడా యెహోవా /మోసే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఇది ఒక వింత.
ఇజ్రాయెల్ వారిని బానిసత్వం నుండి విడిపించినట్టు చెప్పుకునే మోసే బానిసత్వం ఎలా చెయ్యాలో ఇజ్రాయెల్ వారికి బోధించడం మరో వింత.
అలాగే బానిసలను ఎలా కొనాలి అనే నియమాలు యెహోవా పెట్టాడు.
ఆ విషయాలు మరో పోస్ట్ లో చూద్దాం.