
బైబిల్లో బానిసత్వం దైవ సృష్టా? మానవ కల్పితమా?
ఖచ్చితంగా దైవ సృష్టే అంటున్నారు క్రైస్తవులు.
బైబిల్లోని బానిసత్వం గురించి తెలియాలంటే మీకు నోవహు కాలంలో జరిగిన ఒక ఘోరమైన సంఘటన గురించి తెలియాలి. అదే నోవహు నగ్నత్వం – కనాను పొందిన శాపం.
లాంగ్ లాంగ్ ఎగో…
నోవహు జలప్రళయం అనే ఒక భయంకరమైన విపత్తు తర్వాత. నోవహు అనే వ్యక్తి (యెహోవాకు ఇష్టమైన ప్రవక్త) ద్రాక్ష తోట వేస్తాడు. ద్రాక్ష తోట నుండి వచ్చిన పండ్లతో ద్రాక్షారసం తయారు చేసి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం వేస్తాడు. బలులు అర్పిస్తాడు. తర్వాత అదే ద్రాక్షారసం త్రాగి, మత్తుగా తూగి, ఒళ్ళు మరచి బట్టలు ఊడదీసుకుని దిగంబరిగా తోటలో పడిపోతాడు.
తండ్రి నగ్నంగా పడి ఉండటం చూసిన హాము అనే కొడుకు ఆ విషయాన్ని మిగతా సోదరులకు చెప్తాడు. వాళ్ళు తమ తండ్రిని నగ్నంగా చూడకుండా వెనుకకు నడుస్తూ వచ్చి తండ్రి దిగంబర శరీరానికి గుడ్డలు కప్పుతారు. తర్వాత మత్తు వదిలిన తండ్రి హాముకి యెహోవా నామంలో శాపం పెడతాడు. నీ కొడుకులు,అతని వంశం నీ మిగతా సోదరులకు బానిసలుగా బతుకుదురు గాక . అని.
తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు దగ్గర హాము కొడుకైన కనాను వారసులు(కనానీయులు )బానిసత్వం చేస్తారు. ఇది క్లుప్తంగా బైబిల్ చెప్పిన బానిసల కథ. రిఫరెన్స్ లు పోస్టులో పిక్ లో చూడండి.
ఇది ఎక్కడ నెరవేరింది?
ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. (యెహోషువ 17:13)
However, when the Israelites grew stronger, they subjected the Canaanites to forced labor but did not drive them out completely. (Joshua 17:13)
ఒకసారి ఈ వాక్యాలు చూడండి
ఆదికాండము 9:23
అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.
ఆదికాండము 9:24
అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని-
ఆదికాండము 9:25
కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
ఆదికాండము 9:26
మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
ఆదికాండము 9:27
దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
ఇవన్నీ కూడా బైబిల్లో నెరవేరాయి. కాబట్టి కనాను శాపం కూడా నెరవేరి కనానీయులు ఇశ్రాయేలీయులకు బానిసలు అయ్యారు.
కాబట్టి బానిసత్వం దైవ కల్పితమే తప్ప మానవ కల్పితం కాదు.
హాము అంటే వేడైన/నలుపైన అనే అర్ధాలు ఉన్నందున నల్లజాతి వాళ్ళు అంతా హాము వారసులు అని మరో వాదన ఉంది. కాబట్టి నల్లోళ్ళను బానిసలుగా చెయ్యడం కూడా దేవుడి దయే అంటారు మరి కొందరు.
ఆ విషయాలు మరో పోస్టులో చూద్దాం.