Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

బైబిల్లో బానిసత్వం రుజువులు

బైబిల్లో బానిసత్వం రుజువులు

బైబిల్లో బానిసత్వం with proofs slavery in the bible

బానిసత్వ వ్యతిరేక ఉద్యమనేత Nelson Mandela International Day (18 July ) Special post.

ఒకప్పుడు ఆఫ్రికా దేశాల్లో బానిసత్వం ప్రభలంగా ఉండేది. దానికి కారణం అక్కడి ప్రజల అమాయకత్వం. తెల్ల వాళ్లు తమ కంటే గొప్ప వాళ్లు అన్న భావన, క్రైస్తవం విస్తరించడం ,అవిద్య ఇవన్నీ కారణం.

Nelson Mandela లాంటి నాయకుల పోరాటం వలన ఇప్పుడు బానిసత్వం నిషేధహించబడి ఆఫ్రికాలో కొంత ప్రశాంతత చేకూరింది.

బానిసత్వం బలంగా ఉండేందుకు నాటి నాయకులు బైబిల్ వచనాలను ఆయుధాలుగా చేసుకుని, దేవుని పేరిట అనేక దుర్మార్గాలు చేశారు. ఎందరినో చంపారు.

దానికి కారణం బైబిల్ దేవుడు. స్వయంగా దేవుడే బానిసత్వాన్ని ప్రోత్సహించినప్పుడు వాళ్లు చేసేది మాత్రం ఏముంటుంది?

పాత నిబంధనలో బానిసత్వం:

1. మీరు బానిసలను కొనవచ్చును అంటున్న యెహోవా.

మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును.(లేవీయకాండము 25:44)

2. తన గుళ్లో అర్చకులు కూడా బానిసల్ని కొనుక్కోవచ్చును అంటున్న యెహోవా.

అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.(లేవీయకాండము 22:11).

3. ఆడవాళ్ళని బానిసలుగా తమ తండ్రులే అమ్మేయవచ్చు. కానీ ఆ ఆడవాళ్లు పారిపోకూడదు.

ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.(నిర్గమకాండము 21:7).

కొత్త నిబంధనలో బానిసత్వం

1. బానిసలారా భయపడండి.

దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి.(ఎఫెసీయులకు 6:5)

Slaves, obey your earthly masters with respect and fear, and with sincerity of heart, just as you would obey Christ.(Ephesians 6:5)

2. యేసుకి చెడ్డ పేరు రాకూడదు అంటే బానిసలు అందరూ యజమానులకి విధేయులై వుండాలి.

దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను.(1 తిమోతికి 6:1)

All who are under the yoke of slavery should consider their masters worthy of full respect, so that God-s name and our teaching may not be slandered.(1 Timothy 6:1).

3. బానిసలు తమ యజమానులకి ఎదురు మాట చెప్ప కూడదు. ఎందుకు అంటే యజమాని యేసుతో సమానం.

దాసులైనవారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంక రించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక,

ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.(తీతుకు 2:9-10)

Teach slaves to be subject to their masters in everything, to try to please them, not to talk back to them,and not to steal from them, but to show that they can be fully trusted, so that in every way they will make the teaching about God our Saviour attractive. (Titus 2:9-10).

బానిసలపై బైబిల్ దేవుడి వివక్ష

1. బానిసలు యజమాని సొత్తు. వాళ్లని చావగొట్టినా శిక్ష ఉండదు.

మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.(లేవీయకాండము 25:45).

బానిసలని చావగొట్టినా వాడు చావకపోతే యజమానికి శిక్ష ఉండదు. ఎందుకు అంటే బానిసలు యజమాని యొక్క సొమ్ము( ఆస్తి ).

ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.(నిర్గమకాండము 21:20-21)

“If a man beats his male or female slave with a rod and the slave dies as a direct result, he must be punished, but he is not to be punished if the slave gets up after a day or two, since the slave is his property.(Exodus 21:20)

2. ఒక ఎద్దు ఒక బానిసని చంపితే ధనం చెల్లెస్తే సరిపోతుంది.కానీ స్వతంత్రున్ని చంపితే మరణ శిక్ష.

ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను. (నిర్గమకాండము 21:32).

నిర్గమకాండము 21:29

ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను.

3. సాధారణ స్త్రీ ని రేప్ చేస్తే మరణ శిక్ష, బానిస స్త్రీని రేప్ చేస్తే పొట్టేలు బలి.

ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.

అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.(లేవీయకాండము 19:20-22)

బానిసత్వం గురించి యెహోవా చాలా క్లియర్ గా ఉన్నాడు.

ఇజ్రాయెల్ వాళ్లని తప్ప అందరినీ బానిసలుగా చేయవచ్చు . అమ్మవచ్చు.

నీయొద్ద నివసించు నీ సహోదరుడు(ఇజ్రాయెల్ వాడు ) బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు.(లేవీయకాండము 25:39)

“`If one of your countrymen becomes poor among you and sells himself to you, do not make him work as a slave.(Leviticus 25:39).

ఈ వచనాలు జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇలాంటి ఘోరమైన వాక్యాలు బైబిల్ నిండా ఉన్నాయి.

యేసు స్టేట్మెంట్:

మత్తయి 5:17

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.

బానిసత్వాన్ని ప్రోత్సహించే క్రైస్తవం వలన ఎప్పటికి అయినా మళ్లీ ప్రమాదం పొంచి ఉందని అందరూ గమనించాలి.

బానిసత్వ వ్యతిరేకులు అందరికీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *