
జీతం తీసుకునే దాసుడు Vs కొనబడిన బానిస
బైబిల్లో వెట్టి చాకిరీ చేసే బానిసలతో పాటు జీతం కోసం పనిచేసే దాసులు కూడా ఉంటారు. వీరికి ఎప్పటికప్పుడు జీతాలు అందుతాయి. ఇజ్రాయెల్ వారిని బానిసలుగా కొన్నప్పుడు ఇజ్రాయెల్ వాడైన యజమాని తన తోటి ఇజ్రాయెల్ వాడిని జీతం తీసుకునే దాసుడిలాగా చూడాలి తప్ప బానిస లాగా చూడవద్దు అన్న విషయం ఇంతక ముందే చర్చించాం కదా!
బైబిల్లో “బానిస” కోసం abed అనే హీబ్రూ పదం వాడగా జీతగాడి కోసం שָׂכִ֔יר (śā-ḵîr,) అనే హీబ్రూ పదం వాడబడింది.
ఇప్పుడు ఈ జీతం తీసుకునే దాసుల గురుంచి తెలుసుకుందాం.
- జీతం డబ్బులు ఏనాటి కూలి ఆనాడే ఇచ్చేయాలి
నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామము లలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను. (ద్వితీయోపదేశకాండము 24:14)
Do not take advantage of a hired man who is poor and needy, whether he is a brother Israelite or an alien living in one of your towns. (Deuteronomy 24:14)
నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు; (లేవీయకాండము 19:13)
“Do not defraud your neighbour or rob him. "
Do not hold back the wages of a hired man overnight. (Leviticus 19:13)
- తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. (మలాకీ 3:5)
So I will come near to you for judgment. I will be quick to testify against sorcerers, adulterers and perjurers, against those who defraud labourers of their wages, who oppress the widows and the fatherless, and deprive aliens of justice, but do not fear me,” says the LORD Almighty (Malachi 3:5)
కాబట్టి జీతగాళ్లకు ఎప్పటికప్పుడు జీతం/రోజు కూలీ అందుతాయి అని అర్ధం అవుతోంది. కానీ వీరికి (జీతగాళ్లకు), బానిసలకు చాలా తేడా ఉంది.
ఈ జీతగాళ్లతో పోలిస్తే బానిసలు అదే బైబిల్ భాషలో దాసులు యజమానికి ఎంతో ఉపయోగపడేవారు.
జీతగాడైన దాసుడితో పోలిస్తే ఒక బానిస వలన 6 ఏళ్లలో యజమానికి రెండు రేట్లు లాభం.
వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొన కూడదు. ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీత ముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. (ద్వితీయోపదేశకాండము 15:18)
“You must not consider it a hardship when you release your servants. Remember that for six years they have given you services worth double the wages of hired workers, and the LORD your God will bless you in all you do. (Deuteronomy 15:18)
జీతగాడు జీతం డబ్బుల కోసం ఎదురుచూసినట్టే బానిస తన బానిసత్వం ముగిసిపోయే 7 వ సంవత్సరం వరకూ ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరాన్ని లెక్కపెట్టుకుంటూ కాలం గడుపుతారు.
బానిసలకు జీతాలు ఇవ్వరు. తిండి మాత్రమే పెడతారు. 6 ఏళ్లపాటు వెట్టి చాకిరీ చేయించుకుంటారు. కొందరిని శాశ్వతంగా (permanent గా) బానిసలని చేసుకుంటారు.
మీ తరు వాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు. (లేవీయకాండము 25:46)
కానీ జీతగాడు ఎప్పటికీ temporary యే. ఎందుకు అంటే జీతగాడికి ఏ రోజుకూలీ ఆరోజే ఇచ్చి పంపేస్తారు.
ఈ క్రింది వచనంలో అశాశ్వతమైన మానవ జీవితాన్ని రోజుకూలితో పోల్చారు. అంటే రోజుకూలీ చేసేవాడు ఎలాగో మానవ జీవితం కూడా అలానే అని. అంటే hired servant (జీతగాడైన సేవకుడు) కూడా temporary నే. చెవికి బొక్క పెట్టుకున్న బానిస లాగా మీ దగ్గర శాశ్వతంగా ఉండడు అని.
భూమిమీద నరుల కాలము యుద్ధ కాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా? (యోబు 7:1)
“Does not man have hard service on earth? Are not his days like those of a hired man? (Job 7:1)
కాబట్టి దాసుడు అని కిరాయికి పనిచేసే జీతగాడు అనే వాదనకు ఇక అవకాశం లేకుండా పోయింది. బైబిల్లో బానిసత్వం ఉంది అని నిరూపణ అయ్యింది.