
బానిసలకు బడితపూజ మంచిదే అంటాడు ఒకసారి, అందరూ సమానం అంటాడు మరోసారి.
సమానత్వం అంటే అర్ధం తెలియనప్పుడు ఆ పదాన్ని వాడకపోవడమే మంచిది. అనవసరంగా వాడి అభాసుపాలు కావడం ఎందుకు?
మా దేవుడు మనుషులందరినీ సమానంగా చూస్తాడు అని చెప్పుకోవడం తప్పు కాదు. అందుకు విరుద్ధమైన వాక్యాలు ఎవరైనా బైబిల్ నుండి చూపిస్తే వారిని ఒప్పించగలగాలి కూడా !
దేవుడు అందరిని సమానంగా చూస్తాడా ??
ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. (గలతియులకు 3:28)
There is neither Jew nor Greek, slave nor free, male nor female, for you are all one in Christ Jesus.(Galatians 3:28)
దేవుని దృష్టిలో అందరూ సమానం. యుధులైనా, గ్రీకులైనా, బానిసలైనా, స్వతంత్రులైనా ఆయన దృష్టిలో ఒకటే.
బాగుంది. చాలా బాగుంది.
సరే నిజంగానే బైబిల్ దేవుడు అందరినీ సమానంగా చూశాడా?
- యజమాని vs బానిస
ఒకడు తన #దాసుడైనను తన #దాసియైనను #చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, #వాడు అతని #సొమ్మేగదా. (నిర్గమకాండము 21:20)
If a man beats his #male or #female #slave with a rod and the #slave #dies as a direct result, he must be punished, but he is not to be punished if the #slave gets up after a day or two, since the #slave is his #property. (Exodus 21:20-21)
ఇక్కడ బానిసలని యజమానులు చావగొట్టినా శిక్ష లేదు అంటున్నాడు దేవుడు. బానిసలు యజమానులు సొమ్ము (property) అంటున్నాడు. ఇంకా యజమాని -బానిస సమానం అని వాదిద్దామా ?
- ఇజ్రాయేలీయుడు vs అన్యుడు
మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు #ఇట్టివారిని #స్వతంత్రించుకొనవచ్చును; వారు #శాశ్వతముగా మీకు #దాసులగుదురు కాని, #ఇశ్రాయేలీయులైన మీరు #సహోదరులు గనుక ఒకని చేత ఒకడు #కఠినసేవ చేయించు కొనకూడదు.(లేవీయకాండము 25:46)
You can will them to your children as #inherited #property and #can #make them #slaves for #life, but you must not rule over your #fellow #Israelites #ruthlessly. (Leviticus 25:46)
బానిసలని property గా (సొమ్ముగా ) భావించాలి కానీ వారిలో ఇజ్రాయేలీ బానిసలకు కఠినమైన పనులు చెప్పకూడదు. ఎందుకు అంటే వారు మీ సహోదరులు .
ఇతర జాతి బానిసలను చావగొట్టేయొచ్చు. ఎందుకు అంటే వారు మీ సొమ్ము !
ఇంకా యూదులు, అన్యులు (గ్రీకులు) దేవుని దృష్టిలో సమానమే అని వాదిద్దామా?
- ఆడ vs మగ
ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసులైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు. (నిర్గమకాండము 21:7)
“If a man #sells his #daughter as a #slave, she is not to go free as male slaves do. (Exodus 21:7)
మగ బానిసలు పారిపోయినట్టు ఆడ బానిసలు పారిపోకూడదు అని దేవుడు హుకుం జారీ చేస్తున్నాడు. మగాళ్లకు ఉన్న ఆప్షన్ స్త్రీలకు లేదా? ఇంకా దేవుని దృష్టిలో ఆడ మగ సమానం అని వాదిద్దామా?
అసలు బానిసత్వమే తప్పు. దాన్ని దేవుడు సమర్ధించడం, ఒక్కో వర్గానికి ఒక్కో బానిసత్వ నియమం పెట్టడం, బానిసలను ఆస్తి లాగా చూడటం, కొట్టినా తప్పు లేదు అనడం బైబిల్లోనే రాయబడి ఉంది. ఇక సమానత్వం అనే వాదన సహేతుకమైనదేనా?
ఇదేనా సమానత్వం? బైబిల్ దేవుడు అందరినీ సమానంగా చూశాడా ?
నా పోస్టులపై ఒక అభిప్రాయానికి వచ్చే ముందు బైబిల్ తెరిచి ఈ వాక్యాలను చదవండి.
మీ రమణ నేషనలిస్ట్
నా పోస్ట్ నచ్చితే షేర్ చేయండి. లైక్ చేయండి. సేవ్ చేసుకోండి. నలుగురితో పంచుకోండి.