Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బానిసలు మీ ఆస్తి

బానిసలని ఆస్తిగా భావించాలని స్వయంగా దేవుడే చెప్పడం ఒక వింత. ఒక సామజిక రుగ్మతని సృష్టికర్తే ప్రోత్సాహించడం సగటు మనిషి జీర్ణించుకోలేని విషయం.

ఆస్తి అంటే ఏమిటి?

తల్లి తండ్రులు కష్టించి, శ్రమించి సంపాదించిన దాన్ని పిల్లలు ఆస్తిగా భావిస్తారు. దానిని అనుభవించడానికి వారికి అధికారం ఉంటుంది. అమ్ముకోవడానికి అధికారం ఉంటుంది. కానీ దానిని నాశనం చేయడానికి వారికి అధికారం ఉండదు.

బైబిల్ ప్రకారం బానిసలు( స్త్రీ లు /పురుషులు ) ఒక ఆస్తిగా భావించబడే వారు. ఆ బానిసలు అనే ఆస్తిని ఎలా అమ్ముకోవాలో, కొనుక్కోవాలో దేవుడు వారికి కొన్ని నియమాలు పెట్టాడు. అవి ఎమిటో ఇప్పుడు చూద్దాము.

  1. బానిసలను కొనవచ్చును

మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు. (లేవీయకాండము 25:44-45)

ఇక్కడ బానిసలను కొనుక్కో వచ్చును అని, వారు మీకు వారసత్వ సంపద గా ఉంటారని దేవుడు చెప్తున్నాడు.

మీ తరు వాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు. (లేవీయకాండము 25:46)

అయితే ఇశ్రాయేలు నుండి కొనబడిన దాసులని కష్టపెట్టవద్దు అని దేవుడు వారికి చెప్తున్నాడు.

2. బానిసలు ఎక్కడ దొరుకుతారు?

ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు. (నిర్గమకాండము 21:7)

ఎందుకు? ఆమె తన తండ్రి ఆస్తి. అతను వేరొకడికి తన ఆస్తిని అమ్మేశాడు. కాబట్టి ఆడది అక్కడ బానిసలాగా పడి వుండాలి.

అన్నదమ్ములని కూడా బానిసలుగా భావించవచ్చు.

కాకపోతే ట్రీట్మెంట్ violent గా ఉండకూడదు.

నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు. (లేవీయకాండము 25:39)వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. (లేవీయకాండము 25:40)

బాగుంది.

3. ఒకవేళ ఆ బానిస పరాయి వాడు అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి?

ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా. (నిర్గమకాండము 21:20-21)

బానిసలని కొట్టండి. వాళ్ళు మీ ఆస్తే కదా. వాళ్లని చంపకండి. (మీ పిల్లల ఆస్తి కదా?)

ఇలాంటి యజమాని ఉన్న బానిస ఎలా ప్రవర్తించాలి?

దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి. (ఎఫెసీయులకు 6:5)

పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి. (1 పేతురు 2:18)

చూశారుగా తమ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని బానిస పురుషులని స్త్రీలని హింసించే యజమానులను యేసు క్రీస్తుతో సమానంగా భావించాలి అంటోంది బైబిల్.

ఏం చేద్దాం చెప్పండి.

దేవుడు బానిసత్వాన్ని ప్రోత్సహించవచ్చునా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *