Snake phobia in Bible పాముల గురించి బైబిల్ చెప్పే మాతాల్లో నిజమెంత?

స్నేక్ ఫోబియా అంటే ఏమిటి?

పాములు తమను ఏదో చేస్తాయేమో అనే భయంతో చస్తూ బతికే స్థితి / పాముల భయం.

ఇది బైబిల్ రచయితలకి విపరీతంగా ఉందని బైబిల్ చదివిన ఎవరికైనా తెలుస్తుంది.

పాముల గురించి బైబిల్ ఏం చెప్తుందో, అందులో నిజానిజాలు ఏమిటో చూద్దాము.

  1. పాములు అన్ని భూ జంతువులలో తెలివైనవి.

దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. (ఆదికాండము 3:1)

  1. పనులు మనుషులకి శత్రువులు.

మరియు నీకును(పాముకి) స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. (ఆదికాండము 3:15)

  1. పాములు మన్ను తింటాయి.

అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు. (ఆదికాండము 3:14)

  1. పాములు వివేకం కలిగినవి. వాటిలాగా క్రైస్తవులు వివేకం తెచ్చుకోవాలి.

ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. (మత్తయి 10:16)

  1. క్రైస్తవులు పాము విషం తాగినా చావరు.

పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. (మార్కు 16:18)

  1. పాములు యెహోవా వాడే మారణాయుధాలు

అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.(సంఖ్యాకాండము 21:6)

  1. మోసే పాముని పైకి లేపాడు. మీరు ఏసు ని లేపండి

అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. (యోహాను 3:14-15)

ఇప్పుడు కౌంటర్లు చూద్దాము.

  1. సైన్స్ ప్రకారం పాములు అన్నీ భూ జంతువుల కంటే తెలివైనవి కాదు.

https://www.thegreatprojects.com/blog/5-most-intelligent-animals

అన్నిటి కంటే తెలివైన 5 జంతువుల లిస్ట్ లో పాము ప్రస్తావనే లేదు.

  1. పాములు మన్ను తినవు.

పాములు మన్ను తినవు. ఎలుకలని, కప్పలని తింటాయి. చిన్న చిన్న పక్షుల్ని, వాటి గుడ్లని తింటాయి.

  1. పాములు మనుషుల శత్రువులు కాదు. పాములని ప్రేమించేవాళ్ళు కాపాడేవాళ్లు కూడా ఉన్నారుగా.

ఉదాహరణకు మన తెలుగు సినిమా నటుడు సాయికిరణ్ పాముల సంరక్షణ లో పేరు గడించారు.

ఈ సంస్థ పాములకి మిత్రులం అంటోంది.

  1. క్రైస్తవులు పాము విషం తాగితే చస్తారు. ఇప్పటిదాకా పాము విషం తాగి బ్రతికిన క్రైస్తవులు లేరు.

https://www.google.com/amp/s/www.pulse.ng/gist/stupidity-5-church-members-die-after-pastor-made-them-drink-rat-poison/m4zp0yv.amp

పాస్టర్ గారి మాయ మాటలు విని విషం తాగి చనిపోయిన క్రైస్తవులు. ఇక పాము విషం సంగతి వేరే చెప్పాలా?

  1. పాముల దగ్గర మనుషులు వివేకం నేర్చుకోవాలా?

ఇది కూడా అబద్దం. పాములు అసలు తెలివైనవే కాదు. బహుశా రోజు పాముల గురుంచి ఆలోచించి చివరికి పాములని హీరో లు చేసే స్థాయికి క్రైస్తవ రచయితలు వచ్చేసారు.

  1. మోసే సర్పాన్ని పైకి లేపినట్టు మీరు యేసుని లేపండి.

ఏసు సైతాను ఒక్కటే అనే వాదనకి బలం చేకూర్చే మరో వచనం. ఇది

  1. పాములతో మనుషుల్ని కరిపించి చంపించిన యెహోవా.

యెహోవా సైతాను ని పాము అంటాడు. మళ్ళీ పాముల తోనే మనుషులని చంపిస్తాడు. పాములకి యెహోవా అంటే ఇష్టమా? యెహోవా కి పాములంటే ఇష్టమా? మొత్తానికి పాములు యెహోవా పంపిన మారణాయుధాలు.

Final words :

ఎక్కడ అయినా కనిపిస్తే పాములని చంపకండి. అవి పొలం లో ఉండే ఎలకల్ని కప్పల్ని చంపి రైతుకి ఎంతో సహాయం చేస్తాయి. అంతగా భయంగా ఉంటే దగ్గర లోని forest డిపార్ట్మెంట్ వాళ్లకి ఫోన్ చేసి రక్షించమని చెప్పండి.

Save wild life.. Save Snakes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *