
Snakes Don't Eat Dust
దీన్ని అబద్దం అనాలో, అజ్ఞానం అనాలో తెలియదు కానీ.. బైబిల్ నిండా ఇలాంటివి ఎన్ని కనిపిస్తాయి. అయితే ఈరోజు పాముల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం.
1. పాములు మన్ను తింటాయి.
అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటి లోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు. (ఆదికాండము 3:14).
Note : భూజంతువులన్నిటిలోనూ పాముని శపించాడు యెహోవా కాబట్టి అది మన్ను తింటుంది.
Fact : పాములు మన్ను తినవు. ఎలుకలు, కప్పలు మొదలైన జంతువుల్ని తింటాయి. కాని మన్ను తినవు.
2. పాములు అన్ని జంతువుల లోనూ తెలివైనది.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.(ఆదికాండము 3:1).
ఇది కూడా పచ్చి అబద్దం. భూమి అన్ని జంతువులలో పాము తెలియవైనది కాదు. డాల్ఫిన్లు, చింపాంజీలు, పందులు, కుక్కలు, మరియు చిలకలు తెలివైన జంతువుల్లో మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి.
అంటే బైబిల్ చెప్పింది తప్పని తేలిపోయింది కదా!.
3. పాములు స్త్రీలకి, మానవులకి శత్రువులు. మానవులు పాములకి శత్రువులు.
మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.(ఆదికాండము 3:15).
నిజానికి స్త్రీలు పాములని పూజిస్తారు. శత్రువుగా కూడా చూడరు. అలాగే చాలా మంది మనుషులు పాములని కాపాడి అడవుల్లో వదిలిపెడుతూ ఉంటారు. వాటిని కాపాడేందుకు చాలా చట్టాలని కూడా చేశారు నేటి మానవులు.
4. పాములు అంటే సైతాను. ఇది కూడా తప్పే!
అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.(సంఖ్యాకాండము 21:6)
చాలా మంది క్రైస్తవులు పాములని సైతాను అనుకుంటారు. కాని యెహోవా పాములని ఇశ్రాయేలు ప్రజలని పాములతో కరిపించాడు. ఆ పాములని యెహోవాయే పంపించాడు కాబట్టి అవి సైతాను అయ్యే అవకాశం లేదు కదా!
పైగా సైతాను పాము ఒక్కటే అయితే సైతాను మన్ను తింటోందా ఇప్పుడు? అలా బైబిల్ లో ఎక్కడా రాయలేదు.
నిజానికి హవ్వ ఆదాము కథలో చెప్ప బడిన పాము సైతాను కాదు. అది పాము మాత్రమే. ఆ కథలో పాము అనేది సాధారణమైన పాముగానే వర్ణించబడింది.
Now the serpent was more cunning than any beast of the field which the LORD God had made. And he said to the woman, “Has God indeed said, ‘You shall not eat of every tree of the garden’?”
అక్కడ comparision మిగతా భూ జంతువులతో చేస్తున్నాడు. అంటే ఇది కూడా ఒకటి జంతువు. అంటే సాధారణ పాము. అన్నీ పాములు తెలివైనవి అని కితాబు ఇస్తున్నాడు యెహోవా. కానీ తరువాత ఈ పాము సైతాను అనే పేరు పెట్టబడి, విలన్ పాత్రగా రూపాంతరం చెందింది.
అయితే పాము చేసిన తప్పులకి మనుషులకి శిక్ష వేస్తాడు యెహోవా. ఒకవేళ పాముతో పాటు మానవులు కూడా తప్పు చేస్తే మనుషులలాగే పాములకి కూడా శిక్ష వేయొచ్చు. యెహోవా మన్ను తినమని పాముకి శిక్ష వేశాడు కదా అంటారా?
పైగా యెహోవా పాముకి వేసిన శిక్షని యే పామూ పట్టించుకోవడం లేదు. మన్ను తినడం మానేసి ఎలుకల్ని, కప్పల్ని తింటూ హ్యాపీ గా ఉన్నాయి. కానీ హవ్వ చేసిన తప్పుకి ప్రతి స్త్రీ గర్భం వేదనని అనుభవించి పిల్లల్ని కంటోంది.