అపరిచితుడుగా మారిన యేసు(ఒక్కప్పటి యెహోవా)!
అపరిచితుడు స్టోరీ line :
అపరిచితుడు సినిమాలో విక్రమ్ ద్విపాత్ర అభినయంతో అందరినీ అలరించాడు. Split personality అంటే ఎలా ఉంటుందో అందరికి అర్ధం అయ్యేలా చేశాడు విక్రమ్.
అపరిచితుడు పాత్రకి చాలా కోపం. సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే సహించలేక చంపేస్తూ ఉంటాడు. మళ్ళీ మరుసటి రోజు ఏమీ తెలియని అమాయక రాము లాగా మారిపోతూ ఉంటాడు. అంతక ముందు చేసిన హత్యలు అన్నీ మర్చిపోతూ ఉంటాడు.
బైబిల్లో అచ్చం ఇదే స్టోరీ line వుంటుంది.
యెహోవాగా ఉన్నప్పుడు కోపం అందరినీ చంపేసిన యెహోవా, యేసుగా వచ్చినప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోయి అమాయకపు ముఖం పెడతాడు.
యెహోవాగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలని యేసుగా వచ్చి తానే ఖండిస్తూ ఉంటాడు. కానీ ఎవరైనా అడిగితే మాత్రం నేను నా తండ్రి ఒక్కటే అంటాడు.
నేనూ, నా తండ్రియు ఒక్కటే.( యోహాను 10:30)
కానీ యెహోవాగా ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరుకి, యేసుగా ఉన్నప్పుడు ప్రవర్తించుకి అస్సలు పోలిక ఉండదు.
ఉదాహరణ :
విశ్రాంతి దినం రోజున పనిచెయ్యరాదని నియమం పెడతాడు యెహోవా. ఆ మాటని అందరూ విని తీరాలని, అలా వినని వాళ్ళని రాళ్లతో కొట్టించి చంపేయమంటాడు యెహోవా. చెప్పడమే కాదు ఒకడిని దగ్గర ఉండి మరీ చంపిస్తాడు యెహోవా.
యెహోవా పెట్టిన నియమం:
కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.(నిర్గమకాండము 31:14)
యెహోవా చంపించిన మనిషి :
ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.
తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. ( సంఖ్యాకాండం 15:32 నుండి 15:36)
యెహోవా చెప్పిన మాటలకి వ్యతిరేకంగా పనిచేయడమే కాదు, యెహోవా చెప్పిన మాటలని తప్పు పట్టిన యేసు.
దాంతో యెహోవా అనుచరులు యేసుని చంపాలని చూస్తారు. హింసిస్తారు.
యేసు చెప్పిన యెహోవా వ్యతిరేక మాటలు:
మరియు విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు.(మార్కు 2:27)
యేసు చేసిన యెహోవా వ్యతిరేక పనులు:
ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. (యోహాను 5:16)
యేసు ని యూదులు సిలువ వేసి చంపడానికి ఇది కూడా ఒక కారణం.
పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. (మార్కు 3:6)
ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి.
- ఒకవేళ నిజంగానే యేసు యెహోవా ఒక్కడే అయితే గతంలో చెప్పిన మాటలు నాటి యెహోవా, అదే నేటి యేసు మరచిపోయాడా? ( అపరిచితుడు సినిమాలో కూడా ఇంతే కదా )
- యెహోవాగా ఉన్నప్పుడు విశ్రాంతి దినం రోజున పని చేస్తున్నాడని మనిషిని చంపించిన యెహోవా, యేసుగా వచ్చినప్పుడు అదే తప్పు ఎందుకు చేశాడు? యూదులకి ఆ నియమాన్ని ఎలా పాటించాలో చెప్పిన యెహోవా / యేసు వాళ్ళ చేతిలో చంపబడటానికి కూడా అదే నేరం చేశాడు ( అపరిచితుడు లాగా హత్యలు చేయడం, ప్రకాష్ రాజ్ కి మళ్ళీ అమాయకంగా గరుడ పురాణం వివరించడం )
- యెహోవా, యేసు ఒక్కటే అయితే విశ్రాంతి దినం ఒప్పు అని ఒకసారి, తప్పు అని ఒకసారి ఎందుకు చెప్పాడు? మనుషుల కంటే విశ్రాంతి దినం ఎక్కువ కాదు అన్న యేసు, యెహోవాగా ఉన్నప్పుడు అదే విశ్రాంతి దినం కోసం ఒక మనిషిని ఎందుకు చంపాడు?
ఫైనల్ గా ఈ వచనం చూడండి.
- యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.(హెబ్రీయులకు 13:8)
యేసు నిజంగానే ఒకే రీతిగా ఉన్నాడా? మరి విశ్రాంతి దినం గురించి మాట మార్చింది ఎవరు? ఒకప్పుడు మనిషిని చంపించింది ఎవరు?
- దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యాకాండము 23:19).
ఒకప్పుడు మనిషిని చంపించి, ఇప్పుడు మాట మార్చడం అబద్ధం కదా? అబద్దం చెప్పిన యేసు దేవుడు ఎలా అవుతాడు?
- ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.(మత్తయి 5:17)
ఇక్కడ విశ్రాంతి నియమాన్ని కొట్టేసింది ఎవరు?
యేసు అబద్దం చెప్పాడు, నియమాలు మార్చేశాడు, అబద్దం చెప్పాడు. ఇక యేసు దేవుడు ఎలా అవుతాడు?
ఒకవేళ యెహోవాగా ఉన్నప్పుడు చేసినవి మర్చిపోయి ప్రవర్తించించి ఉంటే మాత్రమే యేసు/ యెహోవా ఖచ్చితంగా అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ లాంటోడే అనుకోవాల్సి వస్తుంది.