పిల్లలు లేని స్త్రీ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చునా?

అవును.100%. పిల్లలు లేని స్త్రీని ఎంత మంది అయినా పెళ్లి చేసుకోవచ్చు. అతను మరిదైనా అయ్యుండొచ్చు. మామ అయినా అవ్వ వచ్చు. సంతానం కోసం బైబిల్లో ఎవరితో అయినా పడుకోవచ్చు. తండ్రితో కూడా ( example లోతుతో కూతుళ్లు పిల్లల్ని కన్నారు).

Tamar And Judah

యూదా అనే వాడికి తామారు అనే కోడలు ఉంటుంది. యూదాకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఏరు (Er ) చెడ్డ వాడు కాబట్టి యెహోవా అతన్ని చంపేస్తాడు (ఆదికాండం 38:7). రెండో కొడుకు ఇప్పుడు తామారుని పెళ్లాడతాడు. రెండో వాడు ఆమెతో పడుకున్నప్పుడు వీర్యాన్ని నేల పాలు చేశాడని అతన్ని కూడా యెహోవా చంపేస్తాడు.(ఆదికాండం 38:10). మూడో కొడుకు ఇంకా చిన్నవాడు. కాబట్టి అతడు పెద్దవాడు అయ్యేంత వరకు పుట్టింట్లో ఉండమని తామారుతో చెప్తాడు మామగారు.(ఆదికాండం 38:11). అలా ఉన్న కొంత కాలానికి మామ గారి భార్య చనిపోతుంది. కోడలు ముఖానికి ముసుగువేసుని మామకి గుడి దగ్గర పరిచయం అవుతుంది. బేరం మాట్లాడుకుని కోడలితో పడుకుంటాడు మామ యూదా. ఆమెకి కడుపు వస్తుంది. తన కోడలికి తన వల్లే కడుపు వచ్చిందని తెలుసుకున్న మామ గారు ఆమెను ఎంతో మెచ్చుకుంటాడు. నువ్వు నిజంగా నీతి మంతురాలివి అంటాడు.(ఆదికాండం 38:26). అలా పుట్టిన పిల్లలకి వారసుడు మన యేసు.( ప్రకటన గ్రంధం 5:5).

New Testament లో

ఒక స్త్రీకి 7 భర్తలు – యేసు చెప్పిన సమాధానం

బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను.

లూకా 20:29-32

యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవ వాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.

మోసే చెప్పినది ఏమిటి?

“సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను” ( ద్వితీయోపదేశ కాండం 25:5)

లూకా 20:34

అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.

చూశారుగా అలా చేయడం తప్పు అని యేసు వారు చెప్పనేలేదు. మోసే చెప్పింది తప్పు అని కూడా చెప్పలేదు.

Example :

ఒక స్త్రీకి 6 గురు భర్తలు – యేసు చెప్పిన మాట

నూతిలో నుండి నీళ్లు కావాలని యేసు ఒక సుమెరియన్ స్త్రీతో మాట్లాడిన సందర్బంలో..

యోహాను 4:18

నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.

ఇక్కడ కూడా యేసు ఎక్కువ మంది భర్తలు ఉండటం తప్పు అని ఖండించలేదు.

యేసు నాన్నమ్మకి ఇద్దరు భర్తలు?

యేసు తండ్రి అయిన యోసేపు తండ్రి యాకోబు అని ఒక చోట, కాదు హేలి అని ఒక చోట రాసుకున్నారు బైబిల్లో..

(మత్తయి 1:16 ప్రకారం యాలుకే , లూకా 3:23 ప్రకారం హేలి యేసు గారి తాతయ్య )

ఇది చాలా పెద్ద contradiction. ఎందుకు అంటే ఏ వ్యక్తికి ఇద్దరు తండ్రులు ఉండరు. దీనికి చక్కటి పరిష్కారం ఏమిటంటే.. యేసు నాన్నమ్మకి మొదట ఒకరితో పెళ్లి అయింది. పిల్లలు లేకుండా ఒక భర్త చనిపోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుని యేసు తండ్రి అయిన యోసేపుని కన్నది అనుకోవడం ఉత్తమ పరిస్కారం. లేకపోతే బైబిల్ కల్పితం అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే యేసు గురించి బైబిల్ రాసిన వివరాలు అన్నీ ఫేక్ అయిపోతాయి.

ఇప్పుడు చెప్పండి..

బైబిల్ ప్రకారం పిల్లలు లేని స్త్రీని ఎంత మంది మగాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చా?

బైబిల్లో సొలొమోను కి 1000 మంది పెళ్ళాలు ఉండటం మనం చూస్తాం. అలాగే దేవుడే దగ్గర ఉండి దావీదుకి చాలా మంది పెళ్లాలని కట్ట బెట్టడమూ చూస్తాం. అలాగే యూదా కథలో ఎక్కువ మంది భర్తలు ఒక స్త్రీని పెళ్లాడటానికి యెహోవాయే కారణం అవ్వడమూ చూస్తాం.
యెహోవా కూడా నాకు ఇద్దరు భార్యలు ఉండేవారు అని చెప్పిన సందర్భం కూడా చూస్తాం.

ఏమిటో.. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు బహు భర్తత్వం, బహు భార్యత్వం దేవుని దయతో వెల్లివిరిసింది అనేది కాదనలేని సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *