ఒకప్పుడు తెలుగువాళ్లంతా హిందువులే అంటున్న బ్రిటిష్ వారి 1849 తెలుగు వ్యాకరణ పుస్తకం!
అవును ఒకప్పుడు తెలుగు వాళ్లంతా హిందువులే.
బ్రిటిష్ వారి పాలనలో ఆకలితో అలమటించి, అన్నం పెట్టే వాళ్లు లేక, బ్రిటిష్ మిషనరీష్ ఇచ్చిన రైస్ బ్యాగ్ లకి ఆశపడి మతం మారినవాళ్లే.
అలా మతం మారిన వారి నుండి పుట్టిన పాస్టర్లు, ప్రచారకులు స్వాతంత్య్రం తర్వాత విదేశీ పెట్టుబడులతో స్కూల్స్, కాలేజీళ్లు, ఆసుపత్రులు, ngo లు ఒకటేమిటి సహాయం పేరుతో అనేక రూపల్లో విస్తరించి ఈ దేశంలోని పేదవారిని సేవ పేరుతో దగ్గరయ్యి మానవత్వనికి మతం రంగు పులిమి, తమ సహాయానికి బదులుగు తమ దేవుడుని ఆరారధించామని చెప్పగా,ఇక్కడి తెలుగు కృతజ్ఞతా పూర్వకంగా మతం మారారు.
ఇప్పటికీ ఇదే నడుస్తోంది. క్రైస్తవుడి నుండి సహాయం పొందాలంటే భయం! ఎక్కడ మతం మారమంటాడో అని. క్రైస్తవ స్నేహితుడు హాస్టల్ చేరడంటే భయం. ఎక్కడ రాత్రంతా క్రైస్తవ పాఠాలతో చావగొడతాడో అని. ముఖ్యంగా పేద హిందువులు క్రైస్తవ సంస్థల నుండి సహాయం పొంది మతం మారారు. మారుతున్నారు.
ఇక రెండో వైపు నుండి, మతం మారిన హిందువులకి ఇచ్చే పాస్టర్ ట్రైనింగ్. బైబిల్ లోని వాక్యాలతో పాటు ఒకప్పటి హిందువులకి హిందూ దేవుళ్లపై ఉన్న సందేహాలను మరింత పెరిగేలా అడ్డగోలు అనువాదాలని వాళ్ళకి చూపించి, మరింత అసహయించుకునేలా చేయడం. తద్వారా క్రైస్తవులుగా ఉండటమే ఉత్తమం అనే భావనలో వాళ్లని ఉంచి, మరింత మందిని క్రైస్తవంలో “ముంచే”లా చేయడం.
తెలుగు భాష – హిందూ ధర్మం
తెలుగు వాళ్లు అంతా హిందువులు. వాళ్ళ పూర్వీకుల కథలు, గ్రంధాలు, ఐతిహాసాలు, పురాణాలు, శతకాలు, నీతి కథలు, చరిత్ర అన్నీ తెలుగులో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తిరగేయ్యాలి అంటే వాళ్ళకి తెలుగు భాష అవసరం. భాష బతికుంటే వాళ్లు ఎప్పటి కైనా వాటిని చదువుతారు. అప్పుడు వారికి విషయం అర్ధం అవుతుంది. కాబట్టి ఆ భాషని చంపేయాలి. అప్పుడే క్రైస్తవం మరింత విస్తరిస్తుంది.
ఒక్కప్పుడు ఇంగ్లీష్ వాళ్లే తెలుగు వాళ్లంతా హిందువులు అని ఒప్పుకున్నారు. ఇప్పుడు కొంత మంది తెలుగు వాళ్లు మేము ఇజ్రాయెల్ గొర్రెలం, ఈ దేశపు భాషల కన్నా హెబ్రీ భాష గొప్పది అని వాదిస్తున్నారు. మా ఇంగ్లీష్ వాళ్లు కనిపెట్టిన వస్తువులు వాడకుండా బతకగలరా? ఇంగ్లీష్ వాళ్లు మన కన్నా గొప్పోళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. తాము తెలుగువాల్లం కాబట్టి గొప్పవాళ్ళం అనే భావన కానీ, ఈ దేశం గొప్పది లాంటి జాతీయభావాలు ఏవీ ఈ క్రైస్తవుల్లో కనపడటం లేదు.
ఇప్పుడు తెలుగు ప్రభుత్వాలు అసలు తెలుగు భాష అవసరమే లేదు. ఇంగ్లీష్ ఉంటే చాలు అనే స్థితికి వచ్చారు. మరికొన్ని రోజుల్లో అన్ని స్థాయిల్లోను తెలుగు ఉండదు. అప్పుడు ఎంచక్కా ఇంగ్లీష్ బైబిల్ చదువుకోవచ్చు. ఇంగ్లీష్ వాళ్లు రాసిన హిందూ వ్యతిరేక వక్రీకరణ భాష్యాలు, హిందూ వ్యతిరేక చరిత్ర పుస్తకాలు చదువుకొని మనలని మనమే అసహయించుకోవచ్చు.
భాష పోతే తెలుగువారు ఇంగ్లీష్ వాళ్లు అయిపోతారు. హిందువులు క్రైస్తవులు అవుతారు.
ఇప్పటికి అయినా తెలుగుని బతికించండి. హిందూ సంస్కృతిని బతికించండి.