రూతుని బోయాజు ఏమని పిలిచాడు? కూతురా అన్నాడా? కుమారీ అన్నాడా?
రెండిటి మధ్య తేడా ఏంటి?
పాతనిబంధనలో రూతు అనే స్త్రీది చాలా ముఖ్యమైన పాత్ర. ఈమె దావీదుకి ముత్తాత అయిన బోయజుకి భార్య. అయితే ఈమె బోయాజుకి మొదటి భార్య కాదు. ఈమె గతంలో మరో వ్యక్తి భార్య. అతను చనిపోగా బోయాజుని పెళ్లి చేసుకుంటుంది.
మొదట్లో ఈ బోయాజు రూతుని నా కూతురా.. నా కూతురా అని పిలిచేవాడు. అప్పట్లో ఆమె అతని పొలంలో పని చేసే ఒక దాసీ. అయితే కాలక్రమేణా ఈమె బోయాజుకి భార్య అవుతుంది. మొదట కూతురా అని పిలిచి తర్వాత పెళ్లి చేసుకోవడం భారతీయ సమాజం అంగీకరించదు అనుకున్నారో ఏమో.. తెలుగు బైబిల్ అనబడే పరిశుద్ధ గ్రంథంలోని రూతు ౩:10 అనే వాక్యంలో నా కూతురా అని ఉండాల్సిన చోట నా కుమారీ అని అనువాదం చేశారు.
పరిశుద్ధ గ్రంధంలో ఇప్పుడు ఇలా ఉంది:
అతడు నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని ¸యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది. (రూతు 3:10)
నిజానికి ఇలా ఉండాలి:
అతడు నా కుమార్తె/నా కూతురా, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని ¸యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది. (రూతు 3:10
నా కుమారీ అంటే నా కన్య అని అర్ధం. నా కుమార్తె అంటే నా కూతురా అని అర్ధం. ఈ విషయం బైబిల్ అనువాదకులకు తెలియదు అని నేను అనుకోను.
ఒరిజినల్ హీబ్రూ బైబిల్ అనువాదాలుఇక్కడ చూడండి.
https://biblehub.com/interlinear/ruth/3-10.htm
ఒక్కొక్క బూతుని సరి చేసుకుంటూ పరిశుద్ద గ్రంథం అనే పుస్తకాన్ని రాసుకున్నారు. అందుకే ఒరిజినల్ బైబిల్ -బూతులు =పరిశుద్ధ గ్రంథం.
మరో తప్పుడు అనువాదంతో మళ్ళీ కలుద్దాం.
Related పోస్ట్:
బైబిల్ నిజాలు బయట పెడుతున్న మీకు నా అభినందనలు