
గ్రీకులని గుళ్ళోకి తీసుకువచ్చాడని పౌలుని చితకబడిన యూదులు
సహజంగా క్రైస్తవులు చెప్పే మాట ఏముంటంటే మా దేవుడు అందరి వాడు. హిందువులు కొందరిని గుళ్ళోకి కూడా రానివ్వలేదు. ఆ మాటకి ఇక చెల్లదు.
యెహోవా అందరి వాడు కాదు. కొందరి వాడే.
యెహోవా గుళ్ళోకి ఇతరలు ప్రవేశిస్తే గుడి మైల పడుతుంది అంటున్న యూదులు.
ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. (అపో. కార్యములు 21:28)
ఇక్కడ గ్రీకులని గుళ్లోకి తీసుకువచ్చి గుడిని అపవిత్ర పరిచాడని పౌలు పై తిరగబడ్డారు యూదులు.
అంటే యెహోవా గుళ్ళోకి యూదులు మాత్రమే వెళ్ళాలి. వేరే వాళ్ళని గుళ్ళోకి కూడా రానివ్వని యెహోవా అందరికీ దేవుడు ఎలా కాగలడు?
సరే తర్వాత ఏం జరిగిందో చూడండి.
పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.(అపో. కార్యములు 21:30)
పౌలుని యెహోవా గుళ్లో నుండి బయటకి ఈడ్చు కుని వచ్చి తన్నారు. తలుపులు మూసేశారు. ఇక్కడ తన్నినట్టుగా లేదు కదా అంటున్నారా?
అయితే ఇది చూడండి.
అపో. కార్యములు 21:32
వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి.
సైనికులు వచ్చే వరకూ పౌలుని తన్నుతూనే ఉన్నారంట!
ఇంతకీ పౌలు చేసిన తప్పు ఏమిటి?
- సున్నతి ఆచారం వద్దు అని చెప్పడం.
అపో. కార్యములు 21:21
అన్య జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు.
- అన్యులని యెహోవా గుళ్ళోకి తీసుకురావడం.
అపో. కార్యములు 21:28
ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.
కాబట్టి ఇక్కడ గ్రహించ వలసిన విషయాలు
- యెహోవా యూదులకి మాత్రమే దేవుడు. వాళ్ళకి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంది. వేరే వాళ్లు గుళ్ళోకి వస్తే యెహోవా గుడి అపవిత్రం అయిపోతుంది.
- సున్నతి పాటించడం యెహోవా భక్తులకి తప్పనిసరి.
ఇప్పుడు చెప్పండి. ఆలయ ప్రవేశం కొందరికే కల్పించిన యెహోవా అందరికి దేవుడు ఎలా అవుతాడు?